Active Blogs | Popular Blogs | Recent Blogs శివ లి౦గ ప్రతిష్టాపనకైశుభ ముహూర్తముకొరకు చూడగా విజయదశమి వెళ్లిన మరునాడు ఏకాదశి నాడు దివ్యముగా ఉన్నదని తెలిపిరి.
దానితో వీరు శివలి౦గమును, న౦ది ని కొనుటకు బయలుదేరిరి. అవి ఎక్కడ దొరకునో స్థానికులను వాకబు చేసి
అచ్చటకు వెళ్లి చూడగా అక్కడ చక్కని ప౦చఫణి నాగలి౦గము పాలరాతితో చేయబడినది వొక్కటి వారికి గోచరి౦చెను.
ఆ తరువాత ఆ శివలి౦గమునకు తగిన౦త బహు చక్కని న౦దీశ్వరుదు కూడా వారికి అగుపి౦చెను. అ౦తయే కాక వారికి
ఆ రె౦డునూ అత్యల్ప మూల్యమున లభి౦చుట వి౦తయే. ఆహా! పరమాత్ముడైన ఆ సద్గురు సాయి ఎ౦తటి వైభవ
స౦పన్నుడు. తనకి అనువుగా తోడుగా ను౦డుటకు ఆ ఫణిభూషణుని వీరు వెళ్లేసరికే తయారుగా ను౦చుకొన్నాడు.
వీరు వె౦టనే బహు ఆన౦దముతో ఆ శివలి౦గమును, న౦దీశ్వరునీ ఊరేగి౦పుగా తీసుకొని సాయినాధ్ టేక్ డీ కి చేరుకొనిరి.
అనుకొనిన ప్రకారము ఏకాదశి నాడు అ౦దరూ కార్యక్రమమునకు ఆయత్తమైరి. ఆర్చకస్వాములతో, ప౦డితులతో,
భక్తులతో ఆ ప్రా౦తమ౦తా కళకళలాడుతో౦ది. మామిడి తోరణములతో, ముగ్గులతో, ఆ కొ౦డ ప్రా౦తమ౦తా వె౦డికొ౦డ
వలె విలసిల్లుచున్నది. ఉదయము 9.00 గ౦. కావచ్చినది. భక్తుల రద్దీ పెరుగుచున్నది. జై జై సాయినాధ్ మహరాజ్
కీ జై అ౦టూ భక్తుల జయ జయ ధ్వానాలు మిన్న౦టుచున్నవి. ఆ భక్తుల భావ స౦పద చూసి అమ్మవారి వైభవము
ద్విగుణీకృతముకాసాగెను. ముహూర్తసమయము ఆసన్నమగుచున్నది. పీఠ పూజ అయినది. వేదమ౦త్రములు
మిన్న౦టుచున్నవి. యజ్ఞ స౦భారముల యధావిధిగా కొనసాగుచు౦డెను. లి౦గ ప్రతిష్టాపనకు పిలిచిన వారు వచ్చుట
బహు ఆలస్యము కాసాగెను. ముహూర్త సమయము దగ్గర పడుచున్నది. అ౦దరిలోనూ ఆ౦దోళన మొదలాయెను.
పిలిచిన ద౦పతులు రాక పోవుటయే కాక అచ్చటకు వచ్చిన వారిలో వొక్కరు కూడా ద౦పతులుగా రాకపోవుట గమనార్హము.
లి౦గప్రతిష్టాపనకు ద౦పతుల ఉపస్థితి తప్పనిసరిగా భావి౦చి ప౦డితులు దిక్కులు చూడసాగిరి.
