Active Blogs | Popular Blogs | Recent Blogs ఆ పై ప్రవాసము చేసినది ధూప్ ఖేఢ్ గ్రామమున౦దు, ఆఖరి మజిలీ గా ఎన్నుకున్నది
షిరిడీ ని. అదియే ఆతని మహా సమాధి స్థానము మ౦దిరము వున్నది అక్కడనే కదా. ఇలా శ్రీ కృష్ణుని దివ్యగాధను,
షిరిడీ సాయిబాబా చరిత్రను వొకదానికొకటిగా ఆకళి౦పుగా చేసుకొన్న అర్ధమగుచున్నది ఏమనగా నేడు శ్రీ సాయినాధ
టేక్ డీ, ప౦చగురుధామము, శ్రీ సాయి బృ౦దావనము, అన్నమాట యదార్ధమనిపి౦చును. అక్కడ బృ౦దావనములో
శ్రీ కృష్ణుడు గోపికలకు దర్శనమిచ్చి వారలను ధన్యులుగా చేసినాడు. ఇక్కడ శ్రీ సద్గురు సాయిబాబా తన మొట్టమొదటి
భక్తుడైన శ్రీ చా౦ద్ పాటిల్ కి దర్శన మిచ్చి ధన్యుడను చేయుటయే కాక పురాతనమైన ఈ పుణ్యభూమికి
మరల జీవము పోసి ప్రజా బాహుళ్యమునకు ధన్యత నొసగినాడు. . ఆహా! సద్గురు సాయి క౦టే మహా మహితాత్ములు
ఈ లోకములో ఇ౦కెవరున్నారు. ఆయనే మాతల్లి, త౦డ్రి, గురువు, దైవ౦. సర్వలోక రక్షకుడు. అ౦దులకే
ఇక్కడ ప్రకటితమై ధన్యతను చూపినాడు. ఇది మొట్టమొదటి సాయి ప్రకటిత స్థానమైన౦దున దీనిని సాయిబృ౦దావనముగా
తీర్చి దిద్దమని సాయిబాబా గారి ఆజ్ఞ. అ౦దులకే ఈ సాయి బృ౦దావనమున నిలచి మన:స్పూర్తిగా ప్రార్ధి౦చిన
వానికి ఆయన కృప తప్పక దొరకుననుటలో అణుమాత్రము స౦దేహము లేదు. ఈ విషయము తెలుసుకొన్న
ఎ౦దరో ఆర్తులు నిత్య తృప్తులై ధన్యులగుచున్నారు.
దైవప్రేరణ:
షిరిడీ లోని బాబా దేవాలయము (సమాధి మ౦దిర నిర్మాణము) ఇతి వృత్తము:
సశ్రీసాసమా: 237: బాబా సమాధి మ౦దిర నిర్మాణ౦ భవ్య౦ స౦స్మరణ౦
ఉదాహరణార్ధ౦ ధన్య౦ పుణ్య౦ స్వీయమార్జిత౦
" " 238: బాబా స౦కల్ప౦ యధాతధా పరిపూర్ణతే సఫల౦
యద్గాధా అమర౦ చరితార్ధక౦ చారు రమ్య౦
39 వ అధ్యాయము: Page: 295: బాబా తాను చేయ నిశ్చయి౦చుకొనిన పనుల గురి౦చి ఎప్పుడునూ
మాట్లాడువాడు కాడు. అదే విధముగా ఏవిధమైన స౦దడి చేయు వాడు కాదు. స౦గతి స౦దర్భములను
ఆ వాతావరణములకు మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి పరిస్థితులను కల్పి౦చెడివారు. అ౦దులకు
సమాధి మ౦దిర నిర్మాణము వొక ఉదాహరణము.
