Active Blogs | Popular Blogs | Recent Blogs ఓం సాయి శ్రీ సాయి జయ సాయి..
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని త్యాగయ్య గారు నుడివినట్లు..
జిజ్ఞాసువులకూ, భక్తులకు, పూజా విధానం తెలియని వారికి..
శ్రీ సాయి నాథుని అనుగ్రహంతో..
మన అందరి సౌలభ్యం కోసం ఈ నిత్య పూజ విధానం
భక్త పరమాణువులు ఇందులో గుణ దోష పరిగణన చేయక..మనస్ఫూర్తిగా క్షమించి భావానికీ, శుద్ధమైన మనస్సుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి..ప్రతి మనిషి పుట్టాక...ఆవలి గట్టు చేరే లోపు..
ఆ భగవంతుని అందరు సులువుగా కొలిచే విధాన
బాబా వారి అనుగ్రహం తో మీ అందరి కోసం...మన అందరి కోసం... నిత్య ప్రార్థన ను చిత్తగించండి..
ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు..ఉంటే దయ చేసి చెప్పండి
నమస్సులతో...వినమ్రంగా..
నాకు ఈ సదవకాశం కల్పించిన నా దైవం మనందరి దైవం శ్రీ షిర్డీ సాయి బాబా కు సాష్టాంగ నమస్సులు ఆర్పిస్తూ….
మనో కృతజ్ఞతా సుమాన్ని ఆ స్వామి చరణారవిన్దములకు భక్తి తో అర్పిస్తున్నాను...
1 . నిద్ర లేవగానే..ఇష్ట దేవతా నామ స్మరణం ముమ్మారూ చేసుకొని..మంచం మీద నుండి కింద కాళ్ళు పేట్టే ముందు భూ మాతకు నమస్కరించి !!! అమ్మా భూ మాత, మమ్మలనందరినీ భరిస్తున్నావు, నీ సహన గుణానికి నా కృతజ్ఞతలు అని..నా పాద స్పర్స చే నిన్ను మైల పరుస్తున్నాను తప్పని సరి పరిస్థితుల వల్ల క్షమించు తల్లీ !!
" పాద స్పర్శం క్షమస్వ మే " అని లెంపలు వేసుకొని
కాళ్ళు కింద పెట్టాలి.
2 . మౌనం గా దంత ధావన చేసుకొని, కాల కృత్యములు తీర్చుకొని.
( ధూమ పానం మాన లేని వాళ్ళు , కాలక్రుత్యానంతరం దంత ధావన గావించాలి ..ఎందుకంటే మళ్ళా పూజ అయ్యే దాక సిగేరెట్టే ముట్ట కూడదు కాబట్టి )
స్నానానికి ఉపక్రమించాలి..
గంగ, యమునా, కృష్ణ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి నదీ మాటల్ని స్మరించి.. బకెట్ లో ఉన్న ఉదకం శిరస్సు మీద చల్లుకొని, మవునంగా, కుడి చేత్తో రుద్దు కుంటూ స్నానం చెయ్యాలి..
౩. స్నానానంతరం :
రాత్రి మిగిల్చిన అన్నం ( తప్పనిసరిగా మిగాల్చాలి ) కూర కలిపి నెయ్యి వేసి ఒక పేపర్ ప్లేట్ లో కలిపి పిట్ట గోడ పైన పెట్టాలి..
పరిమాణం ఒక మనిషి తినేంతగా ఉంటె మంచిది..భగవంతుడు మెచ్చుతాడు. లోభించకుండా పెట్టాలి.
అపుడు పరమేష్ఠి ని ఈ విధంగా ప్రార్థించాలి :
పరంధామా పరాత్పరా, జగత్పితా, జగన్మాతా ! అందరినీ కన్నా అమ్మవు నీవు ! పోషించి, పాలించి కాచే తండ్రివి నీవు !!
నీ బిడ్డలమైన మేము, ఉదర పోషణార్థం చేసే వంట కార్యక్రమంలో, పాత్ర శుద్ధి చేసే ప్రయత్నం లో , దైనందిన జీవితం లో తెలిసీ తెలియక న సహ జీవ రాశిని హత్య చేసిన పాపం నుండి కాపాడు స్వామి !!
నా శక్తి మేరకూ, పాప నివృత్తి కొరకూ చేయగల ఈ చిన్న అన్న దానాన్ని బాధతో, భక్తీ తో అర్పిస్తున్నాను.
అర్చించుట ఎరుగని అజ్ఞానులము స్వామీ !!
దయ తో పర బ్రహ్మ స్వరూపమైన ఈ అన్నాన్ని నా సోదర జీవ క్షుదార్తికి నివేదిస్తున్నాను.
సకల జీవ రాశి హృదయ మందిరాన కొలువున్న పరంజ్యోతి స్వరూపా, పరమాత్మా !! కృపతో నాకు ఈ సదవకాశం అనుగ్రహించావు, కృతజ్ఞుణ్ణి తండ్రీ !! ఈ నివేదన స్వీకరించేలాచేయండి స్వామీ !!
సర్వ జీవుల ఎడ సమ దృష్టి , సోదర భావం వృద్ధి పొందునటుల ఆశీర్వదించి అన్ని జీవులలోనూ నిను దర్శించగల సంస్కారం, సద్బుద్ధి ప్రసాదించు స్వామీ !!
అని ఇష్ట దేవతా నామం స్మరించి..
ఆ ఫలితాన్ని ఇష్ట దేవతా సమర్పణం చేయాలి..
ఉదాహరణకు..నా , మన దైవమైన.. శ్రీ సాయి నాథ
చరణార విందార్పణమస్తు అని అనుకోవాలి..
ఈ పదం ఉచ్చరించాలి..
మిగతాదంతా మానసికంగా అయినా చేయవొచ్చు...ఎవరెవరి శక్తి మేరకూ..
ఇంకా వేరే సద్భావనలు కలిగితే చెప్పండి దయ చేసి..
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|