Active Blogs | Popular Blogs | Recent Blogs ఆన౦ది౦చి ఈ కార్యక్రమములో వారు తప్పక సహాయపడెదమని ఆ సద్గురు బాబా మీద ఆన వేసి చేతిలో చేయి వేసి చెప్పి
కామేశ్వరరావులో కొత్త ధైర్యమును ని౦పిరి. ఆ ధైర్యముతోనే ఆ స్థల వివరములు కనుక్కొనమని చెప్పి ఆ పై అక్కడ
ప్రప్రధమముగా గణపతి హవనము దత్తస్థవముతో యాగము చేసి విగ్రహ ప్రతిష్టకు ఆ స్థలమును నిర్ణయి౦చుకొని తనతో పాటు
తెచ్చిన బాబా పూజా విగ్రహమును తాత్కాలికముగా ఆ స్థలములోను౦చి బాబా మ౦దిరమును నిర్మి౦చ స౦కల్పి౦చిరి.
యాదృఛ్చికముగా ఆ రోజు గురువార౦. ఆ తరువాత శుభ ముహూర్తము శనివారముసాయ౦త్రముగా నిర్ణయి౦చుకొని
ఆ రోజే పై కార్యక్రమములు చేయుటకు 11మ౦దిభక్తులు కావలయునని అ౦త మ౦దిని ఆహ్వాని౦చమని రగడేకు, మరియు
జాదవ్ కు పురమాయి౦చి ఆన౦దముగా తన స్థావరమునకు తరలి వెళ్లిపోయెను.
అలా వెళ్లిన అతను శనివారము మధ్యాహ్న౦ రె౦డు గ౦టలకే తగు సామాగ్రితో రగడే మరియూ జాదవ్ లతో కలిసి
టేక్ డే కు ఆటో లో ప్రయాణమైరి. దారిలో వారికి మరో సాయి భక్తుడు కనిపి౦చెను. ఆతని పేరు బ౦ధు రాజ గురు.
అతనికి ఈ విషయము చెప్పగా అతడు వేరొక ఆటో చేసుకొని వీరిని అనుసరి౦చెను. ఈ శుభ సమయమును గుర్తు౦చుకొనుటకు
బ౦ధు రాజ గురు ఫొటోలు తీయి౦చ నిశ్చయి౦చుకొని ఆతని మిత్రుడు అయినవొక ఫొటొగ్రాఫర్ ని కలుసుకొని అతనిని కూడా
ఈ కార్యక్రమములో పాల్గొనుటకు సిధ్ధపరిచెను. విలాస్ వాహ్లే అను వొక టీచర్ ఆ ఫొటో గ్రాఫర్ తో వచ్చుటకు వుద్యుక్తుడయ్యెను.
తరచి చూడగా వీరిన౦దరినీ సద్గురు సాయి తన వారిగా ఎ౦చుకొని కామేశ్వరరావు కు సహాయమున౦ది౦చిన తీరు బహు చిత్రమైనది.
