Active Blogs | Popular Blogs | Recent Blogs తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆద్యుడు రఘుపతి వెంకయ్య నాయుడు. ఆయన విగ్రహావిష్కరణ ఈరోజు హైదరాబాదు, ఫిలిం నగర్ లో జరుగుతోంది. ఆ సందర్భంగా వెంకయ్య గారి విశేషాలను sirakadambamలో చదవండి.
 Ramachandra Rao S | శ్రీనివాసులు గారూ !
మీరు నా బ్లాగు పూర్తిగా చూడలేదనుకుంటాను. దాంట్లో కేవలం సినిమా విశేషాల గురించే కాదు. సాహిత్యం, సమకాలీన సమస్యలు లాంటి అనేక విషయాలు ఉంటాయి. మీకు ఆసక్తి ఉంటే అన్ని పోస్టులు చూస్తే తెలుస్తుంది. చాలామందికి తెలియని విషయాలు అందరరికీ తెలియాలని నేను రాస్తున్నాను. మీ సమాధానానికి కృతజ్ఞతలు
Posted at: 19, Jan 2010 10:54 AM |  Ramachandra Rao S | శ్రీనివాసులు గారూ !
శిరాకదంబం అనేది ఇంటర్నెట్ లో నేను నిర్వహిస్తున్న బ్లాగు. మీరు బ్లాగుల గురించి వినే ఉంటారు. దాంట్లో నాకు తెలిసిన, నేను సేకరించిన విశేషాలను రాస్తూ ఉంటాను. మీరు పైన ఇచ్చిన sirakadambam మీద క్లిక్ చేస్తే నా బ్లాగులోకి వెడుతుంది. అది చూస్తే మీకే అర్థమవుతుంది. అక్కడ వివిధ విషయాల మీద నేను రాసిన టపాలు ( వ్యాసాలు ) ఉంటాయి. అవి చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక అర్థానికి వస్తే ' శిరా ' నా పేరులోని పొడి అక్షరాలు. 'కదంబం' అంటే మాలిక. వివిధ విషయాల సమాహార మాలికగా నేను నిర్వహిస్తున్న బ్లాగుకి ఆ పేరు పెట్టుకున్నాను.
Posted at: 18, Jan 2010 10:56 PM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|