Active Blogs | Popular Blogs | Recent Blogs “ Good Morning doctor… “ డాక్టర్ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలి అడుగు పెడుతూ అన్నాడు శ్రీకాంత్
Doctor : Good morning.., Come in.., have seat..
Srikanth : Thanks doctor.. (కుర్చీ లో కూర్చుంటూ)
Doctor : చెప్పండి…
Srikanth : నా పేరు శ్రీకాంత్…, Reliance company లో managerగా వర్క్ చేస్తున్న..
Doctor : ప్రాబ్లం చెప్పండి.. Profile కాదు (డాక్టర్ మాటల్లో వెటకారం..)
Srikanth: హ అదే చెప్తున్నా.. నాకు ఇంకా పెళ్లి కాలేదు డాక్టర్…
( డాక్టర్ మధ్యలోనే ..)Doctor : Why ?? Any problem ??... ఏమైనా Problem ఉంటే మీరుSexologist ని కలవండీ .. నేను Psychiatrist ని .. I am nothing to do with this case..
Srikanth : No doctor.. మీరు అనుకుంటున్నట్టుగా ఏమి కాదు..
Doctor : అయితే చెప్పండి…
Srikanth : నేను నా best frineds ఇంకోనలుగురు కలిసి రూమ్ లో ఉంటున్నాం… (మళ్లీ మధ్యలో కల్పించుకుని..)
Doctor : Oh.. Now I understood.. (చిలిపి గా నవ్వాడు డాక్టర్ ..)
Srikanth : Nooo… No doctor.. మీరు అనుకుంటున్నది కాదు doctor…
Doctor: అవునా.. ఇదీ కాదా?? మరి ఏమిటో చేప్పండి patients waiting బయట …
Srikanth : మేము చాల మంచి frineds.. ఎంతో హ్యాపీ గా కలిసిమెలిసి ఉంటాం .. కానీ మా frineds లో ఇద్దరు ఈ మధ్య రోజూ గోదావపడుతున్నారు.. గొడవలు చూడటానికి సిల్లీ గా ఉన్నా .. వాళ్ళు ఎక్కడ విడిపోతారో అని చాలా భయం గా ఉంది doctor…
Doctor : Hmm.. Okey.. అంతగా గొడవ పడేవాళ్ళు ఒకే రూమ్ లో కి ఎందుకు వచ్చారయ్యా???
Srikanth : ముందు బాగానే ఉండేవాళ్ళు డాక్టర్.. గొడవలు మధ్యలో వచ్చాయి..
Doctor : ఎవరైనా ఇద్దరి మధ్య కావాలని పుల్ల పెట్టార.. (Voiceతగ్గించి ఏదో secret మాట్లాడుతున్నట్టు అడిగాడు డాక్టర్…)
Srikanth : పుల్ల పెట్టిన మాట నిజమే కానీ.. కావాలని కాదు
Doctor: అయ్యో పాపం.. ఇంతకి ఎవరయ్య అది
Srikanth : మహేష్ బాబు
Doctor : మహేష్ బాబు నా?? (ఆశ్చర్యం గా..)
సూపర్ స్టార్ మహేష్ బాబు నా?? ( నమ్మకం కలగక…)
రాజ్ , జమ్మి ఇద్దరు చాలా రోజులు గా మా batch లోనే ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీ గా ఉంటున్నారు.. కానీ వాళ్ళు తమ తమ అభిమాన హీరో కి మాత్రం పిచ్చి అభిమానులు.. మా రూమ్ లో ఎక్కువ MAA TV నే చూసే వాళ్ళం ఎందుకంటే రాజ్ fav movies అతడు, పోకిరి.., జమ్మి fav movies చిరుత, మగధీర వచ్చేది ఈ ఛానల్ లోనే కాబట్టి… మహేష్ సినిమా జమ్మి, చరణ్ సినిమా రాజ్ హ్యాపీగా చూసేవాళ్ళు ఎందుకంటే అప్పటికి వాళ్ళ హీరో మీద అభిమానం ఉన్నా వేరే హీరో మీద కోపం లేదు.. Twitter లో రాజ్ మహేష్ తో పాటు చరణ్ ని ఫాలో అవుతున్నాడు..అలాగే జమ్మి చరణ్ తో పాటు మహేష్ ని ఫాలో అవుతున్నాడు
:
:
:
అది 19th-Oct-2011..మా రూమ్ లో సునామి వచ్చిన రోజు
మహేష్ బాబు తన twitter account లో “This is official now Dookudu crossed all previous records of Telugu film industry share collecions…”అని పోస్ట్ చేసాడు.. ఆ క్షణం నుండి వీల్లమధ్య పచగడ్డి వేస్తే బగ్గుమంటుంది
తన అభిమాన హీరో స్వయంగా తనే ప్రకటించడం తో రాజ్ "దూకుడే industry లో higest grosser" అని బలం గా నమ్మాడు
కానీ మగధీర create చేసిన records ఇప్పట్లో చేరిగేవి కాదని నమ్మిన జమ్మి మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోయాడు ..
Jammi- మీ వాడు పెద్ద fake గాడు (కోపంగా..)
Raj- మగధీర records గురించి నువ్వు గొప్పగా ఎన్ని సార్లు చెప్పలేదు? నేను ఎపుడైనా Fake records అన్నానా?
Jammi – మగధీర genune కాబట్టి నువ్వు అనలేదు.. దూకుడుfake కాబట్టి నేను అంటున్నాను..!