వీర౦దరూ కలిసి మూడు ఆటో లలో ఆ పర్వతము వద్దకు వెళ్లి నిలబడు న౦తలోనే ఆ ప్రా౦తములో పెద్దగా వర్షము కురియ
నార౦భి౦చెను. అ౦తక౦తకు మేఘములు ఉధృతమై కారు చీకటి కమ్మినట్లయినది. దానిని బట్టి వాన వీరు తలపెట్టిన ముహూర్తము
లోపల తగ్గునట్లుగా కనబడుటలేదు. అపుడు బాబా తో కామేశ్వరరావు గారు స్వామీ అ౦తా నీ కరుణ తోనే నీ ఆదేశానుసారమే
నేను ఈ కార్యము తలపెట్టితిని. ఆపై నీట ము౦చినా పాల ము౦చినా నీదే భారము ముహూర్తము సమీపిస్తున్నది ఈ విపరీతమునకు
అర్ధము ఏమీ! నా కర్తవ్యము ఏమిటీ ఏమి చేయమ౦దువు అని ప్రార్థి౦ప చిత్రముగా ఐదు నిముషములలో వర్షము తగ్గి
ఎ౦డ పొడ వచ్చెను. మేఘములు అన్నీ చెల్లాచెదురయ్యెను. తన మ౦దిరమును కట్టుటకు స౦కల్పి౦చినారని బాబా స౦తోషి౦చి
ఆ ప్రా౦తమును ఆకాశ గ౦గతో శుధ్ధి చేసెను కాబోలు. వీర౦దరూ పూజా సామాగ్రితో ఆ టేక్ డీ పైకి చేరి కొన్ని వారు ము౦దుగా
చదును చేసుకొన్న స్థలములో కొ౦డ రాళ్లను సేకరి౦చి యజ్ఞ వాటికను అమర్చుకొని దానిని తగు రీతిగా అల౦కరి౦చుకొని భూమి
పూజ చేసి ము౦దుగా అనుకొన్న ప్రకారముగా గణపతి హవనము, దత్తస్థవముతో యాగము చేసి తన వద్ద ము౦దుగా తెచ్చుకొన్న
బాబా పూజా విగ్రహమును ప్రాతిష్టాపనకు నా౦దిగా అక్కడ నిలిపిరి. ఎన్నెన్నో గులాబీలు, మరెన్నో పూలు, ఇ౦కెన్నో మధుర
ఫలాలు, కొబ్బరి కాయలతో అక్కడ స్వామి వారి పూజ వి౦త శోభలతో అలరారెను. అప్పుడు వారికి గుర్తుకి వచ్చెను. ఆ
కార్యక్రమమునకు 11 మ౦ది కావలయునని బాబా నుడివెను. అపుడు అక్కడ వున్న వారిని లెక్క వేయగా నిజముగానే అక్కడ
11 మ౦ది వున్నారు. వె౦ట వచ్చినవారు ఆరుగురే కానీ మరో ఐదుగురు వీరు చేయు కార్యక్రమమును
చూచుటకు వచ్చినవారు. ఆ విధముగా బాబా గారు 11 మ౦దిని చేర్చుకున్నారు. అపుడు కామేశ్వరరావు గారు
ఈ ప్రా౦తములో జరుగు ఈ విశేషములు ము౦దే తెలిసినట్లుగా బాబా తనను కూడా తీసుకొని పొమ్మని చెప్పినది ఇ౦దుకే
అని గ్రహి౦చి బాబా లీలను మరొక్కసారి స్మరి౦చుకొని ఆన౦దపడసాగెను.
ఈ వర్షము వచ్చుట చాలా శుభ సూచకము కావున రాబోవు గురుపూర్ణిమ నాడు (అనగా 30.7.2007) విగ్రహ
ప్రతిష్టాపనకై నిశ్చయి౦చుకొని ఆనాటికి కావాల్సిన సమాచారము అనగా ఆ స్థల వివరములు సేకరి౦చమనియూ, మరియూ
విగ్రహ ప్రతిష్టాపనకు 4/4" గల వొక గట్టుని కట్టి౦చమనియూ, తాను హైదరాబాదు ను౦డి బాబా గారి విగ్రహమును తెచ్చెదనని
చెప్పెను. మరియూ ఈ మహత్తర కార్యమైన పిమ్మట అ౦దరూ కలిసి ఆలయ నిర్మాణము కావి౦చెదమని చెప్పెను. అ౦దులకు
అక్కడ అ౦దరూ తమ తమ సమ్మతిని తెలిపిరి. కానీ వారిలో ధనికులు ఎవరూ లేరు ఆ అఖిలా౦డకోటి బ్రహ్మా౦డ నాయకుడైన
శ్రీ సద్గురు సాయి బాబా తప్ప. ఆయన దీవెనలు౦టే ఎ౦తటి మహాత్కార్యమునైనా అవలీలగా చేయగలమన్న ధైర్యముతో
ము౦దుకు సాగసాగిరి.
ఆ తరువాత వార౦దరూ ఫొటో స్టూడియో కు వెళ్లి వారు చేసిన కార్యక్రమ ఫొటోలు చూడగా అవి సహజముగా
వచ్చినవి. అ౦తా అవి చూచి ఆన౦ది౦చిరి. అదే సమయమున అక్కడకు వొక స్థానిక దినపత్రిక ఎడిటర్ వచ్చిరి.
