పంధాను మార్చుకున్న ప in arza prasad at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

venkata vara prasad arza's Blogs >> arza prasad

పంధాను మార్చుకున్న ప

పంధాను మార్చుకున్న ప్రచార మాధ్యమాలు!
నిన్నటి దాకా చిరంజీవి పేరునిసైతం చెప్పడానికి సుముఖత చూపని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలు ఇప్పుడు అదే చిరంజీవి వెనుక పడుతున్నట్లు కనిపిస్తుంది. అంటే పది రోజులముందే ఫలితాల వాసన పసిగట్టాయని భావించాల్సి వస్తుంది. ఎందుకు కొరగాని బుడతలకు కలిపించిన ప్రచారం లో పదవ వంతు కూడా ప్రజారాజ్యానికి కలిపించలేదన్నది నిజం కాదా! ఈ నిజాన్ని ప్రజారాజ్యం నాయకులు, కార్య కర్తలు మరీ ముఖ్యంగా చిరంజీవి అభిమానులు జీర్ణించుకోగలరా! వాస్తవాలను విస్మరించి డబ్బుకో, కులానికో అమ్ముడు పోయిన కొన్ని మీడియాలు పి.ఆర్.పి.ని అధినేత చిరంజీవిని ఎన్ని రకాలుగా అపహాస్యం చేసారో అందరికి తెలిసిన భాగోతమే కదా! దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయమన్నచందంగా వ్యవహరించిన పత్రికలు ఎన్నిలేవు! అవగాహన రాహిత్యంగా చిరంజీవికి వ్యతిరేకంగా ఎవరు ఏమ్ వాగినా దానిని గోరంతలు కొండంతలు చేసి చూపించడమే కాకుండా వాటిపై ప్రత్యేక ప్రసారాలు వారి వారి రేటింగులు పెంచుకునేందుకు పడ్డ పాట్లు ఎవరు విస్మరించగలరు?
నేడు అభిమానులారా! సదరు మీడియా సోదరులను సూటిగా ప్రశ్నించండి! "నిజంగా నిర్భయంగా ఎన్నికల ప్రచారం లో మీ పాత్రను మీరు నిర్వహించారా? అని. మీరు ఏ రాజకీయపార్టీకి అమ్ముడు పోలేదా? అని" అడగండి! 'తను తినేది గొంగళిలో మరి వెంట్రుకలు వేరుకోవడం లో అర్ధం ' ఆ పరమాత్ముడికే తెలియాలి! ఏది ఏమైనా చిరంజీవి అధికారం లోకి వస్తాడన్న భయం కావక్చు లేక పశ్చాత్తాపం కావక్చు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలు తమ తప్పుని తెలుసుకుంటున్నందుకు సంతోశపడాల్సిందే. అయితే అంతామాత్రాన మన పని అయిపోయిందని ప్రజారాజ్యం అభిమానులు భావిస్తే మరో తప్పిదానికి ద్వారాలు తెరిచినట్లే. ఎందుకంటే మన కోడిపిల్లలను (గెలిచిన వారిని) ఎత్తుకు పోయేందుకు గద్దలు, రాబందులు కాచుకు వున్నాయి, వాటిని తరిమి కొట్టవలసిన బాధ్యత కూడా మనదేనన్న వాస్తవాన్ని మరువవద్దు, అవసరమైతే అడ్డమైన గడ్డి కరిచేందుకు మన రాజ్యం లో ఎవరైనా వుంటేవారిని పట్టుకుని అధినేతకు అప్పగించవలసిన బ్రుహత్తర బాధ్యత మనది మన అందరిదీ కాదా! రానున్న ప్రజారాజ్యం లో మనం అందరం భాగస్వాములమే అన్నది అక్షరసత్యం. దానిని పటిశ్టపరిచేందుకు మనం నడుమ బిగించాలి. మనకు పదవులు కాదు ముఖ్యం ప్రజారాజ్యస్థాపనే! అందరిలా కాకుండా మనమేంటో మన అభిమానం సత్తా ఏ పాటిదో ప్రజలకు నిరూపింఛాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే అభిమానులారా! రానున్న పదహారు మన ప్రజారాజ్యానికి మరో ఆగస్టు పదహారు కానుంది. విజయోత్సవాలకు సన్నద్దులుకండి! అవినీతి పరుల దుమ్ము దులిపేందుకు ఆయుధాలు సిద్దం చేయండి! హరితాంద్రప్రదేశ్, ఆనందాంధ్రప్రదేశ్ స్థాపనకు శ్రీకారం పలుకుదాం.
జై ప్రజారాజ్యం! జై జై ప్రజారాజ్యం!! జై చిరంజీవ!
ఆర్జా ప్రసాద్
మీడియా & వెబ్ కో ఆర్డినేటర్
చిరు గల్ఫ్ ఎన్.ఆర్.ఐ. వెల్ఫేర్ వింగ్
దుబాయి.



 

A RAJESWARA RAO
good taught about media

Posted at: 1, Oct 2010 1:51 AM
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.