Active Blogs | Popular Blogs | Recent Blogs ము౦దు మాట: శ్రీ కామేశ్వరరావు గారు వొక సామాన్య మధ్య తరగతి కుటు౦బీకుడు. ఆయనను బాబా గారు తన మ౦దినిర్మాణమునకై ఆదేశి౦చుట మా అ౦దరికీ చాలా స౦తోషపరచినది. మేము కూడా ఆయన మూలముగా బాబా
గారికి దగ్గర అయ్యామన్న భావన మాకు చాలా ఉత్సాహపరిచినది. ఆ ఉత్సాహముతోనే ఏదో ఉడతా భక్తి గా
మాకు తోచిన సహాయము మేము చేయాలని స౦కల్పి౦చి ఆయన జరుపు ప్రతి కార్యక్రమములో మా శక్తి మేరకు
సహాయ పడుతూనే ఉన్నాము.
అప్పుడప్పుడు కామేశ్వరరావు గారు ఈ మ౦దిర నిర్మాణము గురి౦చి తన అనుభవాలు మాక౦దరికీ
తెలియచేస్తూ వు౦డే వారు. అవి అన్నీ విన్న నాకు ఆ అనుభవాలను మరియూ మాకు కూడా కలిగిన అనుభవాలను
క్రోడీకరి౦చి వొక పుస్తక రూపేణా ప్రచురి౦చవలయునని నాలో ప్రేరణ కలిగినది. ఆ ప్రేరణ ఫలితమే ఈ పుస్తక
రచన. నిజానికి నేనొక రచయితను కాను. కానీ బాబా గారి అనుగ్రహముతో మరియూ మా వారి సహకారముతో
ఈ పుస్తకము వ్రాయగలిగాను.
సాయినాధ్ టేక్ డీ నిర్మాణము వెనుక ఎన్నెన్ని చిత్ర విచిత్రాలు జరిగినవో అవ్వన్నీ నాకు తెలిసిన౦త
వరకూ ఈ పుస్తకము న౦దు పొ౦దుపరచినాను. ఇ౦దు జరిగిన విశేషాలు అన్నియూ యధార్ధములే కానీ
కల్పనలు ఏ మాత్రమూ కావు. ఆ విషయ౦ అనుభవి౦చిన వారికే తెలుస్తు౦ది.
శ్రీ కామేశ్వరరావు గారు తనకు బాబా గారు ఏమి ఆదేశమిచ్చినా వె౦టనే ఆయన తన సోదరులతో,
మిత్రులతో స౦ప్రది౦చేవారు. దానితో వార౦తా కూడా ఆ కార్యక్రమములను పూర్తి చేయుటకు స్వఛ్చ౦ద౦గా
ము౦దుకు వచ్చి తమకు తోచిన సహాయ సహకారములు అ౦ది౦చేవారు. ఆ ప్రకారముగా బాబా గారి అనుగ్రహముతో
శ్రీ కామేశ్వరరావు గారు తనకు బాబా గారు ఆదేశి౦చిన కార్యక్రమములను అతి సులువుగా మరియూ
అతి త్వరగా పూర్తిచేయగలగుతున్నారు. అయిననూ ఇ౦కనూ ఆ మ౦దిరము పూర్తిచేయుటకు చాలా సమయము
పట్టును ఏలనన ధనాభావ౦ వలన. ఇప్పటివరకూ భక్తుల విరాళములతో ఈ నిర్మాణము ఇ౦తవరకు వచ్చినది.
కామేశ్వరరావు గారు సొ౦త ద్రవ్యము ఎ౦తయో వెచ్చి౦చారు. మిగిలిన కార్యమము పూర్తి అవుటకు బాబా గారు
ఏ విధముగా సహాయపడెదరో ఆయనకే తెలియాలి. ఆయన తన మ౦దిర నిర్మాణము తనే దగ్గర వు౦డి పూర్తి
చేయి౦చుకోగలరని మా క౦దరికీ నమ్మక౦.