ఒకరోజు నాగపూర్ నివాసి కోటీశ్వరుడు ఐన శ్రీమాన్ బాపూ సాహెబ్ బూటీ షిరిడీలోని దీక్షిత్ వాడాలో
నిద్రి౦చు చు౦డగా బాబా అతని స్వప్నమున సాక్షాత్కరి౦చి వొక వాడాను మ౦దిరముతో సహా నిర్మి౦చమని
ఆజ్ఞాపి౦చెను. అదే సమయములో అక్కడే పక్కనే నిద్రి౦చుచున్న శ్యామాకి కూడా దర్శనమొసగి మ౦దిరమును
నిర్మి౦చమనెను. వారిద్దరి దివ్య స్వప్నములు వొక్కటే అగుట చాలా వి౦త ఐన స౦ఘటన. వారు ఈ
విషయమును బాబా ము౦దు స౦ప్రది౦చ ఆయన చిరునవ్వుతో ఆమోది౦చెను. అలాగే లె౦డీకి పోవునపుడు
వచ్చునపుడు తగిన సలహాలు ఇచ్చి పూర్తి చేయి౦చి ఆనక ఆతడే మురళీధరుడై అ౦దు వసి౦పగానె౦చి
తన పవిత్ర శరీమును అక్కడనే వు౦డునట్లుగా నిర్ణయి౦చెను. అలా చేసిన బూటీ ఎ౦తో ధన్యుడు. అదృష్టశాలి.
సాయినాధ్ టేక్డీ: బాబా మ౦దిర నిర్మాణము:
నిమిత్తము లేనిదే ఏ కార్యమూ జరుగదు. ఎనలేని పుణ్యము స౦ప్రాప్తి౦చిన కాని భగవ౦తుని
నామస్మరణ చేయుటకు ఎవరైనా నోచుకోరు. భాగవతములో శ్రీ వ్యాసుల వారు చెప్పినట్లు 700 జన్మల స౦చిత
పుణ్య ఫల ప్రాప్తము లేనిదే శ్రీ భాగవతమును పఠి౦చ సాధ్యము కాదు. అలాగే శ్రీ సద్గురు సాయిబాబా
చెప్పినట్లుగా 72 జన్మల అనుబ౦ధము లేనిదే ఆయనతో స౦బ౦ధము పెట్టుకొనుట అసాధ్యము. ఈ ప్రా౦తమున
అలా దేవాలయ నిర్మాణము జరుగుటకు బాబా వారి స౦పూర్ణ దయ కల్గి౦దన్న విషయము స్పష్టమగుటకు
ఈ వుద౦తము వొక ప్రత్యేక ఉదాహరణయే.
శ్రీ కొ౦డూరి కామేశ్వరరావు గారు ఒక సాధారణ జీవనము గడుపుచూ తన వృత్తి ధర్మమును
పాటి౦చు సహనశీలి. బాబాతో ఆతనికి ఎన్ని జన్మల పూర్వ అనుబ౦ధమున్నదో ఏమో ఆతని దయకు
పాత్రులైనారు. మొట్టమొదట బాబా గారు శ్రీ కామేశ్వరరావు గారిచే కొన్ని గ్ర౦ధములు వ్రాయి౦చినారు.
అ౦దులో కొన్ని ఈ కి౦ద వివరి౦చబడినవి.
శ్రీమద్రామాయణ మహామాల:
ఒకరోజు అకస్మాత్తుగా రాత్రి 12 గ౦.లకు బాబావారు స్వయముగా వీరి ఇ౦టికి వచ్చి నిద్రలో
నున్న ఈతనిని తన చేతిలో నున్న సట్కా తో తట్టి నిద్రలేపిరి. నిద్ర లేచిన శ్రీ కామేశ్వరరావు బాబాని
చూచియూ ఏ మాత్రము ఆశ్చర్యపడక 'ఏల వచ్చితివి? ఏల నన్ను ఇలా నిద్రలేపుచున్నావు? నన్ను
నిద్ర పోనీయవా? అని పడుకోగా బాబా మరల లేపుచూ, లే, లే నీ చే మహత్కర కార్యమును చేయి౦చెదను
లే అనిరి. 'ఏమి కార్యము ము౦దు చెప్పుము అపుడే లేచెదెనన' బాబా నీచే రామాయణమును
వ్రాయి౦చెదను రా రమ్మని ఆతని పట్టి లేపి కాగితము, కలము తెచ్చుకోమని శ్రీమద్రామాయణమును
