Insulting Amarajivi's statues in AP Politics at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

ramulu ch's Blogs >> AP Politics

Insulting Amarajivi's statues

"ఆంధ్రులమీది ఆగ్రహాన్ని అమరజీవిమీదనా?"

తెలంగాణ వాళ్ళు ముందుజేసేది ఎనక, ఎనకజేసేది ముందు చేస్తుంటారు.దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అమరజీవి పొట్టిశ్రీరాములు గారి విగ్రహాల ధ్వంసం,వాటిని అవమానించడం.ఇంతకాలం హైదరాబాదులోనే అమరజీవి విగ్రహాలున్నాయనుకున్న, కాని ద్వంసమైన విగ్రహాల వార్తలు చూస్తుంటే తెలంగాణ జిల్లాల్లోకూడా శ్రీరాములుగారి విగ్రహాలున్నట్లు తెలుస్తున్నది.మద్రాసు రాజధానిగా కలిగిన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకొరకు (వేర్పాటు కొరకు) ఆమరణ నిరాహార దీక్షపూని అసువులు బాసి అమరజీవి ఐనారు శ్రీరాములుగారు.ఐతే ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పాటయ్యి 1956 డిశంబర్ వరకు కొనసాగింది, కాని శ్రీరాములుగారి కోరిక ప్రకారం మద్రాసును రాజధానిగా సాధించలేకపొయ్యింది.అవిషయం అట్లా ఉంచి ప్రస్తుత విషయానికి వద్దాం. అమరజీవి విగ్రహాలను తెలంగాణవాదులు చెప్పులతో అవమానించడం,వాటిని ధ్వంసం చెయ్యడంలో హేతుబద్ధతను విష్లేంచి అర్ధం చెసుకుందాం.తెలంగాణలో జరిగిన మంచి,చెడు పాలనకు గాని,ఆపాలన వల్ల తెలంగాణ వారికి జరిగిన కష్ట-సుఖాలకుగాని లేదా వారి లాభ నష్టాలకు గాని శ్రీరాములు గారికి ఏమాత్రం సంబంధం లేదు.అసలు ఆయన చనిపోయిన పిదప కదా! ఆ.ప్ర. రాష్త్రం ఏర్పడింది. కనుక అమరజీవి ఈతెలంగాణప్రాంతానికి నష్టమూ చెయ్యలేదు,లాభమూ చెయ్యలేదు. ఐనా వారి విగ్రహాలలో కొన్నింటిని తెలుగు సెంటిమెంట్‌ను తెలంగాణలో వ్రుద్ధి చెయ్యడానికి తద్వారా తమ ప్రాంతీయ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రభుత్వమే ఏర్పాటుచేసింది. ప్రభుత్వమే వారి విగ్రహాలను ఏర్పాటుచేసి మొదట తప్పుచేస్తే వాటిని అవమానించి తెలంగాణవాదులు ఇప్పుడు తప్పుచేస్తున్నారు.శ్రీరాములుగారి మరి కొన్నివిగ్రహాలను అభిమానంతో తెలంగాణలోని వైశ్యులు జీవితాన్ని సమాజం కొరకు త్యాగంచెసి తమ కులానికి వన్నె తెచ్చినవానిగా అమరజీవిని గుర్తించి ఏర్పాటుచేసినట్లు తెలుస్తున్నది.తెలంగాణాకు అన్యాయాలు చేసి వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని,వ్యతిరేక చట్టాలు చెసి, తెలంగాణా వారికి కష్టాలు,నష్టాలు కలిగించిన ఎందరివో ఇతర ప్రాంతీయుల విగ్రహాలు తెలంగాణాలో వెలిగిపోతుండగా త్యాగధనుడైన,తెలంగాణకు నష్టం చెయ్యని అమరజీవి విగ్రహాలను ధ్వంసం చెయ్యడం,అవమానించడం ఔచిత్యమని అనిపించడంలేదు.ఐతే ఏత్యాగాలు తెలంగాణా కొరకు చెయ్యని అమరజీవి విగ్రహాలు ప్రభుత్వమే తెలంగాణలో ఏర్పాటు చెయ్యడం ఎంతవరకు సమంజసం? కేసీఆర్ ఆమరణ దీక్ష పిదప ఇప్పుడు చెలరేగిన ఉద్యమంలో ముందుగా నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీకాంతా చారి అనే విధ్యార్ధి తెలంగాణ కొరకు తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్న విషయం మన కళ్లముందున్నది. మరి ఆ శ్రీకాంత్ విగ్రహాన్ని ఏవిజయవాడలోనో , విశాఖలోనో కడపలోనో,కర్నూలులోనో ప్రభుత్వం ఏర్పాటుచేస్తనంటే ఆప్రాంతల వాళ్ళు ఒప్పుకుంటారా? శ్రీకాంత్ విగ్రహాలు అక్కడ ఏర్పాటు చెయ్యడం సమంజసమైతే ఇక్కడ పొట్టి శ్రీరాములుగారివి ఏర్పాటు చెయ్యడం సమంజసమైనవిగా భావించ వచ్చు. ఒకవేళ ప్రభుత్వం తెలంగాణ కొరకు అమరుడైన శ్రీకాంత్ విగ్రహాలు ఏర్పాటుచేస్తే, ఆవిగ్రాహానికి ఇతర ప్రాంతాల వాళ్ళు చెప్పుదండలు వేస్తే లేదా ఆవిగ్రహాలను విరగ్గొడితే మన తెలంగాణ వాళ్ళం ఎట్లా ఫీల్ ఔతాము అనేది ఆలోచిస్తే మన తప్పొప్పులు మనకే అర్ధమౌతాయి. అనాలోచితంగా అత్తమీది కోపం దుత్తమీద చూపించినట్లుగా మన తెలంగాణవాదులు ఆంధ్రులమీది కోపాన్ని అమరజీవిమీద చూపిస్తున్నారు .కనుక అమరజీవి వంటి త్యాగధనుల విగ్రహాల జోలికి పోకపోవడమే శ్రేయస్కరమని తెలంగాణ వాదులు గుర్తించాలి.



 
Be first to comment on this Blog Post!
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.