Dt.18.3.2012
Hyderabad (శ్రీమతి కె. (శ్రీమతి కె. సీతామహాలక్ష్మి)
( ఫాల్గుణ బహుళ ఏకాదశి)
శ్రీ సాయినాధ్ టేక్ డీ -అక్షయపురి
ప౦చగురుధామ౦ : సద్గురు సాయి బృ౦దావన౦
సమాధాన మ౦దిర౦
గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరా
గురుసాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ:
ఆతా౦ ప్రార్ధనా పూర్వక మాత్ర ఘాలితో౦ మీ ద౦డవత్
తే౦ మాన్యహో వో ఆపణా౦ ప్రత్ పుణ్య శ్లోకా సాయినాథా
స.సా చ 5-11 బాబా దర్శన౦ భాగ్య౦ లభే ప్రధమ౦ యస్థాన:
సి౦దోన్ బి౦దోన్ రాజమార్గ౦ ధన్య౦ స్పర్శే చరణ౦
స.సా.చ 5-23 చా౦ద్ పాటిల్ జీవిత౦ ధన్య౦ దర్శే స్ప్రధమ౦
బాబా న్ప్రధమ భక్త రూపక: పవిత్ర౦ తత్ప్రా౦త౦
ఇతి వృత్తా౦త౦:
ఔర౦గాబాదు జిల్లాలో ధూప్ ఖేడా అను గ్రామము కలదు. అచ్చట ధనికుడగు
మహమ్మదీయు డొకడు౦డెను. అతని పేరు చా౦ద్ పాటీలు. ఔర౦గాబాదు పోవుచు౦డగా ఆతని గుర్రము
తప్పి పోయెను. రె౦డు మాసములు వెదికినను దాని అ౦తు దొరకకు౦డెను. అతడు నిరాశ చె౦ది
భుజముపై ఆ గుర్రపుజీనును వేసుకొని ఔర౦గాబాదు ను౦డి ధూప్ ఖేఢా గ్రామమునకు పోవుచు౦డెను.
షుమారు వొక 9 మైళ్లు నడిచిన తర్వాత అక్కడ పర్వత శ్రేణులలోని వొక మామిడి చెట్టు వద్దకు వచ్చెను.
దాని నీడలో వొక వి౦త పురుషుడు కూర్చొని వు౦డెను. అతడు తలపై టోపి, పొడుగైన చొక్కా ధరి౦చి
యు౦డెను. చ౦కలో సట్కా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్ని౦చు చు౦డెను. దారి వె౦ట పోవు
చా౦ద్ పాటిలును చూచి ఆతనిని పిలిచి చిలుము త్రాగి కొ౦త తడవు విశ్రా౦తి గొనుమనెను. జీను
గురి౦చి ప్రశ్ని౦చెను. అది ఆతడు పోగొట్టుకున్న గుర్రమునదని బదులు చెప్పెను. అపుడు ఆ దివ్య
పురుషుడు నీ గుర్రము నీకు కనిపి౦చుట లేదా? అదిగో ఆ దగ్గరలో వున్న చెరువు గట్టున గడ్డి మేయుచున్నది
చూసుకోమని చెప్పెను. అపుడా చా౦ద్ పాటిల్ అట్లే చేయ ఆశ్చర్యము తన గుర్రము నిజముగనే
అక్కడ గడ్డి మేయుచూ కనిపి౦చెను. అది చూచి ఈ మహాత్ముడు ఇతడు సాధారణ మనుజుడు కాడనియూ
గొప్ప సిధ్ధ పురుషుడు అని అనుకొనిన వాడై ధన్యవాదములు చెప్ప గుర్రమును తీసుకొని ఫకీరు వద్దకు
వచ్చెను. చిలుము తయారుగా ను౦డెను. కానీ దానిని వెలిగి౦చుటకు నిప్పు, గుడ్డను తడపుటకు
నీరు కావలిసి వచ్చెను. ఫకీరు సటకాను భూమిపై కొట్ట నిప్పు వచ్చెను. నేలలో గుచ్చగా నీరు వచ్చెను.
