Active Blogs | Popular Blogs | Recent Blogs సమైఖ్య "ఆంధ్ర " ఉద్యమం చేసే వారు కొంచెం చరిత్ర తెలుసుకుని ఉద్యమించండి. మీరు సమైఖ్య ఆంధ్ర ఉద్యమం చేయడమే పక్ష పాతంగా చేస్తున్నారు. ఇంకా ఆంధ్ర అనే మాట్లాడుతున్నారు. అదే దో తెలుగువారి ఐక్యత ఉద్యమం అని ఎందుకు పెట్టారు? అయినా ఇప్పుడు అదంతా పనికి రాణి ముచ్చట గాని మీరు చేసే ఉద్యమ ఒక్క హైదరాబద్ గురించే అని తెలుసు.ఇన్నాళ్ళు ఇక్కడ (హైదరాబాద్) లో ఉండగలిగిన మీరు ఇక ముందు ఉండలేమని ఎందుకు భయ పడుతున్నారు? ఒక విషయం అందరికి తెలిసింది ఏమంటే ఆంధ్ర నుండి తెలంగాణా జిల్లాలకి వచ్చే వారే ఎక్కువ ,దానికి కారణం ఏమిటో మరి ఆంధ్రులకే తెలియాలి.మీకు తెలంగాణా వస్తే భవిష్యతు ఉండదేమో నని భయ పడుతున్నారు కాని,మాకు భూత కాల,.వర్తమాన,భవిష్యత్తు లో కూడా అంధ కారమే .మాకు జరగాల్సిన న్యాయం కోసం మేము ఉద్యమం చేస్తుంటే మీరు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు.
మీ ఉద్యమం ఏమి సాధించటానికి చేస్తున్నారు?కలిసి ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరికీ న్యాయం జరగలేదని తెలంగాణా వారు,సీమ వారు,ఉత్తరాంధ్ర వారు అందరు అంటున్నారు.మరి అలాంటప్పుడు కలిసి ఉండటం ఎందుకు? తెలంగాణా ఉద్యమం మొదల్లయ్యాక అన్యాయాలు జరుగుతున్న కలిసే ఉండాలని అంటున్నారు సీమంధ్రులు ఎందుకు?చరిత్ర తెలుసుకుని ఉద్యమం చేశ్తే బాగుంటుంది సీమంధ్రులు .మాకు జరగాల్సిన న్యాయం కోసం మేము ఉద్యమం చేస్తున్నాం.
మాకు కావాల్సింది మాకు దక్కాలని చేస్తున్నాం పోరాటం. మా జీవితం మాకు కాకుండా పోతుందని అర్పిస్తున్నం ప్రాణాలు. ఇప్పుడు మీరు హైదరాబాద్ మీద కన్నేసి వదలకుడదని కుటిల బుద్ధి తో చేస్తున్నారు ఉద్యమం.1956 లో మీతో కలవక ముందు అధికారికంగా నిజాం వద్ద బానిసలం. 1956 తర్వాత అనధికారంగా ఇప్పటి వరకు మాకు బానిసత్వం కొనసాగుతూనే ఉంది .
1947- భారత దేశ స్వాతంత్ర్యం
1948- తెలంగాణా స్వాతంత్ర్యం
1953- ఆంధ్ర రాస్త్త్ర ఏర్పాటు (హైదరాబాద్ లేకుండా)
1956- ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు బలవంతపు చర్యల వాళ్ళ హైదరాబాద్ తో సహా
1947 లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా ,తెలంగాణకి రాలేదు అంటే మాకన్నా ముందు గానే మీకు స్వేచ్చ వాయువులు పీల్చే అదృష్టం కలిగింది .1948 లో తెలంగాణాకి పేరుకి స్వాతంత్ర్యం వచ్చిన భూస్వాముల ,దొరల పాలనలో మా బ్రతుకులు అల్లానే ఉంది పోయాయి. 1956 దాక మాతో కలవని మీరు ,మా దగ్గరికి ఎందుకు వచ్చారో అందరికి తెలుసు.1956 వరకు మీ రాజధాని కర్నూల్. కాని అంతకు ముందే ఇక్కడ రాజధానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్న రాజధాని,సహజ సంపద మీద కన్ను పడి ఇక్కడికి ఆంధ్ర ప్రదేశ్ అనే కొత్త సూత్రం తో వచ్చారు. బ్రిటిష్ వారు ఎలా వచ్చారో అల.వ్యాపారం పేరుతో వచ్చి ఇక్కడి సంపదని కొల్ల గొట్టారు.జనాన్ని హింసించారు.