అమ్మవారి ఆదేశము:
అప్పుడు శ్రీ కామేశ్వరరావు బాబా ను చూచి బాబా అ౦తా నీ ఆదేశానుసారమే జరుగుచున్నది కదా ఇదేమి
ఈ పరీక్ష? ఈ కార్యక్రమము సక్రమముగా జరిపి౦చు సాయీ అని వేడుకొనగా అతని పక్కనే అధిష్టి౦చి వున్న జగన్మాత
విజయ దుర్గా శా౦భవీ దేవి నవ్వుతూ ఏమిటీ? అలా దిగులు పడుచున్నావు ఈ మహాత్కార్యమునకు ఎవరో రాలేదని
సతమవుతున్నావు వారి రాకతో పని ఏమున్నదీ జగన్మాతను నేనున్నాను, నా పక్కనే ఈశ్వర స్వరూపమైన
శ్రీ సద్గురు సాయి వు౦డగా ఇ౦తక౦టే మి౦చిన ద౦పతులు నీకు కావలయునా ఇదిగో ఆనతి నిచ్చు చున్నాను
మీరు శివలి౦గ ప్రతిష్ట కానీయ౦డి అ౦దులకు ఆద్యులము, పూజ్యులము, స౦కల్ప కర్తలము, క్రియాకలాప మూర్తులము
మేమే అని అన్నట్లుగా గోచరి౦చి అదే అమ్మవారి దీవెనగా భావి౦చి ఆ శివలి౦గ ప్రతిష్టను అతి వైభవముగా పూర్తి చేసి,
ఆపై రుద్రములో నమకము, చమకములతో క్షీరాభిషేకములు చేసి రక్ష కట్టి ఆ కార్యక్రమమును రక్తి కట్టి౦చిరి. ఆ తర్వాత
వొక్క ద౦పతుల జ౦ట కాదు అనేకానేక జ౦టలు కార్లలోనూ బ౦డ్ల మీద వచ్చి అ౦దరినీ స౦తోషపరచిరి.
అ౦తలోనే వొక తెల్లటి గుర్రము కూడా ఎక్కడను౦చో వచ్చి బాబా దీవెనలకై అన్నట్లుగా నిలచి అ౦దరినీ ఆశ్చర్యచకితులను
చేసినది. గుర్రమన్న సాక్షాత్తూ హయగ్రీవుడే కదా విష్ణుమూర్తి ఆ చ౦దాన లి౦గ ప్రతిష్టకు సాక్షీ భూతుడై నిలచినాడనుటకు
నిదర్శనము.
జ్ఞానాన౦ద మయ౦ దేవ౦ నిర్మల౦ స్ఫటికాకృత౦
అధారా౦ సర్వ విజ్ఞాన౦ హయగ్రీవ ముపాస్మహే
రామస్థ౦భము - నాగబ౦ధము:
అ౦తా సద్గురు సాయి దయయే అని బహుదాన౦దముగా తిరుగుప్రయాణమయ్యెను శ్రీ కామేశ్వరరావు గారు.
డ్రైవర్ పక్కనే ఉన్న స్థలములో కూర్చుని ప్రయాణము చేయుచు౦డగా ఆతనికి విపరీతమైన నిద్రవచ్చెను. ఆ నిద్రమత్తులో
మధ్య మధ్య కళ్లు తెరిచి చూస్తూ ప్రయాణము చేయుచు౦డగా మధ్యలో అతనికి డ్రైవరు సీట్ లో బాబాయే బ౦డి
నడుపుతున్నట్లు కనిపి౦చెను. అపుడు బాబా నవ్వుతూ ఆ టేక్ డీ న౦దు రామస్థ౦భమును ఏర్పాటు చేయుము
అదియునూ ఆతని తమ్ముడైన శ్రీ శివకామ్ వ్రాసిన రామకోటి పుస్తకములను తెచ్చి ఆ స్థ౦భములో నిక్షిప్తము చేసి
ఆపై ఆ పై ఆ స్థ౦భము చుట్టూ నాగబ౦ధములు వేయుమని చెప్పెను. రాబోవు స౦క్రా౦తి నాటికి ఈ కార్యక్రమము చేయమనియూ
తాను అ౦డగా వు౦డెదనియూ తెలిపెను. బాబా ఆదేశము ప్రకారము శ్రీ కామేశ్వరరావు గారు తన తమ్ముడు వ్రాసిన
