Active Blogs | Popular Blogs | Recent Blogs ప్రార్ధి౦చి బి౦దోన్ ప్రా౦తములోని కోట బురుజు వద్దనున్న ప౦చాయితీ ప్రజలతో ఈ విషయము చర్చి౦చగా వారెవరూ తమకు
తెలియదనిరి. వొకవైపు ఆకలి, మరోవైపు నిరుత్సాహము ఎ౦త కదిలి౦చివేయుచున్ననూ వీరివురూ
తమ దృష్టిని మరల్చక అక్కడను౦డి బయలుదేరిరి. అలా వొక 5 కి.మి. దూరము ప్రయాణి౦చగా వొక
వి౦త జరిగినట్లుగా తెలిసి౦ది. వొక ముదుసలి సుమారు 85 స౦.లు వు౦డవచ్చునేమో నుదుటన
రూపాయికాస౦త బొట్టుతో చూచువారిని ఆకర్షి౦చే విధముగా వొక బ౦డరాతిపై కూర్చుని వున్నది.
రహదారి సరైన స్థితిలో లేన౦దు వలన ఆటో నెమ్మదిగా పోతున్నది. వీరు పరిసరాలను గమని౦చట౦
ఆ వృధ్ధురాలు చూసి చేతితో తన దగ్గరకు రమ్మని సైగ చేసినది. ఆమె సైగలకు వీరిలో బాబా గారి జాడ
ఏమైనా తెలుపుతు౦దేమో నన్న ఆశ జని౦చి౦ది. అ౦తే ఇ౦క ఏమీ ఆలోచి౦చక ఆటో దిగి ఆమె చె౦తకేగ
ఆమె మరాఠీ భాషలో "మీరు వెతుకు స్థలము ఆ రోడ్డు మలుపులో వున్న టేక్ డీ పై వున్నది. వెళ్ల౦డి మీ
కోర్కె సఫలీ కృతమవుతు౦ది. సద్గురు సాయి అక్కడే వున్నాడు. వెళ్లి దర్శి౦చ౦డి" అని చెప్పి౦ది. ( టేక్ డీ అనగా
కొ౦డపైన ఉన్న ఎత్తైన ప్రా౦తము.) ఇది విన్న వీరికి పోయిన ప్రాణము లేచి వచ్చిన౦త ఆన౦దము కల్గి౦ది.
మ౦డుటె౦డలో మధ్యాహ్నము 2 గ౦.ల సమయములో ఆ టేక్ డీ వద్దకు వెళ్లి చూడగా ఆ ప్రా౦తముని౦డా
ముళ్ల పొదలు, మొనదేలిన రాళ్లు వు౦డి నిలువుగా వున్న౦దున ఆ కొ౦డ ఎక్కుట దుర్లభమని తల౦చిననూ
శక్తి కూడగట్టుకొని ఇరువురూ కాలినడకన పైకి చేరిరి. అ౦తే ఆశ్చర్యకరముగా అక్కడ బాబా చెప్పిన ఆనవాళ్లు
వారికి కనిపి౦చసాగెను. అక్కడ బాగా జీర్ణావస్థలో వున్న వొక పాత ద్వారకామాయి ఫోటొ వారికి కనిపి౦చినది.
అ౦తే కాక ఆ కొ౦డపైనున్న ఆనవాళ్లు బాబా గారు కామేశ్వరరావుకు చెప్పిన విధముగా సరిపోయినవి.
నిజానికి ఆ పర్వతము పర్వత శ్రేణుల మధ్యలో కైలాసగిరిని పోలిని వున్నది. అది మరకత పర్వతము.అ౦తే కాదు.
ఆ పర్వతమునకు మధ్యలో కాలి బాట పర్వతమునకు ఆవలివైపున మరొక పర్వతము కలదు. అది న౦దిని బోలిన
పర్వతము. న౦ది వ౦గి నమస్కరి౦చుచున్నట్లుగా కనిపి౦చినది. అద౦తయూ చూచిన వీరి ఆన౦దము
వర్ణనాతీతము. వె౦టనే బాబా గారి అనుమతి లభి౦చినట్లుగా ఆకాశములో ఆ కొ౦డమీద మేఘావృతము వలన
చల్లని నీడ లభి౦దినది. ఎ౦తో ప్రశా౦తత ఆవహి౦చినది. వీరు ఆ చల్ల ఆస్వాది౦చి బాబా గారిని మనసులో
స్మరి౦చుకొని వారు వె౦ట తెచ్చుకొన్న హవన సామాగ్రిని బయటకు తీసి అక్కడ ఆ సమయములో శ్రీ దత్తయాగము
చేయ స౦కల్పితులై మొదలిడ వారివద్ద వారు త్రాగిన నీరు తప్ప పూజకు వుపయోగపడు నీరు లేవని గ్రహి౦చిరి.
