ఎవరన్నారు ఇది సేవయని in In Depth (telugu) at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

namaste namaskaaram's Blogs >> In Depth (telugu)

ఎవరన్నారు ఇది సేవయని

'ప్రజాసేవ కోసమే రాజకీయ ప్రవేశం','ప్రజాసేవకు పునరంకితం' ఇవి రాజకీయ నాయకులు తరుచూ చెప్పే రొటీన్ డైలాగులు.రాజకీయం నిజంగా ప్రజాసేవ కోసమా? స్వాతంత్ర్యానికి పూర్వం రాజకీయ ప్రవేశం చేసిన వారు నిజంగా ప్రజాసేవ కోసమే ఆ పనిచేసేవారు.అయితే ఆధునిక యుగంలో రాజకీయం అంటే స్వయంసేవగా మారింది. రాజకీయ పార్టీ పెడితే వందల వేల కోట్ల రూపాయలు 'పార్టి ఫండ్' కింద అందుతాయి.దాంతో ఆ పార్టి వ్యవస్థాపకులు దర్జాగా బతికేయవచ్హు.అదలా ఉంచితే ఇక ఎం.ఎల్.ఏ,ఎం.పి. టికెట్ దొరికి గెలిస్తే వారి ప్రజాసేవకు అందే ప్రయోజనాలు ఒక్కసారి అవలోకిస్తే ఆ ప్రజాసేవ వెనుక పరమార్ధం మనకు అవగతం అవుతుంది.
ప్రస్తుతం మన పార్లమెంటు సభ్యుడి నెలసరి జీతం 12,000 రూపాయలు.దాంతోపాటు నియోజకవర్గ అభివౄద్ధి కోసం అదనంగా 10,000 రూపాయలు భత్యంగా అందుతుంది.అదిగాక ఎం.పి.ఆఫీసు నిర్వహణ కోసం నెలకు 14,000 రూపాయలు వేరుగా అందుతాయి.ప్రతి పార్లమెంటు సభ్యుడు పనుల మీద తన నియోజకవర్గం నుంచి ఢిల్లీకి వెళ్ళేందుకు తిరిగి వచ్హేందుకు కిలోమీటరుకు 8 రూపాయలు వంతున ట్రావెల్ కన్సెషన్ అందుతుంది (అంటే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఎంపిలు దాదాపు 6,000 కిలోమీటర్లు ప్రయాణం చేయవలిసి వుంటుంది). ఈ లెక్కన 48,000 రూపాయలు ట్రావెల్ కన్సెషన్ కింద ఖర్చవుతుంది.ఇక పార్లమెంటు సమావేశాలు జరిగే సమయంలో ఒక్కో ఎంపికి టి ఎ,డి ఎ ల రూపంలో రోజుకు 500 రూపాయలు అందుతాయి.అంతేగాక ప్రతి ఎంపి ఏడాదిలో 40సార్లు ఢిల్లీకి (భార్యతో లేదా పి ఎతో కలిసి) వెళ్ళివచ్హేందుకు ఉచిత విమాన ప్రయాణ సదుపాయం కల్పించబడుతుంది.అదిగాక ఎంపిలు ఎప్పుడైనా,ఎక్కడికైనా ఎన్నిసార్లయినా ట్రైన్ లో (ఎసి క్లాస్ లో) దేశంలో ఎక్కడికైనా ఉచితంగా వెళ్ళి రావచ్హు.ఇక ఢిల్లీలో ఎంపీకి ఉచిత నివాసం లభిస్తుంది. (కొంతమంది ఎంపిలు దాన్ని అద్దెకు ఇచ్హుకుంటారు అది వేరే విషయం) 50,000 యూనిట్ల వరకు కరెంటు వాడకం ఉచితం.1,70,000 ఫోన్ కాల్స్ ఉచితంగా మాట్లాడుకోవచ్హు. ఏతావాతా ఇవన్నీ కలిపితే ఒక్క పార్లమెంటు సభ్యుడి కోసం ఏడాదికి అయ్యే ప్రజాధన వ్యయం 32,00,000 రూపాయలు (నెలకు 2.66లక్షలు) అంటే ఐదేళ్ళకు ఒక పార్లమెంటు సభ్యుడి కోసం అయ్యే ఖర్చు 1,60,00,000 రూపాయలు అన్నమాట. మన పార్లమెంటులో మొత్తం సభ్యుల సంఖ్య 534. ఐదేళ్ళలో వీరికయ్యే మొత్తం ఖర్చు (534 X 1,60,00,000) 854,40,00,000 రూపాయలు. అంటే దేశ ప్రజలు తమ ప్రతినిధుల కోసం పెడుతున్న ఖర్చు ప్రతి ఐదేళ్ళకు 854.4 కోట్ల రూపాయలన్నమాట.మరి ఈ ఖర్చుకు తగిన 'సేవ' మనకు అందుతోందా?



 

Naresh Naresh jinnah
hai........naaku teliyani vishayanni suluvuga chepparu thanks...

Posted at: 1, Nov 2009 10:39 PM

uma maheeswari maheeswari
Idi kachhitamgaa seva kaadu . Udara poshana ante . nenu meetho ekeebavistunnaa


Posted at: 1, Nov 2009 5:39 AM

uma maheeswari maheeswari
Babooii Namaskaram gaaru inta karchulu pedutunnaaraa vellu . Inni rojulu ee lekkalu naaku teliyane teliyadu andi . thanks andi . Indulo mee aavedana telustu undi lendi. Idi antaa vinna taruvata anipistondi raajakeeyalu ante enduku anta laa padi chastaaro padavi kosam ani.

Posted at: 1, Nov 2009 5:39 AM
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.