Active Blogs | Popular Blogs | Recent Blogs ఆయన పోవడంతోనే ఆ ఇంటి కళాకంతులు పోయాయి. పల్లెల నుండి వచ్చి ఎంతోమంది మా ఇంట తిని బడికి పోయేవాళ్ళు. వాళ్ళని ఆయన ఎంతో ప్రేమగా చూసేవాడు. పల్లెలలో కూడా కాన్వెంట్లు తెరవడంతో ఇప్పుడూ ఎవ్వరూ మా ఇంటికి పై చదువుల కోసం రావడం లేదు. అది నిజమే కావచ్చు లేక నా కొడుకు ఆగడాలు భరించలేక కావచ్చు.
ఒకరిద్దరు ఆడపిల్ల తల్లితండ్రులు కూడా వాడి గురించి మా మారాజు బతికున్నరోజులలోనే చెబితే, ఆయన వరకు పోనీకుండా నేను పరువుపేరుతో, డబ్బుతో వాళ్ళ నోళ్ళు నొక్కేసాను. ఇప్పుడు వాడికి పిల్లనిచ్చే వాళ్ళు కూడా లేకపోయిరి.
నేను మా బందువులందరిని బ్రతిమాలి మా కుటుంబ గొప్పతనాన్ని చెప్పి ఒక పిల్లని పట్టా. దాన్ని నా కొడుకిచ్చి పెళ్ళి చేస్తే అది నా క్రింద కుక్కిన పేనులా పడి ఉంటుందని తలచా.
పెళ్ళి అయినాది. చాలా ఆడంబరంగా వాని పెళ్లి చేశా. మారాజు పోయిందే నా కూతుళ్ళు నా ఇంట అడుగుపెట్టలే. నన్నూ, వాడిని చూస్తే భయం వాళ్లకి నిలువెళ్ళా. పెళ్ళికి మాత్రం పిలువనంపా. అల్లుళ్ళను, బిడ్డలను తీసుకురాక ఆళ్ళు మాత్రం వచ్చి ముహూర్తం అయిన వెంటనే పని ఉందని చక్కాపోయిరి.
కాని నా కొడుకుతో అది పది రోజులు కాపురం చేసిందో లేదో, నాకు విడాకులు కావాలంటూ, దాన్ని నా కొడుకు, నేను కలిసి చంపచూస్తాన్నామంటూ ఠానా లో కేసు పెట్టింది. దాని కడుపులో మా వంశాంకురం ఉందని అంటూ ఆస్తి కోసం కోర్టుకెక్కింది.
ఆడు, ఆ పిల్ల ఏమి రాజీ పడ్డారో నాకయితే తెలవదు, కాని నాలుగు రోజులకే అది కాపురానికి తిరిగి వచ్చింది. ఆ రోజు రాత్రి వాళ్ళు నా గొంతు నులుమి చంపాలని చూసారు. ఇది చస్తే కాని మిగిలిన ఆస్తి దక్కదంటూ, అంతా కూతుళ్ళకు దోచి పెట్టిందంటూ వాళ్ళు అనుకోవడం నాకు వినబడింది.
నేను చచ్చినాననుకొని నన్ను బండిలో వేసి నా కొడుకు ఊరవతల పారేసాడు. ఎవరో సాధువు నన్ను చూసి గుక్కెడు నీళ్ళు తాపి ప్రాణం నిలబెట్టి తన తోవన తాను పోయాడు.
చెడి కూతుళ్ళ ఇళ్ళకి పోలేక, ఆళ్ళకి నా మొఖం సూపలేక ఇదిగో ఈ గుడి మెట్లమీద అడుక్కుతిని బతుకుతున్నా. ఆ మారాజు బతికుంటే నాకు ఈ దుర్గతి పట్టేదికాదు. నేచేసిన పాపమే శాపమైనాది.
కొడుకు కొడుకంటూ ఆడిని గుండెలపై పెంచా. ఆడిని తప్పుదారిలో నడిపించా. నే తప్పు చేసినా. అందుకే బతికుండగానే కొరివి పెట్టాడంటూ కన్నీరు కారుస్తున్న ఆమెను ఊరడించి మా మెడికల్ కాలేజ్ లోని ఒల్దేజ్ హోం లో చేర్చాము.
ఆ క్షణం నేను తెలుసుకొన్నాను ....... ఉగ్గుపాలలో దేశభక్తిని రంగరించిపోసి ఒక వీర శివాజీని తయారు చేసిన జిజాబాయి ఎంతటి మహోన్నతురాలోనని, తల్లి శిల్పి అయితే తల్లి చేతిలో మలచబడ్డ బిడ్డ శిల్పం అవుతాడు. వాడు ఆమె ఆలోచనలకు ప్రతిబింబం అవుతాడు అని అనుకొన్నా.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|