Active Blogs | Popular Blogs | Recent Blogs నీ ప్రేమకై..
~~~*~~~
నా హృదయంలో నిదురించే చెలి!
ప్రియమైన నీకు, ఇదే నా మొదటి ప్రేమలేఖ. నువ్వంటేనాకిష్టం.
ఎందుకు? ఎంత? అంటే ఏమో..
ఎలా చెప్పను?
చందమామ వో.. చంద్రలేఖ వో..,
వసంతకోకిల వో.. బృందావనం లో విహరించే సీతాకోకచిలుక వో..
(అనుకోకుండ ఒక రోజు) ప్రేమికుల రోజు న విసాఖ ఎక్స్ప్రెస్స్ (Express) లో ప్రయాణం చేస్తున్న నిన్నుచూశాక నాలో....తొలిప్రేమ కలిగింది.
నా మనసంతానువ్వే నిండిపోయావు.అప్పటినుంచీ నిన్ను మళ్ళీమళ్ళీ చూడాలనివుంది. నిన్నుచూస్తే నాకు పగలేవెన్నెల, ఈ జగమే ఊయల. నువ్వే సర్వం
అనిపిస్తుంది. మల్లెపువ్వు లా నువ్వు నవ్వుతుంటే..నీ చిలిపి కళ్ళు ఊసులాడుతుంటే.. నేను పరవశం చెందాను.
నిన్ను కలుసుకోవాలని, నిన్ను చూడాలని, నాలో ఉన్నప్రేమ, నీతో చెప్పాలని క్షణక్షణం నా ఈ నిరీక్షణ. కానీ నువ్వు ఎదురైతే నా మనసులో మౌనరాగం.
ఒక చిన్నమాట ! నీకోసం నేను తాజ్ మహల్ (Tajmahal) కడతానని, ప్రేమనగర్ నిర్మిస్తాన్ని చెప్పనుగాని.. నిన్ను ప్రాణం గా చూసుకుంటాను.
నీ హృదయం నా గమ్యం, నీ ప్రేమ నా లక్ష్యం. నువ్వు నా ఆరోప్రాణం.
నువ్వు సై అంటే నిన్నేపెళ్ళాడతా.
నీ మనసు నాకు తెలుసు. నా గుప్పెడుమనసు బాధని అర్ధం చేసుకుని చిరునవ్వుతో నువ్వువస్తావని , నీ ప్రేమకై ఆకాశవీధి లో వేచివుంటా.
ప్రేమతో..
శ్రీ,
ఇంటి నెం: 13,
7-G Brindaavan colony,
అనంతపురం వీధి,
ప్రేమదేశం - 143.
Copy Rights Reserved
:-)
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|