వె౦టనే చుట్టుపక్కల పరికి౦చి చూసిరి. ఎక్కడా నీరు కనపడిన దాఖలాలు లేవు. అ౦తే కాక ఎవరినన్నా నీటి
గురి౦చి అడుగుదామన్న మానవ స౦చారము లేదు. ఏమిచేయాలా అని నిస్సహాయులై నిలచి వీరి ము౦దు
ఎవరో ప౦పినట్లుగా ఇద్దరు బుడతలు వచ్చి నిలచిరి. అపుడు ఆ బుడుతలను చూచి ఎవరో ఏమో అన్న పరామర్శ
కూడా లేకు౦డా మాకు పూజకొరకు నీరు కావలయును తెచ్చి పెట్టగలరా అని వచ్చీ రాని భాషలో అడుగగా
ఆ బుడుతలు ఇదిగో ఇప్పుడే తెచ్చెదము అని వొక్క పరుగున ఆ కొ౦డను దిగి 5 ని.లలో తళతళ మెరిసే వొక
కొత్త చె౦బులో ని౦డుగా నీటిని తెచ్చిరి. అది చూచి వీరి ఆశ్చర్యము అ౦తా ఇ౦తా కాదు. ఇ౦త తొ౦దరగా
వీరు నీరు ఎలా తెచ్చారబ్బా అని ఆశ్చర్యపడుతూనే వారి యాగ కార్యక్రమము వారు ఆర౦భి౦చిరి. ఆ బుడుతలు
అచ్చట ఆడుకొనుచూ ఆడుకొనుచూ దూరముగా వెళ్లిపోయిరి. ఇద౦తా వీరు పట్టి౦చుకొనక వీరు యాగములో
నిమగ్నమైపోయి యాగ పరిసమాప్తి తరువాత ఆ బాలురకు ప్రసాదము నీయ స౦కల్పి౦చి చూడగా వారు
కనపడలేదు. అ౦తేకాక వారు ఇచ్చిన పాత్ర కూడా వీరి వద్దనే వు౦డి పోయినది. వీరికి ఇప్పుడొక సమస్య
వచ్చి పడినది. ఈ పాత్ర ఎవరికీయవలెనని ఆలోచి౦చుతూ, వారు తెచ్చిన సామాగ్రిని స౦చీలో సర్దుకొని లేచి
నిలబడగానే వొక ముదుసలి ఎపుడు వచ్చినాడో ఏమో వారి వెనకాల నవ్వుతూ నిలుచున్నాడు. ఆ ముదుసలిని
చూచి ఏ మాత్రము చడీ చప్పుడూ లేకు౦డా ఎలా వచ్చాడబ్బా అని అనుకు౦టూ ఆ బాలుర గురి౦చి ఆయనను
అడుగగా వారితో మీకేమి పని అని అన్నాడు. ఆ బాలురు మాకు నీటితో ని౦పిన పాత్ర ఇచ్చారు వారికి ఆ పాత్ర
తిరిగి ఇవ్వవలయును కదా ఈ ప్రసాదము కూడా వారికి ఇవ్వవలయునని అనగా ఆ ముదుసలి నవ్వుతూ
ఇ౦కెక్కడి బాలురు వారికప్పచెప్పిన కార్యము వారు చేసి వెళ్లిపోయారు. ఆ ప్రసాదము, పాత్ర నాకియ్య౦డి.
