దాడి (కథ). in devender at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

Devender Chintala Devender's Blogs >> devender

దాడి (కథ).

దాడి (కథ)..............చింతల దేవేందర్,కేవి ౧,ఉప్పల్,హైదరాబాద్

గొల్ల కొమురయ్య రోజూ గొర్ల మందని అడవికి తోలుకెళ్ళి మేపేవాడు. వాటితో వున్నంతసేపు సంబరంగావుండేది తనకు. అలావుంటున్న కొన్ని రోజులకి అడవిలోంచి ఓ పెద్దమనిషి పులిపిల్లనొకటి తెచ్చి కొమురయ్య గొర్లమందని చూసి ముచ్చట పడి,’ఒంటరిదైపోయిందీ పులిపిల్ల, పెంచుకో కొమురయ్యా! నీకు మంచి జరుగుతుంద’ని అంటగట్టి వెళ్ళిపోయాడు.

కొమురయ్యకి కొద్దిగా భయం వేసినప్పటికీ పులిపిల్లని చూసి ముచ్చటేసింది. మెల్లిగానెత్తిమీద చెయ్యేసి నిమిరాడు. గోముగా తన కళ్ళల్లోకి చూసింది పులిపిల్ల. పాపం ఆకలిగా వుందేమోనని పాలు పట్టిద్దామని నాల్రోజుల కిందే రెండు గొర్రె పిల్లల్ని ఈనిన తెల్లచారల గొర్రె కడుపు కాడ నిమిరాడు కొమురయ్య. తెల్లచారల గొర్రె కర్థమైపోయి మెల్లిగా లేచి నిల్చుంది పులిపిల్ల వైపు చూస్తూ. దాని ముందటే పులిపిల్లని చేతుల్లోకి తీసుకుని గొర్రె చనుమొనని అందించాడు. పులిపిల్లకి తాగే అలవాటు లేనట్టుంది. తనే పితికి పాలు పులిపిల్ల నోట్లోకి వంపాడు కొమురయ్య.

అప్పటికి పులిపిల్ల కొంచెం హుషారుగా నిల్చుంది. మెల్లిగామెల్లిగా అడుగులేసింది. గొర్రెపాలు పులిపిల్లకి అమృతంలా పనిచేసాయి. దాని నత్తనడకని చూసి సంబరపడిపోయాడు కొమురయ్య. సాయంత్రమవడంతో నెత్తిన పులిపిల్లనెత్తుకుని గొర్లమందతో ఇంటికి బైల్దేరాడు. అలారోజూ అడవిమార్గాన మేపడానికి పులిపిల్లతో సహా వచ్చేవాడు కొమురయ్య. లేలేత గరికపోసల్ని, ఆకుల్నిపులిపిల్లకి గొర్రెపిల్లల్తో సహా తినిపించడం అలవాటు చేశాడు కొమురయ్య.
* * *

రోజురోజుకి గొర్లమందలో తిరుగుతూ, గడ్డి తింటూ బలసిపోయి అందర్లో కల్సిపోయినా ఎందుకో తేడా అన్పించసాగింది పులిపిల్లకి. ఆకులు, గడ్డిగాదం ఏదికన్పించినా వదలకుండా తినేస్తుంది పులిపిల్ల. ఇప్పుడు పులిపిల్ల పులిగా ఎదిగింది. ఎంతగా తిన్నా ఇంకా తినాలన్పిస్తుంది పులికి. గొర్రెలు మాత్రం కాసేపు గడ్డిమేసి చాలనుకుంటూ నీడపట్టున నెమరువేసుకుంటూ సేదదీరేవి. కాని పులికి మాత్రం ఎంత తిన్నా కడుపు నిండనట్టుగానే వుండేది. గడ్డి గాక ఇంకా ఏదో తినాలని ఏదో చేయాలని అన్పిస్తుండేడిది.

ఏవిటో అర్థంగాని పరిస్థితి పులికి.
ఓ రోజు అలా ఆలోచిస్తూనే అడవిలోపలికెళ్ళిపోయింది. అక్కడే కుక్కపిల్లలా వున ఓ నక్క ఎదురైంది పులికి. పులిని చూసి దౌడు తీసింది నక్కభయంతో. ఇదేం తనకు పట్టనట్ట్టుగా పచ్చగడ్డి, ఆకులు తినసాగింది బలిసిన పులి. నక్క పక్కన దాక్కుని పులి చర్యలకి భయంతోనూ, వింతగానూ చూసింది. తనపై పడి తనని నంజుకి తింటుందేమోనని భయపడ్డది నక్క.
నక్కని చూసి భయపడసాగింది గడ్డి మేస్తున్న పులి.

నక్క నవ్వుకుంది, పులి తనపట్ల భయపడ్డం చూసి. ఈ పులి తనను తినదు గాక తినదు తనకి ఏ ద్రోహం చేయదు అని నిశ్చయం చేసుకుని, పులికి చెప్పాల్సింది చాలా వుందనుకుని తన విద్యని పులికి నేర్పాల్సిందేనని పులి వైపు బెరుగ్గా చూసింది నక్క. నక్క వైపు చూసి పులి భయపడిపోయింది లోగడ తన యజమాని కోడిపిల్లని ఓ కుక్కపిల్ల గొంతుపట్టుకుని పీక్కుని తిన్న వైనం గుర్తుచేసుకుంటూ.
పులి కండ్లల్లోకి అమాయకంగా చూస్తూ నక్క ’ఈ ఆకులు గడ్డిగాదం తింటున్నావా? నీకిది సరిపోదు. ఏకంగా జంతువుల్ని వేటాడి పచ్చిమాంసాన్ని తినాలి. పైగా నీ జాతి అలాంటిది.
నువ్వెంత గడ్డి తిన్నా ఏ మూలకి సరిపోదు’
అని పులికి హితబోధ చేసింది నక్క
పులి నివ్వెరపోయింది నక్క మాటలకి. ప్రాణాలు తీయడం తనకు చేతగాదని ఆకులు, కొమ్మలు తినడంలోనే హాయి వుందని తనకవంటేనే ఇష్టమని చెప్పిందిపులి అమాయకంగా.

