Active Blogs | Popular Blogs | Recent Blogs Hi all, I will be very glad if someone would please let me know about the significance of a baby girl being born on amavasya day. What are the remedies one need to follow? Is rudra abhishekam good for this? Please do let me know your views on this please. thanks and regards
Geeta
 PANTULA VENKATA RADHAKRISHNA | ఇక శాంతులందురా ఎనిమిది రకములైన శాంతులు గలవు. ఇవి శిశు జననము నందు / స్త్రీ రజస్వల అయినపుడు కూడా చేయదగినవి.పై ఎనిమిదింటికి తోడు బ్రహ్మణ బోజనమును తోమ్మిదవ దానిగా పేర్కోనవచ్చును. వీటినే నవ విధ శాంతులు అందురు.
ప్రతి పంచాంగం లోను ఈ నవ విధ శాంతుల గూర్చి ఉండును.
ధర్మ సింధువు - నిర్ణయ సింధువు రెండు గ్రంధములందు తిధి వారములకు ప్రత్యేకముగా శాంతులు లేవు. మూడు అనగా తిధి , వార , నక్షత్రములు దుష్టములైనా , పేగులు మెడలో వెసుకు పుట్టిన లేదా ఉదాహరణకు || అమావాస్య ,ఆదివారం ,మూల నక్షత్రము వంటివి కలిసి వచ్చినా ? నవ విధ శాంతులు అవసరమే . దగ్గరోని జోష్యులను సంప్రదించి వారి నిర్ణయము మేరకు దోష క్రియ నిర్వహాణము గావింప వలెను.
------- P.V.RADHA KRISHNA ( PARAKRI )
mail address : pantula.parakrijaya@mail.com
Posted at: 25, Feb 2013 11:44 AM |  PANTULA VENKATA RADHAKRISHNA | గీతా గారికి , మీ మొదటి సందేహం , రెండో సందేహం ఇప్పుడే చూసాను.
ఈ పై సందేహం లో ఆడ పిల్ల అమావాస్య నాడు పుడితే రుద్రాభిషేకం చేయిస్తే శుభం కలుగుతుందా అని వ్రాసారు తప్పకుండా శుభమే ! , కాని శిశు జన నానికి నక్షత్రం ప్రధానాంశం. నక్షత్ర శాంతులే ఉంటాయి. తిధికి వేరుగా , వారమునకు వేరుగా శాంతులు ఉండవు. సాధారణంగా సంతానం కలిగినప్పుడు నక్షత్రం మంచిదా ? కాదా ? అని చూడాలి.
తర్వాత బాలారిష్ట దోషాలు ఉన్నాయేమో చూడాలి.గండ నక్షత్రా లైన / తల్లి , తండ్రి , సోదరుల ఏక నక్షత్రాలైన దోష శాంతి చేయాలి.బారసాల రోజే శాంతి జరిపితే శ్రేయస్కరం. 11 - 12 - 21 - 27 - 29 రోజులలో ఈ శాంతి కర్మ చేస్తారు. దుష్ట తిధి ,వార , నక్షత్రములందు జనన మైనచో శాంతి "అజ్య వీక్షణము"అనగా శిశు ముఖమును నూనెలో (మట్టి ముకుడులో) చూడవలెను.
ఇక శాంతులందురా
Posted at: 25, Feb 2013 11:41 AM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|