నిజానికి ఇప్పుడు మీరు అభివృద్ధి చేసాం అంటున్న హైదరాబాద్ మా చెమటతో ఎప్పుడో అభివృద్ధి చెంది ఉన్నది కనుకే మీరు మా దగ్గరికి వచ్చారు.ఇప్పుడున్న ప్రతి ఒక కట్టడానికి నిజాం ప్రభువు మా దగ్గర వాసులు చేసిన కప్పం తో కట్టినవే.
ఇప్పుడున్న విశాలాంధ్ర, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అభివృద్ధి చేసామని బీరాలు పలుకుతున్న వారు మీఋ దేన్నీ చూసి అభివృద్ధి అంటున్నారో ,అభివృద్ధి కి చిహ్నాలుగా వేటిని భావిస్తున్నారో తెలియ పరచాలి.ఒక మీరు చేసింది అభివృద్దే అయితే ఆ అభివృద్ధి లో మాది కూడా వాటా ఉంటుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు మీము కూడా కట్టాము కదా పన్నులు .మీకంటే ఎక్కువగా .మా కరెంటు బిల్లులతోనే సగం ఆదాయం వస్తుంది ఖజానకి .ఇక్కడ భూమిని ఆక్రమించి ,మీరు నిర్మించినా నిర్మాణాలు నిజంగా హైదరాబాద్ అభివ్రుద్దిక ,లేక వారి సొంత అభివ్రుద్దిక తెలుసుకోవాలి.
ఎవరికీ కోపం వచ్చినా ఒకటి మాత్రం నిజం.ఒకప్పుడు పరదేశిలు భారత దేశానికి ఎందుకు వచ్చారో మీరు అందుకే వచ్చరు.వారు అప్పుడు ఏమి చేసారో మీరు ఇప్పుడు అదే చేస్తున్నారు.కాకా పోతే ఒకటే తేడా అప్పుడు మన దేశం వారు కాదు.ఇప్పుడు మన దేశం లోనే మన దేశీయులే.ఈ లెక్కన చూస్తే అర్థం కావట్లేదా తెలంగాణకి ఇంకా స్వాతంత్ర్యం రాలేదని.అందుకే తెలంగాణాలో పోరాటం సాగుతుంది.అది తెలుసు కొని మసలుకోక ,కాళ్ళకి సంకెళ్ళు వేసి మందిని ముంచే తెలివి తో ఇంకా సమైఖ్య ఆంధ్ర అంటున్నారు ఎందుకు? తెలంగాణా అవసరం ఏమిటని అడిగితే దానికి వచ్చే సమాధానలు మా బ్రతుకు పోరాటాన్ని ,మా మనుగడకు సంభందించే ఉంటాయి.కాని మీ సమాధానాలు ఎప్పుడో అభివృద్ధి చెంది ఉన్న హైదరాబాద్ కి ముడి పడి ఉంటాయి .లేకుంటే తెలుగు వారం కాబట్టి అందరం కలిసి ఉండాలి అంటారు. దేవేలోపే చేయడానికి హైదరాబాద్ ఒక్కటే ఉందా? సీమ లో ,ఆంధ్ర లో,తెలంగాణాలో అందరు వెనుక పడి ఉన్నాం అంటున్న వారే కదా.మరి సొంత ప్రాంతాలు సమైఖ్యంగా ఉన్నప్పుడు అభివృద్ధి కన్నప్పుడు కలిసి ఉండడం ఎందుకు ? సీమ ,ఆంధ్ర వాళ్ళు నాయకులూ సొంత ప్రాంతాలని అభివృద్ధి చేసుకోలేదు కాని హైదరాబాద్ ని మేము దేవేలోపే చేసాం అంటారు ఎందుకు ?మీకున్న మామూలు తెలివితో ఆలోచిస్తే అర్థం అవుద్ది. కాని మందిని ముంచే తెలివితో ఆలోచిస్తే అది ఇంతకు అర్థం కాదు.విశాల ద్రుఖ్పడం ఉందనుకుంటున్న సీమంద్రులార అదే విశాల ద్రిఖ్పడం తో మా రాష్ట్రాన్ని సాధించుకునే వీలు కల్పించండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|