on the life sacrifices of Telangana agitators. in AP Politics at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

ramulu ch's Blogs >> AP Politics

on the life sacrifices of Telangana agitators.

మనమెందుకు చావాలె?
తెలంగాణ వ్యతిరేకులు , అడ్డుపడుతున్న నేతలు వేలు ,లక్షల కోట్లు సంపాదించుకొని భోగాలలో ఊగి,తూగుతుంటే తెలంగాణ మిత్రులారా! మనమెందుకు ప్రాణత్యాగాలు తీసుకోవాలె?మనమెందుకు ఆత్మ త్యాగాలు చెయ్యాలె? ఆలోచించండి.ఇప్పటికే తెలంగాణయోధులు ఉద్యమలొ 9 మంది చనిపోయినట్లు వింటున్నాం,చదువుతున్నాం.ఇంకా కాంగ్రేసుకు కనువిప్పుకాలేదు,అమ్మకు దయరాలేదు.ఐతే అంధోళనలు లేకుండా , ఆత్మత్యాగాలు/ప్రాణత్యాగాలు చెయ్యకుండా తెలంగాణా తెలంగాణను సాధించుకునే మార్గమేలేదా? ఇవేవీ లేకుండా ,చెయ్యకుండా వచ్చే మార్గమేలేదా? ఉంది,ప్రాణత్యాగమంత కష్టమైనదికూడా కాదు,అదేనేను సూచిస్తున్నాను.ఐతే సామూహికంగా తెలంగాణలోని చిన్న-పెద్ద,ముసలి-ముతక,కుంటి-గుడ్డి,సెజ్,ఫ్లోరోసిస్ వంటి భాదితులను ,అన్ని వర్గాల ప్రజలను ఎంత ఎక్కువగా కదిలిస్తే అంతతొందరగా తెలంగాణను సాధించ గలుగుతాము.
తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలను కలుపుతూ రోజూ ఒక్కపూట మానవహారం తెలంగాణ వచ్చే వరకు నిర్మిస్తే యావద్దేశం ద్రుష్టినే కాదు మొత్తం ప్రపంచం ద్రుష్టినే ఆకర్షించగలుగుతాము.ఐతే ఆమానవహారంలో పాల్గొనడానికి హైదరాబాదుకు రావలసిన అవసరం లేదు. ఏజిల్లా వాళ్ళు ఆజిల్లాలో,ఇంకాచెప్పాలంటే ఏమండలంలో వాళ్ళు ఆమండలంలో ఉండే మానవ హాఋఅంలో కలవ వచ్చు.ప్రాణత్యాగాలద్వారా
వినిపించదలచుకున్న,చూపించదలచుకున్న ఫలితాలకంటే ఎక్కువే దాని ద్వారా సాధించగలుగుతాము.ఇది నాప్రగాఢ విశ్వాసం.ఇదే టీడీఎఫ్ చర్చలూ గతంలోనే రాశాను ఈ మానవహారంపైన.ఇప్పుడు జరుగుతున్న ప్రాణత్యాగాలను చూసి విచలితుణ్ణై మళ్ళి రాస్తున్నాను.కేసీఆర్‌ను ముందు మనం రక్షించుకోవాల్సి ఉంది. అందుకు కూడా ఈమానవహారం వెంటనే నిర్వహించగలిగితే తోడ్పడుతుంది.ఇప్పటికే రాస్తారోకోలు,బందులు,బస్సుల దహనాలు వగైరా తెలంగాణ్వాదులు చేసినారు.నేనిచ్చే ఈసలహాను ముందు ఒక్కరోజు అందరూ కలిసి సామూహికంగా పెద్ద ఎత్తున రోడ్లమీద ,ముఖ్యంగా హైవేలమీద నిల్చుని ప్లకార్డులను పట్ట్కొని,స్లోగన్‌లు ఇచ్చుకుంట ఉదయం 9 గంటల నుండు మధ్యాహ్నం 12 గంటల వరకు చేతులో చెయ్యేసుకొని నిలబడితే చాలు,తెలంగాణ వచ్చితీరుతుంది.ఏబస్సును ఆపనవసరంలేదు,ఏబస్సును రాళ్ళు పెట్టి కొట్టనక్కరలేదు.ఐతే సంఘ విద్రోహులు చొరబడి అటువంటి వినాశనం చేసే పనులుచేసి ఉద్యమకారులమీదకు తోసెయ్యకుండా జాగ్రత్త వహించాలి. అన్నింటికంటె ముఖ్య విషయం ఏమంటె ఉద్యమంలో పాల్గొంటు ఇబ్బందులు పడుతు,తిండి తిప్పలు లేకుండా ,నిద్రలు లేకుండా శ్రమిస్తున్న తె-ఉద్యమకారులు తమ కుటుంభ సభ్యులుకూడా ఈమానవహారంలో పాల్గొనేట్లుగా చూసుకోవాలి.రైతులు,కార్మికులు,ఉద్యోగస్తులు,విధ్యార్ధులు,చేతిపనివాళ్లు,కూలీలు కూడా పాల్గొని ఈ మానవహరాన్ని విజయ వంతం చేసేట్లు చూసుకోవాలి.ఇంతకంటే గొప్పదైన గాంధేయ ఉద్యమం మరొకటి ఉండబోదు.ఇది నిజంగా నిర్వహిస్తే ఆమధ్య మన జంటనగరాలలో లక్షమంది చేత నిర్వహించి,గిన్నీస్‌బుక్‌లో చోటు చేసుకున్న అన్నమయ్య సంగీత కార్యక్రమానికి వచ్చిన పేరూకూడా వస్తుంది.దీన్నికూడా ప్రభుత్వం అణచివెయ్యాలని చూస్తే ప్రభుత్వమే అభాసుపాలౌతుంది.



 
Be first to comment on this Blog Post!
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.