Active Blogs | Popular Blogs | Recent Blogs నేటికి సమాజంలో గృహిణిగా మహిళలకు అన్యాయం ,వేధింపులు తగ్గలేదనే చెప్పవచ్చు .నాగరిక సమాజం సిగ్గు పడేలా గృహ నిర్బంధంలో మహిళలు ఊపిరాడక ,సమస్యలు బయట చెప్పుకోలేక సతమతమవుతున్నవారు కొందరైతే , వారి వేధింపులకి బాలి పశువులు కొందరైతే ,ఆత్మా హత్యలకు పాల్పడే మహిళలు లేక పోలేదు. ఇది సభ్య సమాజమా ?మానవత చచ్చిపోయిందా? లేదా మానవుడు ,దానవుదయ్యాడ? వీటన్నిటి మూలం :...-
1.కుటుంబంలో స్త్రీ పాత్ర
2.ఆడపడుచుల ఆరళ్ళు
3.గ్రుహినిగా మన బాధ్యత
4. కుటుంబ సభ్యుల సహకారం
5.ఆలోచనా విధానంలో మార్పు
1.కుటుంబంలో స్త్రీ పాత్ర :-
కుటుంబంలో ముఖ్యమైన పాత్ర స్త్రీదే .అందులో ముఖ్యంగా అత్తగారి పాత్ర చాల విలువైనది. మరో ఇంటి అమ్మాయిని కోడలిగా స్వీకరించిన అత్తగారు ఆ అమ్మాయి పట్ల సహృదయంతో తన వంతు సహకారాన్ని అందించాలి . నేను ఒకనాడు ఈ ఇంట్లో కోడలినని మరువకూడదు. తెలియని విషయం ఏదైనా వున్నా అనునయంగా తెలియ చేయాలి . " మీ అమ్మ నేకేమి నేర్పింది " అని అపర కాళికలా విరుచుకు పడకూడదు . కట్న కానుకలు సరిగా లేవనో , మర్యాదలు తక్కువయ్యాయనో ఆటూ పొటూ మాటలు రాకూడదు.అవే భవిష్యత్తులో దుష్పరిణామాలాకు దారి చూపుతుంది . కుటుంబంలో శాంతి భద్రతల నిలవు కావాలనుకుంటే , ఆడ దాని పాత్ర చాలా ముఖ్యం . మాటల పోరాటాలకంటే , మంచితనంతో , ఎంతటి కీలక సమస్యలు ఎన్నైనా పరిష్కరించుకోవచ్చు . అత్తలు ఆదేసాలివ్వకుండా , అనురాగం పంచండి. మీ పాత్ర చాలా ముఖ్యం.
2.ఆడపడుచులు :- వదిన , మీ అన్నయ్య భార్య , మీ కుటుంబంలో ఓ కొత్త సభ్యత్వం పొందింది. మీ వంశాన్ని పెంచి పోషించే స్త్రీ మూర్తి అని మరువద్దు. అన్ని పనుల్లొనూ చేదోడు వాదోడుగా వుంటూ ,తెలియని విషయాలు తెలియ చెప్పండి ."నేను కష్టాలు అనుభవించా, నువ్వు కూడా అనుభవించు" అనే ఆలోచన మానుకోండి. మీతో పాటు తను అన్న భావన కల్పించండి .భావనే కాదు బాధ్యతగా స్వీకరించండి .మీ ప్రేమానురాగాల్ని పంచండి ,పెంచండి .
3.భర్తగా :- నిన్ను నమ్ముకుని నీతోటి జీవితం పంచుకోవాలని ఎన్నో ఆశలతో , గృహిణిగా నీ ఇంట కాలూనిన ,గృహిణి పట్ల బాధ్యతగా ప్రవర్తించు . నీ అవసరాలే కాక కుటుంబ బాధ్యతలు ఉంటాయని మరువకు. ఆమె మీ ఇంటి పని మనిషి కాదని , ఆమెకు మీ తో పాటు , అన్ని వసతులు కల్పించాలని ఆలోచించు .సరియైన అవగాహనతో నీ జీవిత భాగస్వామి పట్ల , సహృదయం పెంచుకో , నీకు నేనున్నానన్న భావన కల్పించు . వరకట్న వేధింపులు మరచిపో .
