దారి తప్పిన కొడుకా..........నన్ను క్షమించు in hemabobbu at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

bobbu hema's Blogs >> hemabobbu

దారి తప్పిన కొడుకా..........నన్ను క్షమించు

అప్పుడే తెలతెలవారబోతోంది. సూరిడు రోమాలను నిక్కపొడుచుకొని తొంగి తొంగి మేఘాలను దాటి ముందుకొచ్చి చూస్తున్నాడు. మా మొబైల్ క్లినిక్ తారురోడ్లపై సర్రుమని దూసుకొని పోతున్నది.

డెంగు ఫీవర్ తో పల్లెలన్ని గడగాడలాడుతున్నాయని మా మెడికల్ కాలేజి కి ఎన్నెన్నో వినతులు రావడం మూలాన ఫ్రెష్ మేడికోస్ అయిన మమ్ములను ఇలా పల్లెలకి పంపారు. కుర్రకారంతా ఆనందముతో కొత్త సినిమా పాటలకు లయబద్దంగా హం చేస్తూ ఊగుతున్నాము. మా డ్రైవర్ కూడా కుర్రవాడు కావడం మూలాన ఒడుపుగా బండిని పరిగెత్తిస్తున్నాడు. గతవారం నుండి మేము, మా లేడిడాక్టర్స్ రాత్రనక పగలనక పల్లె పల్లెకి మా క్లినిక్ ని తిప్పుతున్నాము.

ఉన్నట్లుండి మా డ్రైవర్ గావుకేక పెడుతూ మా వెహికల్ ని ఒక్క కుదుపుతో ఆపాడు. అలా చూద్దుం కదా, ఒక ముసల్ది రోడ్డుమీద ప్రాణం లేనట్లు పడి ఉంది. మాకందరికీ ఒక్కసారిగా గుండె ఆగినంతపనైంది. మా డ్రైవర్ గావుకేకలు పెడుతూ, ఒక్కసారిగా క్రిందకు దూకి, ఈ ముసల్ది చావడానికి హాస్పిటల్ బండే దొరికిందా అని తిడుతున్నాడు. ఆతను మావైపు చూస్తూ తానెంతో జాగ్రత్తగా బండిని నడుపుతున్నప్పటికీ ఈ ముసల్ది ఒక్కసారిగా రోడ్డుమీదకురికిందని చెప్పాడు.

ఆమెకు గాయాలేమి లేనప్పటికీ సృహ తప్పి పడి ఉంది. వెంటనే ఆమెను మా మొబైల్ క్లినిక్ లోనికి మార్చమని నా స్నేహితులతో చెప్పాను. నేను నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్లి ఆమె తలను నా ఒడిలోనికి తీసుకోని ఆమె పల్స్ చూస్తూ కొంచం వాటర్ తీసుకోని ఆమెపై చల్లాను. నెమ్మదిగా ఆమె కళ్ళు తెరచి చూసి మమ్ములను చూసి భయపడుతూ లేవబోయింది. ఆమె పల్స్ చాల తక్కువగా ఉండటం మూలానా ఆమె కొద్దిరోజులుగా ఆహారము తీసుకోలేదని గ్రహించి ఆమెను లేవవద్దని చెప్పి సలైన్ ఎక్కించాము. మరో మూడు గంటల తరువాత ఆమె లేచి కూర్చున్నది. ఆమెకు మా దగ్గరున్న పళ్ళ జూస్ ని కొంచం కొంచం తాపాము. ఆహారంతో ఆమె కొంచం శక్తీ పుంజుకున్నది. మా వాళ్ళందరూ మేము చేరవలసిన ఊరు రాగానే తమ తమ కిట్లతో అక్కడ ఎదురుచూస్తున్న పేషంట్లను చూడడం మొదలుపెట్టారు. సీరియస్ కేసులన్నీ ముగించుకొని, మిగిలినవారిని మరుసటిదినం పక్కపల్లెకి వస్తామని అక్కడికి రమ్మని చెప్పి పంపాము. చీకటి పడడం మొదలుపెట్టింది.