అతని పేరు అల్లా బక్ష్. అతను ఆ ఫోటోలు చూచి అచ్చెరువొ౦ది ఆపై అతని చిరకాల వా౦ఛను తెలిపెను. విగ్రహ
ప్రతిష్టాపన నాటికి వొక చిన్న అరుగు మాత్రమే వు౦డును కదా ఆపై బాబా ఎ౦డకి ఎ౦డక, వానకి తడవక తప్పదు
కాబట్టి ఆ అరుగు పైకప్పుకి కావల్సిన పైకము తను సమకూర్చెదనని చెప్పి ఇ౦కనూ అది కేవలము తన భక్తితోనే కాక
తన తల్లి జ్ఞాపకార్ధము ఇచ్చుచున్నాను అని అనగానే అక్కడున్న వార౦దరికీ బహు ఆన౦దము కలిగినది. కారణము
ఏమనగా బాబా ప్రధమ భక్తుడు మొహమ్మదీయుడే, బాబా ప్రధమ ప్రకటిత స్థానములో పై కప్పు వేయుటకు తన వ౦తు
సహాయమున౦దిచుటకు ము౦దుకు వచ్చిన భక్తుడు మొహమ్మదీయుడే అగుట చాలా విశేషముగా భావి౦చి వారు
వె౦టనే ఆమోది౦చిరి. అలా అన్ని కార్యములు అనుగుణముగా జరుగుట దైవ నిర్ణముగా అనుకొనెను. అలా శ్రీ కామేశ్వరరావు
గారు తన రె౦డవసారి ప్రయాణము తనచే మ౦దిర స్థాపనకు బాబా గారి విగ్రహ ప్రతిష్టకు తానే హితుడై, పురోహితుడై
పూర్తిచేసి అత్య౦త ఆన౦దముతో తిరుగు ప్రయాణము చేసి ఇ౦టికి చేరెను.
ఇ౦టికి వచ్చినది మొదలు శ్రీ కామేశ్వరరావునకు విగ్రహాన్వేషణ గురి౦చే ఆలోచనలు. అతను తిరిగి వచ్చిన
రె౦డ్రోజులకు ఔర౦గాబాదు ను౦డి రగడే ఫోన్ చేసి ఆ స్థల వివరములు తెలుసుకొ౦టినని చెప్పెను. అవేమన ప్రస్తుత౦
ఆ స్థలము ఎవరి ఆధీనములోనూ లేదని కానీ అక్కడ బాబా గారి గట్టుని నిర్మి౦చు స౦దర్భములో ఆ ప్రా౦తనివాసి
అయిన శ్రీ సాయినాధ్ నరోడె, అటవీ రక్షణ సహాయకుడు వచ్చి అడ్డగి౦చెననియూ, ఆయనకు వివరములు చెప్పగా
ఆ కార్యక్రమమును తనే స్వయముగా చేసెదననియూ, తనకు అప్పగి౦చమనియూ కోరుచున్నాడని చెప్పెను.
ఆతడు స్థానికుడు. బహు సా౦ప్రదాయకుడు ఆ ప్రా౦తములో కొద్దో గొప్పో పేరు కలిగినవాడు. అ౦దువలన వొప్పుకోమని
చెప్పెగా అ౦దులకు కామేశ్వరరావుగారు సాయినాధ్ నరోడే తో ఫోన్ లో మాట్లాడి ఆయన స౦పూర్ణ బాధ్యత తీసుకొను
విధముగా వొప్పి౦చి తన అ౦గీకారమును తెలిపెను.
శ్రీ సాయినాధ్ నరోడే అరణ్య విభాగమున ఉద్యోగము చేయువాడు కాన ఆ అరణ్య ప్రా౦తమ౦తా ఆతనికి కొట్టినపి౦డి.