పులి మాటలకి నక్క విసుక్కుంటూ," ఆకులు కొమ్మలు, గడ్డిగాదం తినేవి బర్లు,గొర్లని, వాటిని తిన్నవాటిని నీవు తినాలని నీజాతి అలాంటి జాతి"అని పులికి నూరిపోసింది నక్క. పులికి నక్క చెప్పిన వైనం నచ్చింది. ’ఔను నిజమే! తను ఎంత తిన్నా కడుపు నిండడం లేదు, మాంసాన్ని తింటేనే హాయి’ అని తనకు తాను తీర్మానించుకుంది పులి.
నక్క తనలోని ఆలోచనల్ని పులి మెదట్లోకి దింపడంలో సఫలికృతురాలైంది. విజయగర్వంలా ఆనందపడిపోతూ, ఇహ తనూ రోజు వేడివేడి రక్తంతో మాంసం పులిపుణ్యాన తినొచ్చనుకుంది.

తనంటే ఏవిటో తన చర్యలు ఎలా వుండాలో నక్క ద్వారా పులి తెల్సుకుంది. నక్కని సగౌరవంగా తన గొర్లమందకి పరిచయం చేసింది పులి ఓ పుణ్యదినాన. చిత్రమేవిటంటే ఇన్నిరోజులు సఖ్యతగా వున్న పులిని చూసి గొర్లమంద భయపడలేదుగాని పీలగా వున్న నక్కని చూసి జడుసుకున్నాయి. నక్క చాలా జిత్త్తులు చేస్తాయని అందరూ అంటుండగా విన్న గొర్లమంద. ’నక్క వల్ల మీకు ఏం భయంలేదం’టూ నక్క తరుపున భరోసా ఇచ్చింది పులి.

అలారోజూ నక్క రావడం పులి దాని దగ్గర పాఠాలు నేర్చుకోవడం, వెళ్ళేముందు గొర్లమందని కల్వడం జరుగుతుండేడిది. రోజులు గడుస్తున్నాయి. రోజులతో పాటు గొర్లమందలో గొర్లు గూడ తక్కువ కావడం గొల్ల కొమురయ్య, గొర్లు గమనించాయి.


ఇన్నాళ్ళు పాలు పోసి పెంచిన గొల్ల కొమురయ్యని, సఖ్యతగా వుంతున్న గొర్ల పట్ల ప్రామాభిమానాల్ని వదిలేసి కొత్తగా వచ్చిన నక్కపట్ల విపరీతమైన అభిమానాన్ని పెంచుకుంది పులి. నక్క ఏ పని తనకి పురమాయించిన క్షణాల్లో చేసేది పులి. తనలో పశుత్వాన్ని, క్రూరత్వాన్ని పురిగొల్పిన నక్కకి సలాం చేసేది పులి. తను తిని వదిలేసిన మాంసాన్ని, అవశేషాల్ని ఆబగా పరమాన్నంలా తిని తందనాలాడేది నక్క.

నవ్వుకునేది పులి. ప్రస్తుతం తనకి గడ్డి తో పనిలేదు. రోజు ఓ గొర్రెని తినిపారేసేది పులి.
పక్కనే నక్కివున్న నక్క ఆవురావురు మంటూ తినేది పులి వదిలేసిన కళేబరాన్ని రోజుల తరబడి.

గొర్లమందతో కల్సి వెల్తున్న వేళ గొర్రెలకి అనుమానం, భయం కల్గేది పులిని చూసినపుడల్లా. దాని చూపుల్లో లోగడ వున్న అమాయకత్వం, చల్లదనం, జాలి, కరుణ కరువై క్రూరత్వం, పౌరుషం కనబడ్తూండేడిది.
గొర్రెలైనప్పటికీ భగవంతుడు అంతో ఇంతో శక్తి యుక్తి ఇచ్చాడుగా. గొర్లమంద సామూహికంగా ఓకసారి కల్సి కూడబలుక్కున్నాయి. ఇలా పులిని వదిలేస్తే తమ ఉనికి లేకుండా పోతుంది ఇప్పటికే మంద పల్చనైంది. పులిని ఎలాగైనా ఎమార్చాలని తీర్మనించుకున్నాయి గొర్రెలన్ని.

నక్క తెల్లచారలున్న గొర్రెని కోరడంతో పులి తెల్లచారల గొర్రె కోసం చూసింది. ఇదంతా గమనిస్తున్న గొర్రెలు ఒకచోట చేరి తమకున్న
వాడైన కొమ్ములతో పదివైపులా చేరి మద్యన తెల్లచారలున్న గొర్రెనుంచిపులిని చీల్చి చెండాలని నిశ్చయించుకున్నాయి.
పులి ఒక్క ఉదుటున తెల్లచారల గొర్రెపైకి దూకింది. నలువైపులా వున్న గొర్రెలన్ని ఒక్కసారిగా తలదించకుండా
తమ మొనదేలిన వాడైన కొమ్ములతో దాడి చేయడానికి తెల్లచారల గొర్రె వైపు ఒక్కసారిగా వచ్చేసాయి.
* * *



 

Devender Chintala Devender
thank you


Posted at: 15, Feb 2012 1:02 AM

TP Blogger
Nice, please keep writing!

Posted at: 10, Feb 2012 6:06 AM
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.