ఇక ఆ రోజుకి పేషంట్లను చూడడం ఆపి తిరుగుప్రయాణం మొదలుపెట్టాం. మా వాన్ ఎక్కగానే ఆ ముసలమ్మా ఇంకా అక్కడే కూర్చోని ఉంది. అమ్మా నీవెక్కడకి వెళ్ళాలి అని అడిగితె తానొక అనాథనని తనకు ఎవ్వరూ లేరని, తనకు గమ్యం లేదని చెప్పింది. నాయనా నన్ను అదిగో అక్కడ కనిపిస్తున్న కొండ పక్కన గుడి దగ్గర దిగబెట్టండి అని అన్నది. తానూ అక్కడ దొరికే బిచ్చంతో బతుకుతున్నానని చెప్పింది. చూడడానికి ఆమె చాల పొడవుగా ఈ వయసులో కూడా నిటారుగా తెల్లటి చాయతో ఉంది.

ఆమెను తీసుకోని వెళుతూ మా తిరుగు ప్రయాణంలో నాకున్న జిఙ్ఞాసతో ఆమె గురించి తెలుసుకోవాలన్న తలపుతో అమ్మా నిన్ను చూస్తుంటే నాకెందుకో ఊరిలో ఉన్న మా అమ్మ గుర్తుకొస్తున్నాది అని అన్నాను. ఆమె నవ్వుతూ నాయనా నేను ఒక దురదృష్టవంతురాలిని. నా కన్నబిడ్డకు లేని ప్రేమ నీకు కలుగుతున్నందుకు నాకు చాలా సంతోషముగా ఉంది అంది. అమ్మా నీకెంతమంది పిల్లలని అడిగితే నాకు ఏడుమంది పిల్లలంది. మా మాటలు ఆసక్తి పుట్టించడముతో నా తోటి స్నేహితులు కూడా వినసాగిరి. మరి అంతమంది పిల్లలుండి నీవెందుకు అనాథవయ్యావు అని అడిగితే పూర్వజన్మ ప్రారబ్దము, ఈ జన్మ ప్రాపకము................ అని అన్నది.

కొడుకు కొడుకంటూ నేను ఆరుగురు ఆడపిల్లలను కన్నాను, ఆ తరువాతే నా కలల పంట పుట్టాడు. లేక లేల పుట్టిన వాడిని కాలు క్రింద పెట్టనీయకుండా పెంచాను. మారాజు మా ఆయన అప్పటికి అంటూనే ఉండేవాడు, వాడిని అతి గారబం చేసి చెడగొట్టామాకే అని.

నేను వింటేనా............

మా ఆయన మండలానికే పెద్ద డాక్టర్ కావడం మూలాన మాకు డబ్బుకు లోటు లేకుండే. మా చుట్టుపక్కల పల్లెలలో ఉంటున్న మా ఆడబిడ్డల పిల్లలు కూడా మాకాడే ఉండి స్కూల్కి పోతాఉండిరి. మా ఆయనది పెద్ద సర్కారు ఉజ్జోగం కావడం వలన అందరూ నా మాటకు ఎదురుచెప్పేటోళ్ళు కాదు. నేను వస్తా ఉంటేనే ఊరు ఊరంతా ఆ మారాజు బార్య వత్తన్నారని నన్ను గౌరవించేటోళ్ళు.

నా ఒడ్దూ పొడుగూ చూసి, మంచి మామిడి పండు రంగు తేలి ఉన్న నా వళ్ళు చూసి, చదువు లేకపోయినా మా అత్తగారు ఏరికోరి నన్ను కోడలిగా చేసుకొన్నారు.

అమ్మ మాటకి ఎదురు చెప్పని మా ఆయన్ని నా మాట వేనేటట్లు చేసుకొన్నాను నేను కొద్ది రోజుల్లోనే.

వరసగా బిడ్డలను కంటా ఉంటే కూడా నా వయస్సు కరగకుండే. అది నాకింకా గర్వాన్ని పెంచింది. చేతినిండా డబ్బులు ఆడతాఉండె. ఇంటిని సంసారాన్ని నువ్వే చూసుకోవే అంటూ నా చేతికే డబ్బులు ఇచ్చేటోడు నా మారాజు.

