Active Blogs | Popular Blogs | Recent Blogs కలిసి పోరుదాం
కలిసుంటే బలం. విడిపోతే బలహీనం. హక్కులైనా, రాష్ట్రాలైనా కలిసిపోరాడి సాధించుకోవడం సులువు.
1996 లో బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12 లో జరిగిన ఓ సదస్సులో ఇదే చెప్పాను.
చిన్న రాష్ట్రాల వల్ల కలిగే పాలనా సౌలభ్యాన్ని ప్రచారం చేద్దామని! ఎవరూ వినలా!
1966 లో ఉస్మానియా యూనివర్సిటీలో శ్రీకాంత్ రెడ్డి అనే కుర్రాడు తొలిసారిగా తెలంగాణ వాదం వినిపించాడు.
అంతకు పదేళ్ళ ముందునుంచీ అది అందరి మనసుల్లో రగులుతున్నదే.
దాన్ని 1969 లో చెన్నారెడ్డి సొమ్ముచేసుకున్నాడు.
1973 లో సీమాంధ్రులు జైఆంధ్ర అన్నారు. అందులో జైతెలంగాణ కూడా ఉన్నట్టేగా. కాని ఈ పోరాటాల్లో సాధించు కోవాలనే తపన కన్నా పోరుగువారిపై ద్వేషమే ఎక్కువ పాళ్ళలో ఉండింది.
ఇదే పాలకులకు వరమైంది. విడివిడి పోరాటాల వల్ల గమ్యం దూరమైంది.
అదేం చిత్రమో గాని, ఒకరు విడిపోదామంటే ఇంకొకరు కలిసుందామంటారు.
ఇన్నాళ్ళూవిడిపోవాలనిపోరాడివందలమందినిబలిదీసుకున్న సీమాంధ్ర పదేళ్ళకే సమైక్య రాగమందుకుంది.
అదేమంటే మా పెట్టుబడులు అక్కడ పెట్టామంటారు. ఈ ఇరవయ్యేళ్ళలోనేగా మనం పెట్టింది.
మరి రాబొయ్యే రెండువందల ఏళ్లలో మనపిల్లలు, వారిపిల్లలు కూడా ఇక్కడే పెట్టాలా? ఎందుకు పెట్టాలి?
తరతరాలూ హైదరాబాదుకు ఊడిగంచేసి దోచిపెట్టాలని రూలుందా?మనకంటూ ఊరూ వాడా లేవా?
వాటిని గాలికి వదిలేశామని చెప్పుకోటానికి నామోషీనా?మనం సంపాదించిందే కదా పెట్టాం!
ఇంక సంపాదించలేమని, వచ్చే తరం వారు చచ్చు దద్దమ్మలనీ డిసైడై పోయారా?
లేక అక్రమంగా సంపాదించటానికి మరో తెలంగాణా దొరకదని దిగులా? మన శక్తి మనకే తెలీకుంటే ఎలా?
అసలు 1953 లో సీమాంధ్రులు ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాల్సి రావడమే ఒక విడ్డూరం.
సర్కారు వారు పనైపోగానే అన్ని ఒప్పందాలనూ అటకెక్కించేశారు.
దానికితోడు వందల ఏళ్ళు విడిగా వున్న హైదరాబాదును కబలించడం మరీ చోద్యం.
ఒక రాష్ట్రంలో ప్రధానంగా ఒకే భాష మాట్లాడే వాళ్ళుంటే బాగుంటుందన్నారు గాని, ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒకే రాష్ట్రంలో ఉండాలనిలేదు. కలిసుండటానికి భాష మాత్రమే ముఖ్యం గాదు.
భావజాలం, సంస్కృతి, ఆర్ధిక సమానత, తెలివితేటలూ, ఆహార వ్యవహారాలూ వగైరా చూడాలి.
ఈ సందర్భంలో నాకో ఆఫ్రికా ఒప్పందం గుర్తొస్తోంది.దక్షిణాఫ్రికా పొరుగు దేశాలతో ఓ ఒప్పందం చేసుకొంది.
వారు తయారు చేసే ఏ వస్తువులనైనా పొరుగు దేశాల్లో ఏ పన్నులూ లేకుండా అమ్ముకోవచ్చు.
అలాగే పొరుగు దేశాలవారు తమ వస్తువులను దక్షిణాఫ్రికాలో పన్నుల్లేకుండా అమ్ముకోవచ్చు.
ఇది బయటి వాళ్లకు సహేతుకంగా అన్పిస్తుంది. కాని ఇందులో ఓ మతలబుంది.
దక్షిణాఫ్రికా పొరుగుదేశాల్లో ఏమీ దొరకదు. అన్నీ దక్షిణాఫ్రికా నుంచే రావాలి.
ఈ విధంగా దక్షిణాఫ్రికా పారిశ్రామికంగా మరింత బలపడుతోంది. దాని కరెన్సీ పెరుగుతోంది.
పొరుగుదేశాలు కటకట పడుతున్నాయి. వాటి కరెన్సీలు జారిపోతున్నాయి.
మేధావులైన సీమాంధ్రులు తెలంగాణాతో కలవడం ఎవరి బాగుకోసం?
కృష్ణాజిల్లాలో ఎకరంపొలాన్ని ఐదులక్షలకమ్మి తెలంగాణలోవందెకరాలు కొన్నరైతుసమానుడెలాగవుతాడు?
పెద్ద చదువులు చదివిన వారు వచ్చి ఇక్కడి నిరక్షరాస్యులతో చేసే చెలిమి నిలుస్తుందని నమ్మమంటారా? మోసపోయేవాడికి తెలియక పోవచ్చు. కానీ చేసేవాడికి తెలియకపోతే ఎలా?
కనీసం ఆదెసలో ఆలోచించడం మన ప్రస్తుత కర్తవ్యం. నిద్ర నటించడం భావ్యం గాదు.
మూడు రాష్టాలుగా విడిపోయి, మూడు రాజధానులతో, ముగ్గురు తెలుగు ముఖ్య మంత్రులతో తెలుగునేల కళకళలాడితే తప్పేంటి? ఆమాటకొస్తే హిందీవాళ్ళు ఎన్నిచోట్ల లేరు?
ఇక పాలనా సదుపాయలంటారా, అవెంతసేపు? నేటి ఆధునిక నిర్మాణ శాస్త్ర నేపధ్యంలో చిటికెలోపని. శంషాబాద్ ఎయిర్పోర్టు చూళ్ళేదూ? రెండేళ్లకే రెడీ అయ్యింది.
పౌరుష ముండాలి గాని అన్నీ సమకూరే వరకు చెట్లకింద అసెంబ్లీ నడిపినా రైటే!
హైదరాబాదేమౌతుందోనని దిగులే బళ్లా! ఆ దిగులు వాళ్ళకే లేదు. మీకెందుకు? మహా అయితే ఇంటద్దెలు తగ్గుతాయి. మరీ మంచిది ఎక్కణ్ణుంచో ఉద్యోగ, వ్యాపార నిమిత్తం ఇక్కడకొచ్చిన మధ్య తరగతి వాడికి కావలసిందదే.
వేలకోట్లు పెట్టిన కొందరి గొడవ గూర్చి మడకసిరలోనో, శ్రీకాకుళంలోనో ఉన్నవారు ఎందుకు వాదులాడాలి?
- తలసాని చంద్ర శేఖర్.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|