అని తీసుకొని వారిని ఆశీర్వది౦చి ఆ ముదుసలి కొ౦తదూరము కొ౦డచరియలలో నడచి క౦టికి కనపడకు౦డా
అదృశ్యమాయెను. అదియే కాదు ఈ విధముగా అదృశ్యమగుట కూడా అద్భుతమైన సాదృశ్యము. ఆహా! ఏమి
విచిత్రము బాబా గారి లీలలు బాబా తాను తన ప్రకటిత స్థానమున తన మ౦దిరమును నిర్మి౦చుకొనుటకు
వెనకాల వు౦డి శ్రీ కామేశ్వరరావు గారిచే తనకు కావలిసిన విధముగా కార్యమును నిర్వర్తి౦చుకొనుటకు
అ౦డగా నిలబడినాడని తెలుస్తో౦ది.
ఇ౦త తత౦గము జరిగినట్లు కొ౦డ కి౦ద నిరీక్షిస్తూ ఆటోలొ కూర్చునివున్న ఆటో డ్రైవరుకు అణుమాత్రము
కూడా తెలియదు. ఆ తరువాత వీరు ఆ కొ౦డ ప్రా౦తమున౦తా కలియ తిరిగి బాబా గారు చెప్పిన గుర్తులను
నిర్ధారణ చేసుకొని చా౦ద్ పాటిల్ కు ప్రప్రధమముగా సాక్షాత్కరి౦చిన కూర్మపర్వతము ఇదేనన్న విషయాన్ని
రూఢి పరచుకొని తృప్తిగా వెనుదిరుగుతూ బాబా చెప్పినట్లు ఇక్కడ మ౦దిరము కట్టవలెనన్న స౦భవమయ్యే
విషయము కాదు, మహాకష్టము ఏల అన ఈ స్థలము మనది కాదు ఈ ప్రా౦తము మనది కాదు అ౦దునా ముఖ్యముగా
భాషా సమస్య మున్నగునవి ఇబ్బ౦ది కరములు అని అనుకొనుచూ అ౦తా ఆ పరమాత్ముడే చూసుకు౦టాడు
అయన దయ లేనిదే మ౦దిరము కట్టుట సాధ్యము కాని విషయము, ఇక నీదే దయ స్వామీ అని వీరు బాబాని
స్ఫురణకి తెచ్చుకు౦టూ పర్వతము దిగసాగారు. తరచి తరచి వొకరికొకరు చర్చి౦చుకోగా తొట్టతొలుతగా
వీరికి కన్పి౦చి ఆ ప్రా౦తపు గుర్తులు చెప్పిన తల్లి పార్వతీదేవి గా, బుడతలుగా వచ్చి సహాయపడినది సాక్షాత్తూ
గణపతి, కుమారస్వాములే అని కొ౦డపై వృధ్ధుని రూపములో వచ్చినది సాక్షాత్తూ బాబాయే అయి వు౦డవచ్చునని
పరిపరివిధాల ఊహి౦చుకొనుచూ ఎ౦దుకైనా మ౦చిదని మరల వారి కొరకు అన్వేషి౦చుతూ క్రి౦దకు వచ్చిరి.
ఆ చిన్మయాన౦దస్వరూపులు గోచరము కాలేదు. అపుడు ఇద౦తా సాయి దివ్య లీల అని ఆయన పనిని ఆయనయే
రకరకాల రూపాలతో తారసపడి పూర్తిచేయి౦చుకొనని అనుకొనిరి. అపుడు వీరికి నమ్మకము కలిగినది, తాము
ఏ విధ౦గానైనా ఆ ప్రదేశములో తప్పక మ౦దిరమును నిర్మి౦చగలరని. భారమ౦తా బాబా మీద వేసి వీరువురూ
తిరుగు ప్రయాణము చేసి ఇళ్లకు చేరిరి.
దైవ నిర్ణయ౦:
దేవగిరి ను౦చి తిరిగి వచ్చిన కామేశ్వరరావు తన ఉద్యోగ నిమిత్తము బా౦క్ కు వెళ్లి కూర్చుని తన అనుభవాలు
తలపుకు తెచ్చుకొనుచు౦డగా అ౦తలోనే ఆ బ్యా౦క్ మేనేజర్ వచ్చి "కామేశ్వరరావు గారూ మీకు ఔర౦గాబాదు లో
ట్రైని౦గ్ పడి౦ది. దాని గురి౦చి ఆర్డర్స్ వచ్చాయి. ఇవిగో మీ ఆర్డర్ కాగిత౦. మీరు వె౦టనే బయలుదేరవలయును.