ఆమెను స్వతంత్రంగా శ్వాస పీల్చుకోనివ్వు .నీ సమస్యల్ని ఆమెతో పంచుకో .తనకేమి తెలుస్తుందిలే అనుకోకు . నీలో "అహం" పెంచుకోకు ,కుటుంబ సభ్యుల్లో ఎవరి మాటకు ఎంత విలువనివ్వాలో ఆలోచించు . అది అమ్మ అయినా,ఆలి అయినా ,అన్న వదినలైనా , అక్క చేల్లెలైనా , కుటుంబ సభ్యులతో నీ పాత్రకు సారిన న్యాయం చెయ్యి .అన్దరూ నీకభిమానులే . చివరిదాకా శ్రీమతి నిన్ననుసరించి నడుస్తుంది.
4. భార్యగా :- నేనేదో గృహ నిర్బంధంలో ఉన్నాను . నా వాల్లెవ్వరు లేరు నేను ఒంటరి దాన్ననే భావనే రానీయకండి .కుటుంబ సభ్యులతో కలిసేపోఎట్లు ప్రయత్నించండి . ఆ ఇంటి కోడలిగా , శ్రీవారికి ,శ్రీమతిగా కుటుంబంలో మీ పాత్ర తెలుసుకుని మసలండి .చీటికి మాటికి చిరుబురులాడుతూ , అత్తను , ఆడ పడుచులను నేర దృష్టి తో చోస్తూ , లేని పోనీ ఊసులు మోసుకెల్లి మీ శ్రీవారి చెవులు వూదేయకండి . ఒక్క ఉదుటున , పెత్తనమంతా మీ చేతుల్లో రావాలనుకోకండి. ఎవరి స్దానాల్ని ఎలా గౌరవించాలో తెలుసుకోండి . ఏదో ఇళ్ళన్న తరువాత సరదాగా విమర్సాలోస్తుంటాయి . దాన్ని భూతద్దంలో చూడకండి. ఇది నా ఇల్లు , వీ రంతా నా వాళ్ళు అనుకోండి . కుటుంబ వ్యవస్ధ కుంటూ పద కోడదంటే మీ పాత్ర ముఖ్యం .మరువకండి.
4.కుటుంబ సహకారం :- కుటుంబ సభుల సహకారం చెయొత వుంటే కదా "గృహమేకదా స్వర్గ సీమ " ఈ క్రమంలో అత్తా ఆడపడుచులు అన్న వదినలు భర్తా అందరు అర్హులే , ఏ పాత్ర లో నైన అనుమానం , అవగాహనా లోపం , ఆలోచన పరిధిలో మార్పు రాకుండా చూసుకునే బాధ్యతా , ఇంటి పెద్ద తండ్రిదే , అందరి అభిప్రాయాల్ని ఆదరించగలగాలి. అదే వసుదైక కుటుంబం.
5.ఆలోచనా విధానాల్లో మార్పు :- సమాజం లో మార్పు , మారుతున్న కాలంతో పాటు పెద్ద వారేంటి , పిన్న వారాల్లో కూడా మార్పు ఆసించ దగ్గదే . కూతురైతే ఉద్యోగం చేయాలి , తన అభిలశాల్ని అభిప్రాయాల్ని అవసరాని బట్టి అనుకూలంగా మార్చుకోవచ్చు .అ దే కోడలు గడప దాటకూడదు . తమ కిష్టమైన పోరుగువారితోకూడా మాతాడుకూడదు . తన అభిప్రాయాన్ని తనవారితో పెంచుకోకూడదు .కుటుంబంలో అందరి అవసరాల్ని ఆక్ని పెట్టుక మెలగాలి . ఇటువంటి ఆటిట్యూడ్ తట్టుకోలేక , ఎప్పుడు ఇటువంటి వాతావరణం నుంచి దూకేయాలి అన్న ఆలోచన రాక మానదు. ఇలాంటివే గృహ నిర్బందాలు ఉంచకూడదు .పెద్దవారుగా ఆలోచించదగ్గ విషయం .పెద్దవారిలో మార్పు తప్పనిసరి రావాలి. కోడలిని కూడా కూతిరిలా ఆదరించాలి . ఒత్తి భావనే కాదు నడవడిక కూడా మారాలి .భావన కేవలం మనసుకే పరిమితం . నడవడిక నేర్పేది మెదడు . మనసులో వేలకుమించి ఆలోచనలు . మెదడు తన ఆలోచనల్ని కరం బద్దీకరిస్తుంది .ఈ మార్పే కుటుంబ వనం లో కొత్త చిగుళ్ళు చిగురిస్తాయి . బుడి బుడి అడుగుల సవ్వడులు , చిన్ని చిన్ని ముద్దు మాటలు , మురిపాల మల్లెలు విరబూస్తాయి . ఆ ఇల్లే ఓ నందనవనం .కొత్త పూలు ఘుమఘుమ లతో , సువాసనలు వెదజల్లుతాయి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|