లేమి (మినీకథ).........................చింతల దేవేందర్ in devender at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

Devender Chintala Devender's Blogs >> devender

లేమి (మినీకథ).........................చింతల దేవేందర్

లేమి (మినీకథ).........................చింతల దేవేందర్
మితృడు శర్మ నన్ను కల్సి చాలా రోజులైంది. తనని రమ్మని ఫోన్ చేశాను. కులాసాగా మాట్లాడుకుందామని. శర్మంటే నాకు ప్రాణం. కథలగురించి కవిత్వం పై చాల వివరంగా చెబుతాడు. కథ ఎలావ్రాయాలో సవివరంగా వివరిస్తాడు. మంచి సాహీతీ వెత్త. మంచి కథలు అచ్చైనప్పుడల్లా ఫోన్ చేసి మరి చెప్తాడు వాటిని చదవమని,
పనిబ్యూజి వల్ల చదవడం నాకు కుదరనప్పటికినీ చదివాను బాగుంది అని అబద్దాలు సైతం చెప్పేవాణ్ణి, నా అసమర్థతని, బద్దకాన్ని కప్పిపుచ్చుకొవడానికై.
పాత్రల చిత్రణ కథలోని శైలి శిల్పం మరియు ముగింపు ఎలా వున్నాయో ఎలా వుండాలో విశదీకరిస్తూ చర్చ జరిపేవాడు ఫోన్ లోనే.
సాహిత్యం పట్ల శర్మకి గల శ్రద్దాసక్తులకి నేను అబ్బురపడేవాణ్ణి. రోజుకోసారైనా ఫోన్ చేసేవాడు గంటకు పైగా మాట్లాడేవాడు. శర్మ నన్ను ప్రోత్సహించేవాడు ఏమైనా వ్రాయమని. శర్మ ప్రేరణ వల్ల నాకు కథలు వ్రాయాలనే తలంపు కల్గింది. పర్యవసానంగా ఓ రెండు కథలు వ్రాసి శర్మ చెప్పినట్లుగా పేపర్లకి పంపాను ప్రచురణ నిమిత్తం. చిత్రమేవిటంటే ఓ కథ తిరస్కరణకి గురైనా మరో కథ మాత్రం ప్రచురణకి అర్హమైనట్టుగా తెల్పి ఓ నెల సమయం తీసుకుని అచ్చేసారు పత్రికలవారు. సంతోష పడ్డ నేను ఈ విషయం శర్మకి తెల్పేసరికి తెగ ఆనందపడి పోయి కథ బాగుంది ఇంకా శైలిని, చక్కని ముగింపుని ఇస్తె మంచి కథారచయితవవుతావని కితాబునిచ్చాడు శర్మ.
శర్మ ఇచ్చిన ఉత్సాహం నాకు చాలా నచ్చింది. శర్మ చెప్పినట్టుగానే కథలు వ్రాస్తూ ఉండేవాణ్ణి
శర్మకై ఎదురుచూస్తున్న నాకు ఓ రోజు శర్మే ఫోన్ చేసి హైదరాబాద్ వస్తున్నాననగానే నాకు కల్గిన ఆనందం అంతాఇంతా కాదు. శర్మ రావడం నాకు పండుగలా తోచింది. శర్మని ఆనందంగా రిసీవ్ చేసుకున్నాను. ఆయన వుండే రెండు రోజులకు ఆఫీస్ కి శలవ్ పెట్టి అయనతో జల్సాగా నగరమంతా తిరిగాను. తనూ సైతం ఆనందపడ్డాడు నా సహచర్యంలో.
నా పరిసరాల్ని, వ్యక్తుల్ని తనే స్వయంగా పరిచయం చేసుకుని అందర్తో హృదయపూర్వకంగా మాట్లాడేవాడు శర్మ.
గమ్మత్తైన విషయమేవంటె నా చుట్టుపక్కల వారితో ఇంతకాలంగా మొక్కుబడిగ మాత్లాడుకోవడమేగాని శర్మ వెల్లినంత పూర్వాపరాల్లోకి వెల్లి నేను మనసువిప్పి ఎప్పుడు మాట్లాడలేదు. ఆలాంటి వ్యక్తులతో మమేకమై సరదాగా సంభాషించాడు ఉల్లాసంగా శర్మ. అదీ ఆయనలో వున్న కలుపుగొలుదనం.
రెందు రోజులు హయిగా అందర్తో సఖ్యంగా వుండి సరదాగా గడిపేసి వెళ్ళిపోయాడు శర్మ. నాకెందుకో శర్మ వెల్లిన్తర్వాత ఇల్లంతా బోసిబోయినట్టనిపించింది.
శర్మ వెల్లిన నెల రోజుల్తరువాత శర్మ నాకు ఫోన్ చేసి ఈ వారం పత్రికలో "లేమి" అనే కథ అచ్చయింది, చదివి అభిప్రాయం చెప్పమన్నాడు.
పత్రిక తిరగేసి చూశాను. ఆవును, లేమి కథ శర్మ పేర అచ్చయింది. కథ సాంతం చదివాను, చదివి ఆశ్చర్యపోయాను.
ఆ కథ నన్ను కేంద్ర్రంగా జేసుకుని రాసింది. కాకపోతే మనసున్న మనుషుల మద్య యాంత్రిక జీవితం అనుభవిస్తున్న నేను జీవితాన్నిఆనందమయం చేసుకోలేకపొతున్నానంటూ నా బ్రతుకుని వెక్కిరిస్తూ రాసిన కథ. స్వగతంలోకి వెల్లి పరిశీలిస్తే కాస్తా బాధేసినా నాకు శర్మ వ్రాసింది నిజమేమనిపించింది.



 
Be first to comment on this Blog Post!
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.