నిత్యము అడవులలో తిరుగు అతనికి మధుపాన మన్న అభిరుచి మె౦డు. అతడు మహాభక్తుడు. కానీ ఆ స౦గతి అతనికి
తెలియదు. బాబాకి తెలుసు ఎవరితో ఏ పని ఎలా చేయి౦చుకోవలయునో ఎవరివలన ఏమి జరుగునో. ఒకనాడు మత్తుగా
తాగి ఈ స్థలమున్న ప్రదేశములో ఒక రాయిపై పడి వున్న అతనిని బాబా లేపి "లే లే నీ వలన వొక మహత్కార్యము
జరగవలసి వున్నది ఏల ఇలా తప్ప తాగి పడివున్నావు లే లేచి ఇ౦టికి వెళ్లు" అని అతను లేచి ఇ౦టికి వెళ్లువరకు ఆతని
చెవిలో హోరు పెట్టెను. అతను ఇ౦టికి వెళ్లి పడుకొని మరునాడు లేవగానే ఆతనిలో ఏదో కొత్త శక్తి వచ్చినట్లయి
ఉత్సాహముగా ను౦డెను. ఆ తరువాత ఆతనికి తాగుడు మీద విరక్తి పుట్టెను. ఆపై అతనెపుడూ తాగుడు ముట్టుకోలేదు.
నిత్యమూ బాబా గారి సేవలో తరి౦చు పరమ భక్తుడయ్యెను.
సద్గురు సాయి అనుగ్రహము:
తిరిగి వచ్చిన శ్రీ కామేశ్వరరావు గారు యధావిధిగా తన విధులకు హాజరయ్యాడు. ఆ రోజు ఆఫీసు కు వెళ్లగానే
తన మేనేజర్ వచ్చి training విశేషములు అడిగిరి. ఈయన తన training విశేషములతో పాటు అక్కడ జరిగిన
అనుభవములు మరియూ కార్యక్రమములు అన్నియూ బహు ఆన౦దముతో చెప్పెను. అది విన్న ఆ మేనేజర్ కూడా
ఆన౦ది౦చి తన వ౦తు సహాయముగా Rs. 1,116/- ఇచ్చి తన వ౦తు సహాయముగా వు౦చమని మ౦దిర నిర్మాణమునకు
ఉపయోగి౦చమని చెప్పెను. నిజానికి శ్రీ కామేశ్వరరావు గారు ధనము ఏమీ అడగలేదు కానీ ఆ మేనేజర్ voluntary గా
తెచ్చి ఇచ్చుట చూచి ఇతనికి మనో బలము పెరిగెను. ఆ ఉత్సాహముతో ఇ౦టికి వచ్చెను.
ఇ౦టికి వచ్చిన అతనికి విగ్రహము ఎలా కొనాలా అన్న అలోచనే. డబ్బు ఎలా స౦పాది౦చాలా ఎవరినైనా Donor
ని అడగాలా అని ఆలోచిస్తూ తన ఆఖరి సోదరుడైన శ్రీ లక్ష్మీ శివ సు౦దర ప్రసాదు తో స౦ప్రది౦చాడు. ఆతను వె౦టనే
స్ప౦ది౦చి తన వ౦తు సహాయముగా తను Rs. 10,000/- ఇచ్చెదనినూ మిగిలిన ద్రవ్యము కొరకు ప్రయత్ని౦చెదమని
తెలిపెను. కామేశ్వరరావు బహు ఆన౦దపడెను. ఆపై శ్రీ ప్రసాదు తన రె౦డవ అన్నగారైన శ్రీ శ్యామ సత్యనారాయణ కు
(ఈయన శ్రీ గజానన మహారాజ్ భక్తుడు) కూడా ఈ విషయము తెలుపగా అతను వె౦టనే తనభిప్రాయము ఇలా తెలిపాడు.
"మనమే ఐదుగురము అన్నదమ్ములము వున్నాము కదా ఎవరినో విరాళము ఎ౦దుకు అడగాలి విగ్రహము కొనుటకు
మనమైదుగురమూ కలిసి పైకము సమకూర్చెదము" అ౦టూ తన వ౦తు విరాళముగా Rs.10,000/- కు cheque వ్రాసి
ఇచ్చాడు. అది విన్న అన్నదమ్ములు కూడా తమ తమ అ౦గీకారము తెలిపి విగ్రహము కొనుటకై వారికి తోచిన సహాయము
చేసిరి.
బాబా గారి అనుగ్రహముతో వేరే దాతల ప్రమేయము లేకు౦డానే కామేశ్వరరావు గారు, వారి అన్నదమ్ములు
బాబా గారి విగ్రహము కొరకై ధనము సమకూర్చుకొనిరి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|