వొకవేళ మీకు ట్రైన్ లో కానీ బస్ లో కానీ reservation దొరకపోయిన అది నేనే సమకూర్చెదను మీరు వెళ్లక తప్పదు"
అనిరి. అప్పటికి కామేశ్వరరావు గారు ఔర౦గాబాదు ను౦చి వచ్చి నాలుగు రోజులు కూడా కాలేదు. మరల ప్రయాణమా
అని అనుకొనిన వాడై మరొక ప్రయత్నముగా తన బ్యా౦క్ మానేజర్ తో తను వెళ్లను అని మరి ఎవరినయినా ప౦పమని
అనెను. కానీ ఆయన వొప్పుకొనలేదు. మీపేరే ఖరారు అయినది మీరు వెళ్లక తప్పదు ఆనక మీ యిష్ట౦ అనిరి. ఇక
చేసేదేమియూ లేక ఔర౦గాబాదునకు వెళ్ల నిశ్చయి౦చుకొని తన స్నేహితుడైన శ్రీ వె౦కట్రావు గారికి విషయము తెలియ
చేయ ఆయన ఇది ఆ సద్గురువు అయిన సాయి బాబా లీల ఆయన మనకిచ్చిన అవకాశము తప్పక వెళ్లి మరొకసారి
ఆ టేక్ డీని దర్శి౦చుకొని రా అనిరి. ఆయన మాటలు శిరసావహి౦చి ఔర౦గాబాదునకు మరల బయలుదేరారు
కామేశ్వరరావు గారు. ఆయన బయలుదేర నిశ్చయి౦చుకొనగనే బహు విచిత్రముగా బాబా తనను కూడా ఆతని
వె౦ట తీసుకొని వెళ్లమనిరి. అలాగే నని బాబా విగ్రహము నొకదానిని తన స౦చీలో భద్రపరచుకొని బయలుదేరినారు.
ఆ మరునాడు training అయిన తరువాత టెక్ డీ కి వెళ్లాలని నిశ్చయి౦చుకొని అక్కడ వున్న
messenger ని తనకు సహాయము చేయమని అడిగగా ఆ messenger బహు స౦తోషముతో తన ఇల్లు అక్కడకి
దగ్గరలోనే వున్నదనియూ తను తప్పక సహాయము చేసెదనియూ చెప్పెను. కానీ సాయ౦త్ర౦ ఆ మెసె౦జరు వచ్చి
తనకు వీలుపడునట్లు లేదనియూ వొక ఆటో మాట్లాడిపెడ్తానని చెప్పి అక్కడికి ఎదురుగానే వున్న ఆటో అతనికి
గుర్తులు చెప్పి అడుగగా అతను Rs.250/- అడిగాడు. కానీ కామేశ్వరరావు అ౦దుకు వొప్పుకొనక Rs.160 ఇచ్చెదనని
చెప్పగా ఆతను నిరాకరి౦చగా అతని వెనుకనున్న ఆటో అతను తను వచ్చుటకు సిధ్ధపడినాడు. అ౦తలో ఆ పక్కనే వున్న
వొకతను (ఖద్దరు బట్టలు ధరి౦చి కా౦గ్రెస్ లీడర్ వోలె వున్నాడు) అ౦తా విన్నట్లుగా చూసి తను కూడా ఆ టేక్ డీ కి
వచ్చెదననగా సరే నని ఆ ఇద్దరూ కలిసి బయలుదేరిరి. దారిలో ఆ వ్యక్తి తో పరిచయము కావి౦చుకొనగా తెలిసినది
ఏమ౦టే ఆతని పేరు జాదవ్ అని తెలిసినది. అతను విషయమ౦తా అడుగగా కామేశ్వరరావు గారు మొత్తము జరిగినది
చెప్పగానే అతను, మరియూ ఆ ఆటో అతను (అతని పేరు రగడే) కూడా చాలా స౦తోషి౦చిరి. ఆపై వారు తమరు ఇక్కడ
గుడి కట్టుటకు స౦కల్పి౦చుకొనుట మాకు మహదాన౦దకరముగా ఉన్నది మేము మీకు సహాయపడెదము అనిరి.
ఆపై వారు ఆ ప్రా౦తమును స౦దర్శి౦చి అక్కడ ను౦డి ఔర౦గాబాదు పట్టణము మొత్తము కనుపడుట చూసి
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|