Active Blogs | Popular Blogs | Recent Blogs అద్దం
"పదవే ఇంకా రెండు ఇళ్ళల్లో పని చేయాలి ", అంటే ఉలిక్కి పడింది లలిత. మా ఇంట్లో పని చేసే లక్ష్మమ్మ కూతురు లలిత. లలిత నా make up kit కనిపిస్తే చాలు అలా కళ్ళు అప్పగించి చూస్తూనే ఉంటుంది. మా పాపని ఎదయాన పార్టీ కి తయారు చేస్తుంటే మాత్రం ఇంకా అక్కడినుంచి కదలదు, ఇవ్వాల కూడా అంతే.
లక్ష్మమ్మకు లలిత కాకుండా ఇద్దరు కొడుకులు. ముగ్గుర్ని చదివిస్తుంది. లలితను మాత్రం ఆదివారాలు సెలవు రోజుల్లో పనికి తనతో పాటు తెసుకొస్తుంది. లలితకి కూడా రావటం ఇష్టమే. మా ఇంట్లో కాకుండా మా అపార్ట్మెంట్లో ఇంకా ఇద్దరి ఇంట్లో కూడా పని చేస్తుంది లక్ష్మమ్మ. లక్ష్మమ్మ అంటే అందరికీ నమ్మకమే. ఎవ్వరిని నమ్మలేని ఈ రోజుల్లో లక్ష్మమ్మ సంపాదించుకున్న నమ్మకము చూసి అందరు అసూయ పడే వాళ్ళే .
మా కింది ఫ్లోర్ లో ఉండే అనీష చాల స్టైలిష్ గా ఉంటుంది. అందుకే కాబోలు లలితకు వాళ్ళింట్లో పని చేయడం మహా సరదా. అనీష సాఫ్ట వెర్ ఎంప్లాయీ. మొదట్లో ఎప్పుడైనా లేట్ అయితే లక్ష్మమ్మని పని చేసి కీస్ పక్క ఇంట్లో ఇచ్చి వెళ్ళమనేది, రాను రాను అలవాటు అయిపొయింది.
వేసవి సేలువులప్పుడు లలిత రోజు వాళ్ళ అమ్మ తో వచ్చేది . లక్ష్మమ్మ మా ఇంటికి వస్తే లలిత మాత్రం అనీషమ్మ వాళ్ళ ఇంట్లో పని చేస్తానని వాళ్ళ అమ్మని కాకా బట్టి మరీ వెళ్ళేది. సరే వద్దంటే మోత్తానికె రావటం మానేస్తుందేమో అన్న భయానికి వాళ్ళ అమ్మ సరే అనెది. సేలవుల్లో మెము కూడా పది రోజులు ఊరికి వెళ్లి వచ్చాము. వచ్చెసరికి ఇల్లంతా దుమ్ము, లక్ష్మమ్మ వస్తేకాని పని కదలదు. టైం అయిన ఇంకా రాలేదు. వాచ్ మాన్ ని అడుగుదామని కిందికి వెళ్ళాను. చాల రోజులుగా కనబడట్లేదని, అనీషమ్మ తో ఏదో గొడవ అయ్యిందని చెప్పాడు. వింతగా అనిపించింది, లక్ష్మమ్మ ఎవ్వరితో గొడవ పెట్టుకునె రకం కాదు. మామూలుగా అనీష కూడా తన పని తను తప్ప ఏమి పట్టించుకోదు, మరి వాళ్లిద్దరి మద్య గొడవ నాకు అంతు పట్టలేదు. ఇలా ఆలోచిస్తూ నేను వెళ్లిపోతుండగా వాచ్ మాన్ మల్లీ పిలిచాడు. లక్ష్మమ్మ అనీష వాళ్ళ ఇంట్లో ఏదో దొంగతనం చేసిందని తను విన్నాడని చెప్పాడు. అ విషయం చెప్తుంటే అతని కళ్ళలో ఏదో మెరుపు. చా! ఈ మనుషులింతే మారారు అనిపించింది. చేసేది ఏమీ లేక ఇంటికి వెళ్లి పోయాను.