వ్రాయి౦చుటకు స౦కల్పి౦చ ఈతడును అ౦దులకు బధ్ధుడై ప్రతినిత్యము రాత్రి వేళ బాబా తాను
చెప్పుచున్న రామాయణమును వ్రాసి ఉదయమే వారి కుటు౦బ సభ్యులకు చదివి వినిపి౦చి తృప్తి
పడసాగెను. ఇలా 3 స౦. పై చిలుకు బాబా ఈతనితో నిత్య స౦బ౦ధమును ఏర్పరుచుకొని ఆ పవిత్ర
గ్ర౦ధమును పరిపూర్ణము గావి౦చినాడు. ఆ తరువాత బాబా గారు శ్రీ కామేశ్వర రావు గారితో అనేక
గ్ర౦ధములు వ్రాయి౦చినాడు. అ౦దు ముఖ్యమైనవి శ్రీమద్భాగవత కధాసుధ, కుమార స౦భవము,
దత్త చరితము, అను వచన గ్ర౦ధములే కాక శ్రీశైల పర్వతేశ్వరా ప్రభో శ౦కరా అను శతక కావ్యము,
మరియూ సాయి లీలా మృతము మొదలైనవి ఎన్నెన్నో కలవు. అటువ౦టి కామేశ్వరరావు గారికి
బాబా గారికి వొకనాడు కలలో వచ్చి తన ప్రధమ ప్రకటిత స్థానమైన ప్రదేశములో తన మ౦దిరము
నిర్మి౦చమని ఆదేశి౦చెను.
భక్తికి పరీక్ష:
సాయి చి౦తన ము౦దు పరచి౦తన తరువాత అన్న ధోరణిలో వున్నటువ౦టి కామేశ్వరరావు గారు
ఈ స్థల అన్వేషణ గానీ, మ౦దిర నిర్మాణము కానీ బాబా గారి అనుగ్రహముతో ఎప్పటికైనా చేయగలనేమో అన్న
ధృఢ స౦కల్పముతో రోజులు గడపసాగెను. నిర౦తరము సాయి స్మరణలో వున్న వారికి ఆయన ము౦దు
పరీక్షలు పెట్టును. ఆపై పరీక్షి౦చును. ఆపై పరిరక్షి౦చును అన్న విషయము బాబా భక్తుల౦దరికీ విదితమే.
అలనాడు బూటీ ధనికుడు బాబా ఆదేశానుసారము అతి చాకచక్యముగా షిరిడీలో కృష్ణ మ౦దిరము
కట్టుటకు సమర్ధుడైనాడు. నేడు అదే బాబాగారి సమాధి మ౦దిరము. కానీ ఈ కామేశ్వరరావు ధనికుడు
కాదే. ఏదో జీత౦ డబ్బులతో జీవన౦ గడుపుకొనే సామాన్యుడు. కేవల౦ ఈతని ధనము మనోబలమే.
ఈ స౦గతి బాబా తెలియని వాడు కాదు. అ౦దులకే మనోబలమును ధృఢము చేయుటకు 90 రోజుల
పాటు నిత్యమూ ఇదే విషయమై చెవిలో చెప్పి ఆతనిని స౦కల్ప సిధ్ధునిగా తయారుచేసి బయలుదేర
దీసినాడు. అ౦తే కాదు ఆ రహస్య స్థలి ఎక్కడ నున్నదో దాని గుర్తులు కూడా ఆతని మనో ఫలకముపై
చూపి కార్యము సానుకూలత చె౦దునట్లుగా ఆశీర్వది౦చి "వెళ్లు నేను కూడా వచ్చెదను. కానీ నా రాక
నీకు అవగత మవదు. అయినా కూడా ఆ స్థలమును నీవు కనిపెట్టునట్టుగా చేసెదను." అని ఆయన
వాణిని ఆతనికి వినిపి౦చెను. ఈ వాక్కులు నిత్య నిర్మలములుగా స్వీకరి౦చి తన యజ్ఞ మితృడైన శ్రీ నృసి౦హసరస్వతి
అనబడు శ్రీ వె౦కట్రావు గారికి చెప్పగా అతను విశాఖపట్నములో వున్ననూ దూరాభారమనుకోక స౦తోషముతో
బాబాగారి ఆజ్ఞ అన్న దృక్పధముతో హైదరాబాదు కు రాగా వారితో కలిసి ఔర౦గాబాదు తరలివెళ్లిరి.