మా అత్తని చిల్లిగావ్వలా తీసిపారేసినా. నా బిడ్డలకి ఆమెను ఆయాను చేసినా. తన కొడుకు పెండ్లాము చెప్పినట్లు ఆడుతున్న యవ్వారము ఆమె కనిపెట్టినా పాశాన్ని వదలుకోలేక నే చెప్పినట్లు వినేది.

నలుగురు ఆడుబిడ్డలకు, ఆళ్ళ పెండ్లిళ్ళ పెట్టుపోతలకు, పండగలకి కొత్త బట్టలు తీయమని మారాజు డబ్బులు ఇస్తే, నేను నాసిరకం బట్టలు కొని వాళ్ళ మొకాన వేసేదాన్ని. నగలేసుకొంటే నాణ్యత పెరగదని అది నాకు మల్లె పుట్టుకతో రావాలని ఎగతాలిచేసేదాన్ని. వాళ్ళు విని మిన్నకుండేవారు ఏమిచేయలేక. మిగిలిన డబ్బులు దాచి నా కన్నడు అడిగినప్పుడల్లా వానికి కావాలసినంత ఇచ్చేదాన్ని.

మా అన్నయ్య వచ్చి వాళ్ళ కష్టాలూ ఏకరువు పెట్టగానే అక్కడ వాళ్ళు వ్యవసాయం అచ్చిరాక అష్టకష్టాలు పడుతుంటారని దయ తలచి, కొంచం మా పుట్టింటికి కూడా పంపేదాన్ని. మా చెల్లెలది వెన్నలాంటి మనసంటూ పొగుడుతూ......... అటు తిరిగి ఇంతేనా ఇచ్చేది అంటూ దెప్పుతూ యెళ్ళేవాడు.

నా కొడుకు ఎంత అల్లరి చేసినా నేను ఓర్చుకునేదాన్ని, కాని మా మారాజు మాత్రం చెండాలు వలిచేసేవాడు. అబ్బో ఆయనంటే సింహస్వప్నం వానికి. అందుకే చాటుమాటుగా ఆయనకి కనిపించకుండా తిరుగుతుండేవాడు. వాడికి బోజనంలో పూటకొక కూరలేనిదే ముద్ద దిగేది కాదు. వయస్సు పెరిగేకొద్ది వానికి చెడు సావాసాలు మొదలయ్యాయి.

బీడిలతో మొదలెట్టి ఆడు తాగుడు, జూదం కూడ అలవాటుపడ్డాడు. బడి ఎగ్గోట్టి తిరగడం మొదలుపెట్టాడు. వడ్డీ వ్యాపారం చేస్తూ మా రాజుకి తెలియకుండా నేను దాచిన లెక్కని, నేను కుదవబెట్టుకొన్న సోత్తుల్ని పట్టుకుపోయ్యేటోడు. నాలుగు రోజులపాటు ఏడాడనో తిరిగి ఇంటికోచ్చేటోడు. రోజుకొక గొడవ ఇంటిమీదకు తెచ్చేటోడు. అవి వాళ్ళ నాన్నకు తెలియకుండా దాచడానికి నేను అష్టకష్టాలుపడేదాన్ని.

వాడు ఓ రోజు నా ఆడబిడ్డ కూతురిని బలవంతంగా చెరచబోయాడని ఆ పిల్ల నాన్న వచ్చి నాతో అంటే "ఆడు మొగాడు, మీ పిల్ల ఎంత బరితెగించి ఉంటే, దాని మీద చెయ్యివేసి ఉంటాడు ఆడు అని అన్నా". ఆ రోజు ఆయన నన్ను చూసిన చూపు ఈనాటికి నాకు ఎరికే. ఆ మారాజు మొహం చూసి మిమ్ములను వదిలిపెడ్తాండానంటూ కన్నీళ్ళతో వెళ్ళిపోయాడు. ఆ సంఘటనతో మిగిలిన ఆడుబిడ్డల పిల్లలను కూడా చదువు మాన్పించి వాళ్ళని ఇంటికి తీసుకుపోయిరి. ఆ రోజుతో నాకు ఆడుబిడ్డలకు ఉన్న బందాలు తెగిపోయాయి. అప్పటికే నా కూతుళ్ళ పెండ్లిళ్ళు అయ్యాయి.