చూస్తూ చూస్తూ మా అమ్మాయి హెయిర్ క్లిప్ప్లు హెయిర్ బాండ్ల నుంచి హెయిర్ స్తైఘ్త్నింగ్ దాక ఎదిగి పోయింది. ఈ మధ్యే మా ఇంటి దెగ్గర ఒక బ్యూటీ పార్లర్ పెట్టారు. నేనూ చూసాను చాలా పెద్దగా ఉంది. అక్కడ facial చేయించుకుంటాను అని మా అమ్మయి చాల రోజులుగా అడుగుతుంది.మామూలుగా దుబార ఖర్చు చేసే రకం కాదు, కానీ ఆ పార్లర్ బాగుందని వాళ్ళ స్నేహితులు చెప్పారని అంది. సరే అని వెళ్ళాం. వెయిటింగ్ రూమ్ లో ఒక రెండు నిమిషాలు కూర్చున్నాక లోపలికి వెళ్లాం కార్పొరేట్ లెవెల్ లో ఉంది అ పార్లర్. చక్కగా యునిఫార్మ్స్ వేసుకొని అమ్మయిలు ఎంతో హుందాగా ఉన్నారు. ఒక అమ్మాయి ఏ బ్యూటీ ట్రీట్మెంట్ కావాలి అని మాతో మాట్లాడుతుంది. అంతలోనే వేరే కస్టమర్ కి హెయిర్ కట్ చేస్తున్న ఒక అమ్మాయి ఆ పని పక్క వారికీ అప్పచెప్పి మరీ మా దెగ్గరికి రావటం గమనించాను. చాల అందంగా పొందికగా ఉంది ఆ అమ్మాయి. చాల దెగ్గర మనిషిల చాల, పరిచయం ఉన్న వ్యక్తి లా అనిపించింది. నా ఆలోచనలకూ అంతరాయం కలిగిస్తూ ఆ అమ్మాయి ఒక్క సారి ‘అమ్మగారు’ అన్నది. ఉల్లికిపడ్డ! ఆ అమ్మాయి ఉన్న పరిసరాలకు, తన పర్సనాలిటీకి ‘ఆ’ పిలుపుకి సంబంధం లేదు.
‘లలితా’ అన్నాను. నాకు నమ్మకం కుదరలేదు. నా లిప్స్తిటిక్ చూసి కళ్ళు పెద్దగ చేసే లలిత ఇప్పుడు ఇంత చక్కగా మా అమ్మాయికి facial చేస్తుంటే ఎంత ముచ్చటేసిందో. ఎంత బాగా తనను తాను ప్రెసెంట్ చేసుకుంటుంది, ఎంత చక్కగా కస్టమర్స్ తో మాట్లాడుతుంది. hats of to her! తరవాత లక్ష్మమ్మ గురించి, వాళ్ళ అన్నయ్యల గురించి అడిగాను. లక్ష్మమ్మని పని చేయనివట్లేదని, అన్నయలు చిన్న ఉద్యోగాలు చేస్తూ బాగున్నారు అని చెప్పింది. తనను ఎన్నో విషయాలు అడిగాను కానీ మేము సెలవులకని ఉరికి వెళ్లి నప్పుడు ఏమైంది అని మాత్రం అడగలేక పోయాను..