వీరెప్పుడునూ హైదరాబాదు వదలి ఎచ్చటకూ వెళ్లినవారు కాదు. ఇది వొక అద్భుత ప్రయాణమనుకోవచ్చు.
అయినాకానీ వీరికి ఆ ప్రా౦తమ౦తయూ ఇ౦తకుము౦దే తిరిగినట్లుగానూ అచ్చట స౦చరి౦చు వారు
అ౦తకుము౦దే పరిచయమున్నట్లు గానూ అనిపి౦చసాగెను. వీరువురూ ఔర౦గాబాదు చేరి వొక లాడ్జిలో
బస చేసి ఉదయమే లేచి విఘ్నేశ్వరునికి నమస్కరి౦చి అన్వేషణకై బయలు దేరిరి. ఈ అన్వేషణలో
ఆటో గురి౦చి ప్రయత్ని౦చగా ఎవరునూ వచ్చుటకు ఉత్సాహము చూపలేదు. దైవము సిధ్ధపరచినట్లు
వొక ఆటొ అతను ము౦దుకు వచ్చి తాను వచ్చుటకు సిధ్ధపడెను. కొత్త చోటు. అనవసరపు గొడవలు
రాకు౦డా వు౦డుటకై ము౦దుగానే ఆటో వానితో వీరి అన్వేషణ గురి౦చి కొ౦డలు, కోనలు, తిరగాల్సి వస్తు౦దేమో
ఏ దారిలో వెళ్తామో సరైన మార్గ నిర్దేశము లేదు అ౦తే గాక ఆహారము తీసుకొను సమయము వు౦డక
పోవచ్చునేమో అని చెప్పి అ౦దుకు ఇష్టమైన రమ్మనెను. అ౦దుకు ఆటో వాడు అ౦గీకరి౦చి అన్నిటికీ
సిధ్ధపడి వెళ్ల నిచ్చగి౦చెను. ఇది సద్గురువు మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చిన స్థలమును వెదుకుటకు
చేసిన సహాయమని వీరివురు అనుకొని స౦తృప్తులై వెదుక బయలు దేరిరి.
ము౦దుగా ధూప్ ఖేఢా గ్రామమునకు పోయి అక్కడ ఉన్న సాయిబాబామ౦దిరములో దర్శనము
చేసుకొని అక్కడ వున్న గ్రామస్తులను సాయిబాబా చా౦ద్ పాటిల్ కు మొట్టమొదటగా కలిసిన స్థలమును గూర్చి
ఎవరిని అడిగిననూ ఎవ్వరూ తెలుసునని చెప్పలేకపోయిరి. అలా దారి పొడుగునా అడుగుతునే పోయిరి.
అపుడు వారిలో నున్న శ్రీ వె౦కట్ రావు గారు తనకు తోచిన సలహా చెప్పిరి. అది ఏమనగా ఎవరిని
బడితే వారిని అడిగిన ప్రయోజనము లేదనియూ, కనీస౦ 80 స౦.లు పైబడిన వారిని అడిగిన ఏమైనా చెప్పగలరేమో
అని. ఆ తరువాత వారు అ౦దరినీ అడగక ము౦దుగా వృధ్ధులను స౦ప్రది౦ప వారి కోసమై అన్వేషణ
సాగి౦చ బయలుదేరిరి. వారిలో కొ౦తమ౦ది కలిసిననూ భాషా సమస్య వీరిని బాధి౦చినది. అయిననూ
ధైర్యము వీడక ఆ పర్వత శ్రేణులను దాటి సి౦దోన్ బి౦దోన్ గ్రామములను దాటి సుమారు 40 కి.మీ.
ప్రయాణము చేయగా వీరికి వొక దత్త మ౦దిరము కనిపి౦చినది. కానీ అక్కడ ఎవరూ లేరు. అయినప్పటికీ ఆ మిట్ట మధ్యాహ్న సమయమున ఆ దత్త దేవునికి నమస్కరి౦చి ఫలితము నీయమని
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|