"నివాళి" (కథ) in devender at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

Devender Chintala Devender's Blogs >> devender

"నివాళి" (కథ)

"నివాళి" (కథ)

స్వధర్మే నిధనం శ్రేయ: పరధర్మోభయావహ:

బుక్క శంకరయ్య కరీంనగర్లో మంచి పేరొందిన డాక్టర్. దీర్ఘవ్యాధులని, మొండి వ్యాధులని
నివారించడంలో మంచి హస్తవాసి కల్గిన డాక్టర్.అందరూ ఆయన్ దగ్గరికి మంచికైనా
చెడుకైనా వచ్చి స్వంత సమస్యల్ని ఆరోగ్యసమస్యల్ని సంప్రదించేవారు. ఆయన్ కేవలం డాక్టర్ గానే
కాకుండా కౌన్సిలింగ్ ఇవ్వడంలో ఆరితేరినవాడు. విసుగు, వెగటు చెందకుండా వచ్చినందరికి
పరిష్కారమార్గం చూపుతుండేవాడు. మంచి మాటకారి. మితభాషి. సౌమ్యంగా, సరళంగా మాట్లాడేవాడు.
మంచి హాస్యచతురత కనబరుస్తాడు. సామాజిక విశయాల్ని సైతం హాస్యధోరణిలొ చెప్పేవాడు.
డా. శంకరయ్య తన బాల్యంలో ఎదుర్కొన్న పేదరికాన్ని దూరం చేసుకోవాలనే కాంక్షతో,
తన త్ండ్రి, మామగార్లు ఆరోగ్యలేమితో అస్వస్థులై చనిపోయారనే దిగులు వీపరీతంగా వుండటం,
తాను డాక్టర్ కావడానికి కారణమైంది.
అన్నయ్య పంచన చేరి తన వైద్యవిద్య పూర్తి చేసుకున్నాడు శంకరయ్య.
ప్రాక్టీస్ తన స్వగ్రామమైన మానకొండూర్లొ ప్రారంభించి అక్కడి ప్రజల మన్ననలు పొందాడు.
అందులో భాగంగా అన్నయ్య కూతుర్లని సైతం వైద్యవృత్తిలో రాణించేలా చేసి, వివాహం సైతం జరిపించి
అన్నయ్య పట్ల ఋణాన్ని తీర్చుకున్నాడు. అమ్మకి, అమ్మమ్మశంకరమ్మకి తనదైన రీతిలో వైద్యాన్ని
నెరపి వారితో కొనియడబడ్డాడు శంకరయ్య.
అమ్మమ్మ ఆయుష్షుని శతసంవత్సరాలకి పెంచిన ఘనత డా. శంకరయ్యదే అని అభినందించక తప్పదు.
అన్నయ్యలన్నా,వదినెమ్మలన్నా శంకరయ్యకి మమకారం. తన పిల్లల్తో సఖ్యతగా వుండేవాడు.
వారికిష్టమైన చదువుల్ని చెప్పించివారికనుగుణమైన పిల్లల్తో పెండ్లిళ్ళు సైతం చేయించాడు.
వారికి విదేశాల్లో ఉద్యోగాలు కల్పించడంలో ప్రధాన బాధ్యతని పూర్తి చేశాడు.
తన సోదరి కూతుర్ని తన అబ్బాయిల్లో ఒకరితో వివాహం చేసుకోవాలనే అమ్మ కోరికని మాత్రం
తీర్చనందులకు అప్పుడప్పుడు సమీపబంధువులతో చెబుతూ బాధపడేవాడు డా.శంకరయ్య.
అన్నీ అనుకూలంగానే జరిగాయి డా.శంకరయ్యకి. కాని పిల్లలు దూరం అవడంతో
వారి ఎడబాటుని ఎందుకో జీర్ణించుకోలేకపోయాడు.
తన స్వగ్రామమైన మానకొండూర్ లో అందరికి వైద్యసేవలు మాటసాయం అందించి కరీంనగర్
పట్టణం చేరుకుని అక్కడకూడ తన వృత్తిధర్మాన్నిసజావుగా నెరపాడు డా. శంకరయ్య.
వైద్యాధికారిగా ఎన్నో బహుమతులు పొందాడు. పిల్లల కోరిక నిమిత్తం హైదరాబాద్ కి