లలిత అనీష వాళ్ళ ఇంట్లో పని చేసిన ప్రతీ రోజు అనీష బ్యుటి ప్రొడక్ట్స్ చూసి ఆశ్చెర్య పోయేది. హెయిర్ స్ప్రేలు, ఫౌండేషన్ లు, నైల్ పోలిష్ లు, లిప్ గ్లోస్స్ లు, అసలు ఇన్ని ఉంటాయా అని అలా వాటిని చూస్తూ ఉండి పోయేది. అలా పని గబా గబా చేసేసి రోజు అనీష బెడ్ రూమ్ లో చాల సేపు ఉండి పోయేది. ఒక రోజు లలిత పనికి వచ్చే సరికి అనీష ఇంట్లోనే ఉంది. సాయంత్రం పార్టీ అని చెప్పి ఆఫీసుకి వెళ్ళే లోపలే పార్టీ డ్రెస్ ఇంకా మాచింగ్ అక్సేసరీస్ అన్ని మంచం మీద సిద్దంగా పెట్టుకోవడం లలిత గమనించింది. అనీష తన డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా ఒకటి ఒకటి అమర్చుకోవడం లలిత చూసింది. పని అయ్యాక కీస్ పక్క ఇంట్లో ఇచ్చేయమని లలితకు చెప్పి అనీష వెళ్ళిపోయింది. లలితకు పని మీద ద్యాస ఎక్కడ. అనీష సీ గ్రీన్ పార్టీ డ్రెస్ తన బుర్రలో తిరుగుతూనే ఉంది. ఆ డ్రెస్ తను వేసుకుంటే ఎలా ఉంటుందో ఒక్క సారి తనను తాను చూసుకోవాలి అనిపించింది. ఎంత వద్దన్న మనసు అటే లాగుతుంది. ఒక్క సారి వేసుకొని తీసేయడం తప్పు కాదనిపించింది. ఎన్నో సార్లు డబ్బులు కానీ వేరే విలువగల వస్తువులు కానీ కనిపించిన ఎన్నడు వాటిని ముట్టలేదు, ముట్టాలని అనిపించలేదు. కాని ఈ రోజు మాత్రం తనను తను ఆపుకోలేకపోయింది. మెల్లగా గదిలోకి వెళ్ళింది.
డ్రెస్ తనకు కాస్త వదులుగానే ఉంది. ఆ డ్రెస్ వేసుకొని చూసుకుంది, అస్సలు నమ్మలేకపోయింది.తన జీవితంలో ఇలాంటిది ఎప్పుడు వేసుకుంటాను అనుకోలేదు. అలా చూస్తూ ఉండిపోయింది. తరవాత ఆ chandelier earrings, bracelet, ఒకటి ఒకటి అన్ని పెట్టుకుంది. తనుకు తాను పుస్తకాల్లో చదివిన cindrella లాగా అనిపించింది. అద్దంలో చూస్తూ నవ్వింది, తను జుట్టు looseగా వదిలేసింది. రక రకాల ఫోజులు పెట్టి తనను తాను చుస్కోని మురిసిపోయింది. తను వచ్చి చాల సేపు అయ్యిందని, ఇప్పటికే పని పూర్తి చేసి వేల్లోపోయి ఉండాల్సిందని, అలాంటివి ఏమి గుర్తు రాలేదు. అద్దంలో చూస్కుంటూ మైమరిచిపోయింది. ఆ స్థితిలో తలుపు ఎవరో తెరిచారని , లోపలికి ఎవరో వచ్చారని కూడా గుర్తించలేదు. ‘what the hell’ అంటున్న అనీష అరపుకి ఉల్లికి పడి వెన్నక్కి చూసింది. ఏం చేయాలో అర్ధం కాక భయంతో అనీష కళ్ళలో కోపాన్ని చూస్తుండగా, అనీష వేనకే వచ్చిన లక్ష్మమ్మ తనని లక్కేల్లింది. తరవాత గొడవ జరగడం లక్ష్మమ్మ అవమానం తట్టుకోలేక అక్కడినుంచి ఇల్లు ఖాలి చేసి వెళ్ళిపోవటం జరగాయి.
ఈ సంఘటన వల్ల లలిత ఖచ్చితంగా బాధ పడి ఉంటుంది, కానీ ఆ బాధలో నుంచి ఇలాంటి పరిణామం రావటం అనేది చాల సంతోషకరం. ఆకలి, దప్పిక్క మనిషికి ఎంత సహజమో ఒక అమ్మాయి తను అందంగా కనిపించాలి అనుకోవడం అంతే సహజం. కాని లలిత తాను చేసిన ఒక్క పొరపాటు వళ్ళ క్రుంగి పోక, తనని తాను అద్దం లో ఎలా చూసుకోవాలి అనుకుందో అలా అవ్వడానికి ఆ అవమానం నుంచి బయట పడింది. చిన్న పార్లర్ లో చిన్న చిన్న పనులు చేస్తూ అంచెలంచెలుగా పైకి వస్తు ఇవ్వాళా ఈ స్థాయికి ఎదిగింది లలిత.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|