Raj- మా సక్సెస్ ని accept చేయలేకపోతున్నాన్ని చెప్పు..మనసులో కుళ్ళు పెట్టుకుని మాట్లాడుతున్నావ్..!! మీ రికార్డ్స్ బ్రేక్ అయితే తట్టుకోలేక . .!!
Jammi- Genune గా break చేసి ఉంటే accept చేయడానికి మాకేంటి నొప్పి?? Hardly 50 కోట్లు కూడా collectచేయలేదు 70 కోట్లు collect చేసిన మగధీర records ని break చేసేసిన్ధట్ట . . అలాంటి statements ఇవ్వడానికి మీ హీరో కి ఆమాత్రం కామన్ సెన్స్ లేదా??
Raj : ఇంకోసారి మా హీరో ని అంటే ఊరుకునేది లేదు
Jammi : False statements ఇచ్చేవాడికి fans కూడాను.. కలికాలం !!
Raj : ఛి.. నీతో మాట్లాడి waste.. నువ్వొక దురభిమనివి!
Jammi: అబ్బో !! వీడి మొహానికి సంస్కృతం ఒకటి !!
Srikanth : అది డాక్టర్.. అప్పట్నుండి రూమ్ లో ఎపుడు ఏమి గొడవ అవుతదో అర్ధం కావడం లేదు Doctor: Hmm..
Srikanth : Thums-up తెస్తే జమ్మి తాగడు. Pepsi తెస్తే రాజ్ తాగడు.., Airtel CUG లో ఫ్రీ గా మాట్లాడుకునే ఇద్దరు ఇపుడు ఒకడు IDEA లోకి,ఒకడు DOCOMO లోకి మారిపోయారు ..
Doctor : వినడానికి సిల్లీగా ఉన్నా కూడా ఇది చాలా పెద్ద సమస్యే!!
Srikanth : వీళ్ళు మళ్లీ హ్యాపీగా ఉండే ఛాన్స్ లేదా డాక్టర్??
Doctor : లేదంటే.. లేదు., ఉందంటే ఉంది !!
Srikanth : కొంచెం వివరం గా చెప్పండి, ప్లీజ్
Doctor : మహేష్, చరణ్ ఇద్దరు కాకుండా.. NTR కానీ, వేరే హీరో ఎవరైనా కానీ ఈ రికార్డ్స్ అన్ని కొట్టేస్తే అప్పుడు వీళ్ళు కలిసే ఛాన్స్ ఉందయ్యా... !!
Srikanth: అప్పుడు 2nd ప్లేస్ కోసం కొట్టుకోరా ??
Doctor : నా లెక్కప్రకారం .. రికార్డ్స్ విషయం లో 1stకే ఎప్పుడు వేల్యూ.. ఎందుకంటే 1st రికార్డు ఎప్పుడు discussion లో ఉంటాది కాబట్టి, For example 1996 world cup లో ఎక్కువ స్కోరు చేసింది ఎవరు??
Srikanth: సచిన్
Doctor : మరి 2nd highest ఎవరు చెప్పు?
Srikanth : Blank face J,తెలియదు డాక్టర్ !!
Doctor : అవసరం లేదు కూడా..,
Srikanth : NTR-ANR, NTR-Krishna, Krishna-Chiranjeevi, Chiranjeevi-Balakrisha ఇన్ని తరాలుగా లేని ప్రొబ్లెంస్ ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి డాక్టర్
Doctor: అప్పుడు కూడా రికార్డ్స్ ఉండేవి.. కానీ గొడవలు ఉండేవి కాదు ., ఎందుకంటే అప్పుడు ప్రతి పేపర్ ఒకే ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేసేది.. No confusion అన్నమాట !!
మనసుకు నచ్చకపోయినా నిజమని పేపర్ లో వేసాక నమ్మకతప్పేది కాదు ఇపుడు ప్రతి హీరో ఫ్యామిలీ కి సపోర్ట్ గా ఒక న్యూస్ పేపర్, 5లేక 6 టీవీ చానల్స్, వాటికితోడు ఫాన్స్ create చేసిన websites. వాటినిండా మా వాడిదే రికార్డు అంటే మా వాడిదే రికార్డు అని ప్రకటనలు..
అసలే వేరే హీరో రికార్డ్స్ కొట్టాడు అంటే రుచించని ఈ పిచ్చి ఫాన్స్ తమ హీరో కి favour గా ఉన్నా వెబ్సైటు న్యూస్ నమ్ముతారు.. negitive గా ఉన్న న్యూస్ ని fake న్యూస్ గా భావిస్తారు.. నిజానిజాలు తెలుసుకునే విచక్షణ ఎంత మందిలో ఉంది? ఉంటే ఈ ప్రొబ్లెంస్ ఉండేవే కాదు..!!
Srikanth : అసలు ఎందుకు ఈ వెబ్సైటు వాళ్ళు అలా రాస్తారు ??
Doctor : అడిగేవాళ్ళు లేక. ఉన్నాఎక్కడ అడగాలో తెలియక !!
Srikanth : దీనికి పరిష్కారం ??
Doctor : హ హ హ హ !!
"మనసుకు నచ్చింది అబద్దమైనా నమ్మడం.. మనసుకు నచ్చనిది నిజమైన నమ్మకపోవడం మనిషి నైజం.. అది మారేంత వరకు దీనికి పరిష్కారం లేదు !!
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|