బస మార్చాడు తనకిష్టం లేనప్పటికీ డా.శంకరయ్య.
అప్పటి వరకు తన చెప్పుచేతల్లో వున్న ఆరోగ్యం స్వాధీనం తప్పుతున్నట్టుగా తెలియడంలో
వైద్యం తనకు సరిపడకపోవడంతో తనకిష్టం లేనప్పటికీ కార్పోరేట్ ఆసుపత్రిలో వైద్యంకొరకు చేరాడు
బందువుల ప్రోధ్బలంతో డా.శంకరయ్య. అందరిమద్య వున్నప్పటికీ ఒంటరితనం ఫీలయ్యాడు డా.శంకరయ్య.
కడుపేదరికం నుంచి వచ్చిన తను చరాస్థులు,స్థిరాస్థులు సంపాదించి స్తితిమంతుడుగా ఎదిగినప్పటికి
ఏదో తెలియని నిర్లిప్తత, ఆత్మన్యూనత శంకరయ్యలో కన్పించసాగింది. మెల్లిమెల్లిగా స్థితిగతులు,
పరిస్థితులు తన ఆరోగ్యాన్ని తినేయసాగాయి.
బలహీనత బలంగా చోటు చేసుకుంది ఆయనలో. శంకరయ్యకి తెల్సు తన శరీరం
దిగజారిపోవడానికి కారణం. కాని ఏమీ చేయలేని పరిస్థితి. చేతులు దాటిపోయాయని భావించేవాడు.
యాంత్రికంగా తన శరీరాన్ని ఆసుపత్రికి తరలిస్తున్న తరుణాన శంకరయ్య కండ్లల్లోంచి
వచ్చే కన్నీటిధారలు సన్నగా రాలాయి. కండ్లనీళ్ళు కండ్లల్లోనే కుక్కుకునే ప్రయత్నం
చేయసాగాడు డా.శంకరయ్య.
తన జీవితం చరమాంకంలో చేరిందని తెల్సుకున్నాడు. ఎక్కడో వున్న అమ్మ, అమ్మమ్మల
ఆర్తనాదం తనకింపుగా వినసాగింది డా.శంకరయ్యకి. రారమ్మంటూ పిల్చినట్టుగా తోచింది తనకి.
ఐసీయూలో వున్నప్పటికీ శంకరయ్య శరీరం ఏదో వెచ్చని ఊపిరి తనను ముద్దాడినట్టనిపించింది.
నీలినీడన ఎప్పుడో గతించిన అమ్మ, అమ్మమ్మ శంకరమ్మ తనవైపు నవ్వుతూ రారమ్మంటూ పిలిచినట్టయింది.
స్ట్రెచర్ పై పడుకున్న తన మూతికున్న వెంటిలేటర్ శంకరయ్యకి ఇబ్బందిగా తోచింది.
అస్వస్థతతో వున్నప్పటికీ ఏదో బలం చేకూరినట్టన్పించింది శంకరయ్యకి.
అమ్మని, అమ్మమ్మని మనసులో తల్చుకుంటూ వెంటిలేటర్ పైప్ ని లాగేసాడు డా. శంకరయ్య.
ఎందరికో ఊపిరిలనందించిన డా శంకరయ్య శ్వాస ఆగిపోయింది.
శతసంవత్సరాల ఆయుష్షుని తనవైద్యసేవలందిన అమ్మమ్మ శంకరమ్మ తన పేరు పెట్టుకున్నందులకేమో
ఋణాన్ని తీర్చుకున్న శంకరయ్య పాపం అర్ధాంతరంగానే అర్ధాయుష్షుతో తనువు చాలించాడు.
ఏది ఏమైనప్పటికీ తన బాధ్యతల్ని సజావుగా నిర్వహించి చల్లగా అంతర్యామిలోకి
అంతరార్ధమయ్యాడు డా. శంకరయ్య.
అంకితం: ఇటీవలే స్వర్గస్థులైన బావగారు శ్రీ డా. బుక్క శంకరయ్య గారికి....................... చింతల దేవెందర్.



 

Devender Chintala Devender
thank you

Posted at: 15, Feb 2012 1:03 AM

TP Blogger
very touching...

Posted at: 10, Feb 2012 6:07 AM
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.