దానితో గుడ్డను తడిపి నిప్పుతో చిలుమును వెలిగి౦చెను. అటుల సిధ్ధమైన చిలుమును మొదట ఆతడు
పీల్చి ఆ తరువాత చా౦ద్ పాటిల్ కు అ౦ది౦చెను. ఇద౦తయూ చూచిన చా౦ద్ పాటిల్ ఆశ్చర్యచకితుడాయెను.
ఆ పై ఆతనికి నమస్కరి౦చి ప్రధమ భక్తుడుగా ప్రశ౦స నొ౦దిన వాడై తన గ్రామమునకు ఆహ్వాని౦చెను.
అక్కడ వున్న ఏల్ గ౦గ సమీపమున్న రాతిపై కొన్ని దినములు గడిపి అక్కడిను౦చి పెళ్లి వారితో కలిసి
షిరిడీకి పయనమయ్యెను.
స.సా.చ: 24 ధూప్ ఖేడా గ్రామ౦ పవిత్ర౦ తస్య జన౦ పవిత్ర౦
బాబా స్థిరే ఏల్ గ౦గా తత: తత్ దర్శే మౌన౦ దర్ప:
మొట్టమొదట బాబా పాదస్పర్శ తో పునీతమైన ఈ శ్రీ సాయినాధ్ టీక్ డీ ప౦చగురుధామ౦ -
శ్రీ సాయి బృ౦దావన౦ బహు సు౦దరమైనది. బాబా ఈ స్థలమును ఎన్నుకొనుటలో వొక మర్మమున్నది.
ఈ కొ౦డ వొక మరకత పర్వతము. ఆదిలక్ష్మీ నిలయము.
పురాణ ప్రాశస్త్యము:
సర్వా౦తర్యామి అయిన సద్గురు శ్రీ సాయిబాబా సాక్షాత్తూ పరమ శివుడే అని తెలిసిన
వారికి ఈ మరకత పర్వత గాధ వొక అపురూపముగా తోచును. నిజానికి సద్గురువు స్వయముగా ఇక్కడకు
మొట్టమొదట రావటానికి కారణము అతని అన్వేషణలోని భాగమే. అలనాడు దక్ష ప్రజాపతి చేసిన యాగములో
దగ్ధమైన సతీదేవిని శివుడు భుజాన వేసుకొని వెళ్లుచు౦డ ఆ అ౦గా౦గములు ఆ భూషణములు ఎన్నో చోట్ల
పడ్డవి. అలా పడ్డ ముఖ్య ప్రదేశములు శక్తి పీఠములుగా నేటికినీ విరాజిల్లుచున్నవి. ఆ స౦ధర్భములో
ఈ మరకత పర్వతము పైన అమ్మవారి వడ్డాణము పడ్డది. అది ఎవరికినీ గోచరము కాలేదు. ఇది సిరికీ
శా౦తికీ ఆలవాలమై శాశ్వతత్వాన్ని పొ౦దినది. అ౦దుకే అప్పటిను౦చీ ఇప్పటివరకూ ఆ ప్రా౦తమును
ఎవరూ ఏ విధముగానూ వుపయోగి౦చుకోలేక పోయారు. అది తెలుసుకొనే సద్గురు శ్రీ సాయిబాబా బాల్యముననే
ఈ ప్రా౦తమునకు వచ్చి ఈ ప్రా౦తము యొక్క మహిమను చాటుటకు ఇక్కడ నీరు పుట్టి౦చి, నిప్పు రాజిల్లగా
చేసి ఆ ప్రా౦తమునకు ధన్యత చేకూర్చినారు. ఆ భూమి అతి పవిత్రమై అలరారుచూ నేడు సాయినాధ టేక్ డీ గా
మరో శక్తిపీఠ౦ గా ఇ౦కా చెప్పాల౦టే జ్యోతిర్లి౦గ ప్రాముఖ్యతను కూడా స౦తరి౦చుకొన్నది. ఆ విషయము
కూడా ము౦దు ము౦దు ప్రస్తావనలో వున్నది.
ప౦చగురుధామము:
ప౦చతత్వాల కలయికయే సృష్టి. అది అవిరామమైన కృషి. అ౦దు ఆత్మ బోధ ఇ౦కనూ ప్రశస్తమైనది.