నా కొడుక్కి చదువు వంటబెట్టలేదు, కాని నా కూతుళ్ళు బాగా చదివిరి. ఆళ్ళ నాయన చెప్పినట్లు వాళ్ళు వింటా ఉండిరి. నన్ను చూస్తేనే నా కూతుళ్ళకు వణుకొచ్చేది. వాళ్ళు పొద్దున్నే నా ఎదురుగా వచ్చినా సహించేదాన్ని కాదు. ముదనష్టపుమొహాలంటూ కన్నబిడ్డలని ఈసడించేదాన్ని. ఏదైనా వాళ్ళ నాయనమ్మ తో పంచుకోనేవాళ్ళు. ఆమె పోయాక మారాజు వాళ్ళని మిక్కిలిగా సాకాడు.

ఏడుస్తూ............ ఇదిగో ఆ పాపాన్ని ఇలా అనాధలా మోస్తున్నా అన్నది.

నాయనలారా, ఒక కూతురికి మీలాగే డాక్టరీ చదవడానికి మద్రాస్ లొ సీటు వచ్చినప్పుడు అబ్బో మారాజు చాల అనందముతో ఊరంతా స్వీట్లు పంచిపెట్టాడు. పెద్ద కూతురిని మా దూరపు చుట్టాల అబ్బాయి ఆమెరికా లో చదవతా ఉండేవాడు, ఆడికిచ్చి పెళ్ళి చేసాడు. రెండోదాన్ని నేను వద్దువద్దంటున్న, మా ఊరిలోనే టీచర్ గా పనిచేసే మా ఆడబిడ్డ కొడుకుకే, వాళ్ళు ఇద్దరూ ఇష్టపడ్డారని పెళ్ళి చేసాడు. మూడోది తనతోనే డాక్టరీ చదువుకొనే కుర్రాడినే పెళ్ళాడింది. నాలుగోదానికి కాలేజి లెక్చరర్ తో పెళ్ళయ్యాక దానికి కూడా లెక్చరర్ ఉజ్జోగం వచ్చింది. ఐదోదాన్ని, ఆరోదన్ని, ఇంజనీర్లుగా పనిచేస్తున్న అన్నదమ్ములకిచ్చి చేసాడు.

ముసల్ది చచ్చేటప్పుడు ఆయన దగ్గర మాట తీసుకొందట మరి. తన కూతుళ్ళ మట్టి పిసుక్కునే రాతల్లాగా కాకుండా, తన మనవరాళ్ళ బతుకుల్ని మంచిగా ఉజ్జోగం చేసే వానికిచ్చి పెళ్ళిచేయమని.......... ఆ ఒక్క విషయంలో ఆయన నా మాట వినలేదు. లేకుంటే ఎవడో ఒక అనామకుడకిచ్చి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి కొడుక్కి ఇంకా కొంచం ఆస్తి మిగలబెట్టి ఉండేదాన్ని.

ఓ రోజు మారాజు తన తోటివాళ్ళతో మాట్లాడుతున్నపుడే ఆయనకి గుండె ఆగిపోవడంతో చచ్చిపోయాడు. అప్పటికప్పుడె పెద్దసుపత్రికి తీసుకపోయినా లాభం లేకపాయె. ఊరంతా కన్నీళ్ళతో ఆయనను సాగనంపిరి. నా పంచప్రాణాలయిన నా కొడుకు, నేను మిగిలాం అంత లంకంత ఇంటిలో. ఆయన పోవడంతోనే వాడి ఆగడాలు స్రుతి శృతిమించాయి రోజు రోజుకి. ఆ రోజుతో నా పతనము కూడా మొదలయ్యా.



 

Raja Pulluru Raja
చాలా చక్కగా ఉందండి ............!

Posted at: 12, Apr 2012 8:40 AM
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.