On gravity of Telangana agitation in AP Politics at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

ramulu ch's Blogs >> AP Politics

On gravity of Telangana agitation

"తమ్ముళ్ళూ మీతెగువకు గర్విస్తున్న"
తెరాసకు గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 8 ఎంఎల్ఏ సీట్లు,2 ఎంపీ సీట్లు మాత్రమే గెలిపించి గుణపాటం చెప్పారు.ఆసీట్లను తెలంగాణ పని అంతా ఐపోయింది అని తెలంగాన వ్యతిరేకులు అనుకున్నారు,ప్రచారం చేశారు,సంబరాలు చెసుకున్నారు,కొందరు మొత్తం ఉద్యమాన్నే ఎగతాళి చేశారు.అంతకు ముందు కొందరైతే మీ ఉద్యమంలో మహిళలేరి?,ముస్లింలేరి?,విధ్యార్ధులేరి? అంటూ ప్రశ్నిస్తుండేవారు.వారి ప్రశ్నలలో ఎగతాళి మిళితమై ఉండేది.అట్లాంటి వారి ఎగతాళిని భరించలేక అత్యంత బాధతో విచారంతో ఒక చిన్న పాట రాశాను."బానిసలం,బానిసలం,తెలంగాణ బానిసలం"
" తెగువలేని బానిసలం, మనకెందుకు స్వాతంత్రం" అంటూ రాశాను. అట్ల రాసినందుకు ఇప్పుడు చింతిస్తున్నాను.అట్ల రాసినందుకు తెగువచూపిస్తున్న తెలంగాణ వాదులందరిని క్షమించమని కోరుతున్నాను.ఇప్పుడు 29 న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు కూచున్న పిదప మన తెలంగాన వాదులు చూపిన తెగువ హాట్ట్స్ఆఫ్ అని చెప్పాలనిపించేలాగ చేసింది,గర్వపడేలాగ చేస్తున్నది.తెలంగాణేతరుల మధ్య తెలంగాణ వాణ్ణని తలెత్తుకునేలాగ చేసింది.69 ఉద్యమమప్పుడు ఏమీ తెలుసుకోకుండానే, ఏమీ అర్ధం చేసుకోకుండానె అప్పట్లో కొంచం పాల్గొన్నాను.నేనప్పుడు బీఏ మొదటి సంవత్సరంలో ఉన్న. మావూరిలో ఒక 10 మంది బ్రుందాన్ని తయారు చేసుకుని "జెయ్‌తెలంగాణా" అని జెయ్‌కొట్టుకుంట టిక్కెటు తీసుకోకుండా యాదగిరిగుట్టకు తీసికెళ్ళినాను.అప్పట్లో తెలంగాణ ఉద్యమకారులు టిక్కెట్టు తీసుకోకుండానే ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయానిణ్చేవారు.ఇప్పుడు అలా చెయ్యమని చెప్పటంలేదు.ఉద్యమానికి నాయక్త్వం వహించేసంఘం పిలుపునివ్వకుండా అటువంటివి చేపట్తరాదు.విధ్యాసంస్థలకు సెలవులిచ్చినా ఏమాత్రం తగ్గకుండా ద్వ్గుణీక్రుతంగ నేటి ఉద్యమం విజ్రుంభిస్తుంటే చూస్తుంటే అత్యద్భుతం అనిపిస్తున్నది. 'క్యా సీన్ హై' అనాలని పిస్తున్నది. ఇప్పుడు మహిళలు పాల్గొంటున్నారు,రజకులు,నాయీ బ్రాహ్మలు వంటి వివిధ వ్రుత్తుల వారు అత్యుత్సాహంతో పాల్గొంటున్నారు.ఉద్యమాన్ని ఎట్లైనా విద్రోహులనుండి కాపాడుకుంటూ,అన్ని తెలంగాన ఉద్యమ సంస్థలను ఇట్లనే కలుపుకు పోతూ కొన్నీ వారాల పాటైనా కొనసాగిస్తే
సోనియమ్మ దిగొస్తది,ఆమె జేజమ్మ దిగొస్తది. ఐతే నేషనల్ మీడియాను మనం రప్పించి దేశ వ్యాప్తంగా ఉద్యమ ప్రాధాన్యాన్ని గుర్తింపజేస్తేనే అమ్మవారు దిగొచ్చేది.



 
Be first to comment on this Blog Post!
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.