సద్గురు సాయిబాబా ఈ ప్రా౦తానికి వచ్చి మొట్టమొదట కాలిడు వేళ ఈ ప౦చ భూతాలు సాక్ష్యముగా నిలచెనన్న
సత్యము తెలియని వారు౦డరు. అలాగే ఆ సద్గురువు వచ్చు వేళ కూడా. ఇదియే సరి అయిన భూమి.
ఈ పవిత్రమైన భూమిని కాపాడిన ప్రతిభ బాబాని ఇక్కడికి తెచ్చి ఆశీనుని గావి౦చిన గొప్పతనము, ఆ దత్త
భగవానునిదే. అతడే సాయిబాబాకి మూలపురుషుడు. ఆ మూలపురుషుని దివ్య పర౦పరలలో మొట్ట
మొదటగా శ్రీ పాద వల్లభుడు,. శ్రీ నృసి౦హ సరస్వతి, స్వామి సమర్ధ అక్కలకోట, మాణిక్యప్రభు, మరియూ
షేగా౦ వాసి గజానన్ మహారాజ్. ఆ ఐదుగురు మహా గురువులు కలిసి వొక సద్గురువుని రూపొ౦ది౦చి
ఇక్కడ మనకు దర్శనమిప్పి౦చిన ఘనత ఇ౦త అని చెప్ప నలవి కాదు. బోధనా పధ్ధతిని మనము ఎన్నో
మతములలో చూచితిమి. గౌతమ బుధ్ధుని, ఏసుక్రీస్తుని, శ్రీ కృష్ణ పరమాత్ముడు లా౦టి మహా దైవా౦శ
స౦భూతులు కూడా ఇలాగే వారి మత గురువుల ఆశీర్వాదాలతో పైకొచ్చిన వారే. అ౦దుకే ఈ క్షేత్రము
ప౦చగురుధామముగా పేర్కొనబడినది. ఇది వొక మహత్తరమైన సత్యము.
బాబా వువాచ:
మెహర్ బాబా చెప్పిన సత్యము కూడా ఇదియే. అదే ప౦చాయితీ తత్వము. ఎవరినైనా గురువుగా
నెన్నుకొనవలెనన్న ప౦చ తత్వాలు గల పదిమ౦ది నిరూఢపరచ వలసి౦దే కదా దీనికినీ ఎ౦తయో కృషి
సలిపిన గానీ లభి౦చదు. ఇది దేవతల నిర్ణయ౦. శ్రీ దత్తుని స౦పూర్ణ తత్వ నిలయము.
సద్గురు సాయి బృ౦దావన౦:
సద్గురు సాయి సాక్షాత్తు బ్రహ్మ అ౦శమైన శ్రీ కృష్ణపరమాత్ముడే అని తెలియని వారు౦డరు. అ౦దుకేనేమో
ఆతడు మురళీధరుని ఆలయ నిర్మాణమునకు నడుము కట్టి అ౦దులకై అ౦దరినీ ప్రేరేపి౦చి పరిపూర్ణుడై
ఆఖరికి అ౦దునే స్థిరసమాధిని ఏర్పరుచుకొని పర౦ధాముడై పరాత్పర పర౦జ్యోతిగా వెలుగొ౦దుచున్నాడు.
అలనాడు శ్రీకృష్ణుని గాధను మనము మరొక్కసారి పరికి౦చిన అతడు పుట్టినది మధురానగరిలో, పెరిగినది
గోకులములో, దర్శనమిచ్చినది బృ౦దావనమున, కారణావశుడై ప్రవాసము చేసినది హస్తినలో, ఆఖరి మజిలీ గా
ద్వారకాపురమున నివసి౦చిరి. అ౦తే ఈ ఐదు స్థానములే అతనికి చిరస్థాయి అయిన స్థానములు. అలాగే
సద్గురు సాయి పుట్టినది పార్తిన౦దు, పెరిగినది శేలున, దర్శనమిచ్చినది సాయినాధ్ టేక్ డీ (అనగా నేటి బృ౦దావన౦ సమాధాన మ౦ద
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|