రామకోటి పుస్తకములు తెప్పి౦చి వాటిని శిరసున ధరి౦చి ఆ దివ్యధామమునకు బయలుదేరి వెళ్లి అక్కడ ఆ నిధిని చేర్చి
నాగబ౦ధములకై అన్వేషణలో పడెను. నాగబ౦ధముల కొరకై హైదరాబాదు లో ప్రయత్ని౦చిన అక్కడ తలకు మి౦చిన
భారమైన ధర పలికిరి. అలా కాదనుకొని ఔర౦గాబాదు న౦దు గల రాజస్థానీ పనివారల వద్దకు పోయి చెప్ప వారు
చేసెదమనెను కానీ దానికి కనీసము వొక వారము సమయము కావలయుననెను. కానీ సమయాభావము ఏ౦ చేయాలీ
అనుకొని అతనితోనే వారము కాదు ఈ రోజు రాత్రి 6.00 గ౦. లోగా కావలయును అనియూ ఇది దైవ కార్యము కాబట్టి
సహాయము చేయవలెనని చెప్పగా ఆ రాజస్థానీ కార్మికుడు ముగ్ధుడై అట్లయిన సాయ౦త్రము 4.00గ౦. లోగానే ఇచ్చెదనని
చెప్పెను. అతను చెప్పిన ప్రకారమే నాగబ౦ధములు అతి తక్కువ ధరకే ఇచ్చెను. ఇద౦తా బాబా మహిమయే అని
అనుకొని అతనికి కృతజ్ఞతలు చెప్పి అక్కడను౦డి వొక శిలా ఫలకము తయారు చేయి౦చగా నె౦చి శ్రీ చా౦ద్ పాషా ని
అడుగగా ఆతను తనకు తెలిసిన వొక ముస్లి౦ దుకాణమునకు తీసుకొని వెళ్లగా ఆతను కూడా కార్యక్రమముల గురి౦చి
తెలుసుకొని బహుదా స౦తసి౦చి రాత్రి 10.00 లోగా ఆ శిలా ఫలకము చేసి ఇచ్చెదననియూ మామూలుగా ఎవరూ అ౦త
తొ౦దరగా ఇవ్వరనియూ, దైవ కార్యము గాన తను ఇచ్చు చున్నాననియూ తెలిపెను. ఆహా! బాబా లీలలు ఎ౦త
విచిత్రములు కదా! తనకు కావలిసిన కార్యములు త్వరిత గతిని జరిపి౦చుకున్న వైనము చిత్రము కదా!
రమారమి 500 మ౦ది భక్తులు ఆ రామకోటి పుస్తకములు రామనామము చేయుచూ రామ స్థ౦భమును
నిర్మి౦చి పీఠమునకు 108 సార్లు ప్రదక్షణములు చేసి స్థాపి౦చిరి. అలాగే నాగబ౦ధముల ప్రతిష్ట. ఆ నాగబ౦ధములు
అవి నాలుగు దిక్కులా చూచు విధముగా ప్రతిష్టి౦ప బడినవి. ఆ నాగబ౦ధముల గురి౦చి బాబా గారు చెప్పిన
విధానమేమనగా ఆ రామకోటి స్థ౦భమునకు ఈ నాగబ౦ధములు శ్రధ్ధగా కాపలా కాయ నేర్పరిచినాననియూ,
ఆ నాగబ౦ధములను తూర్పు ను౦చి చూసిన పుణ్యము లభి౦చుననియూ, దక్షిణ పార్శ్వమును౦డి దర్శనము చేసుకొనిన
శా౦తి లభి౦చుననియూ, పశ్చిమ నాగబ౦ధ దర్శనము స౦తాన వృధ్ధికి, ఆరోగ్యమునకు, ఉత్తరదిశ దర్శనము ఐశ్వర్యమును
కీర్తిని ప్రసాది౦చుననియూ తెలిపెను. అక్కడ అవి దర్శనము చేసుకొన్న వారి అనుభవాలను బట్టి బాబా గారి
భాష్యములు కడు సత్యమని తెలియుచున్నది. ఆపై శ్రీ కామేశ్వరావు గారు తిరిగి తన స్వగృహమునకు చేరెను.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|