Active Blogs | Popular Blogs | Recent Blogs కుసుమ కన్నెల ఉసురు తగులునేమోనని గొంతు నులిమి నీకు మాల కట్టను
పసిడి వెన్నెల కసిగా చూసెనని చందమామను దిష్టిగా దిద్దాను
ముచ్చటైన నీ ముద్దు మోముగని ముద్దబంతి మూగబోయెను
చక్కనైన నీ చంపనోక్కుగని చామంతి చావబోయెను
అందమంతా తమదని అందలమెక్కిన అందగత్తెలకు అందని అందాలరాశివి నువ్వు
బ్రహ్మ చేసిన బొమ్మలేవి నీకు సాటి రావు
నిన్ను చూసిన కనుబొమ్మలేవి మూతపడవు
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|