ఉక్కు మనిషి in శిరా కదంబం - SiRaKadambam at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

Ramachandra Rao S's Blogs >> శిరా కదంబం - SiRaKadambam

ఉక్కు మనిషి

సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే భారతీయులకు ' ఉక్కు మనిషి ' గా గుర్తుకొస్తారు.

తెలుగువారికి నిజాం చేతుల్నుంచి, రజాకార్ల దౌష్ట్యాల నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని మిలటరీ చర్యతో విడిపించిన నాయకుడు గుర్తుకొస్తాడు.

ఈరోజుల్లో దేశం, రాష్ట్రం అనేవి తమ స్వంత జాగీరుల్లాగా, కంపెనీల లాగ చూసుకుంటూ, దానికి తమ తదనంతరం తమ పిల్లల్ని, బంధువుల్ని వారసులుగా తయారు చెయ్యడానికి ప్రజలను పావులుగా వాడుకుంటున్న నాయకులే అడుగడుగునా కనిపిస్తారు. వాళ్ళు, వాళ్ళని గుడ్డిగా నమ్మే వాళ్ళు ఈ విషయం నమ్ముతారో లేదో తెలియదు కానీ రాజకీయాల్లోను, రాజకీయ నాయకుల్లోనూ విలువలు మిగిలున్న రోజుల్లో జరిగిన సంగతి కనుక ఇది నిజంగా నిజం

పటేల్ గారికి ఒక కుమార్తె - మణిబెన్ పటేల్. ఒక్కడే సుపుత్రుడు దహ్యాభాయ్ పటేల్. సర్దార్ పటేల్ గారు భారత ఉప ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో వారి పుత్రుడు బొంబాయిలో ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త. తండ్రి ఎంత నిజాయితీపరుడో కొడుకు అంత అవినీతి పరుడు. తండ్రికి తెలియకుండా ఆయన పదవిని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడేవాడు.

పటేల్ గారికి ఈ విషయం తెలిసింది. వెంటనే అప్పటి పరిశ్రమల శాఖ మంత్రికి ఒక లేఖ రాసారు. అందులో విషయం చదివితే సర్దార్ పటేల్ నిజాయితీ ఏమిటో, నాయకుడంటే ఎలా ఉండాలో తెలుస్తుంది. ఆ లేఖలో......

' నా కుమారుని పరిశ్రమల గురించి గానీ, అతని ప్రవర్తన గురించి గానీ నాకు ఎంతమాత్రం సంబంధం లేదు. ప్రభుత్వ పరంగా అతని మీద గానీ, అతని పరిశ్రమల విషయంలో గానీ ఏ రకమైన చర్యలు తీసుకోవడానికైవా మీరేమీ వెనుకాడననక్కరలేదు. మీరే చర్యలు తీసుకున్నా నేనేమీ కలుగజేసుకోను. '

ఇదీ ఆ లేఖ సారాంశం. ఇప్పటి వాళ్ళకు ఇదీ ఒక ప్రచారం కోసం చేసే జుమ్మిక్కుగా కనిపిస్తే ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే మనం రోజూ చూసేవి ఇలాంటి జిమ్మిక్కులే కనుక. కానీ ఆయన నిజాయితీని, నిబద్ధతనీ శంకించేవాళ్ళకు కొసమెరుపు ఏమిటంటే సర్దార్ వల్లభాయి పటేల్ అవినీతిని సహించలేక, తన ఏకైక పుత్రుడి మొహం చూడడానికి కూడా ఇష్టపడక చివరి రోజులు తన మిత్రుడి ఇంటిలో గడిపి అక్కడే కన్నుమూసారు. ఈ రోజుల్లో అలాంటి రాజకీయ నాయకుల్ని ఊహించగలమా ?



 

Ramachandra Rao S
మీకుగా మీరేం చెయ్యాలనుకుంటున్నారో మీరే ప్రారంభించండి. ఏమో ! ఆ సంస్కరణలేవో మీతోనే ప్రారంభమవుతాయేమో ! అంతేకానీ మీ మాట వినని వాళ్ళందరూ అసమర్థులు,పనికి రాని వాళ్ళు అని అనుకోకండి. ప్రతి ఒక్కళ్ళూ ఏదో ఒక విషయంలో వాళ్ళ వాళ్ళ పరిధిలో గొప్పవాళ్ళే ! ఎవరూ పరిపూర్ణులు కారు. మన చుట్టూ ఉన్న సమాజం నుంచి, మనుష్యులనుంచి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. ఏదైనా విషయం మీద కానీ, మనిషి మీద కానీ ఒక అభిప్రాయం ఏర్పరుచుకునే ముందు ఆ విషయం గురించీ, ఆ మనుష్యుల గురించీ కూలంకషంగా తెలుసుకుంటే మంచిది. మీకెన్నో లాభాలు తెచ్చిపెడుతుంది. వివాదాలు, సందేశాలు నాకిష్టముండదు. అందుకని ఈ అంశం ఇంతటితో ముగుద్దాం ! మరో మంచి విషయం గురించి ఎప్పుడయినా మాట్లాడుకుందాం ! All the best.

Posted at: 22, Jan 2010 6:32 PM

Ramachandra Rao S
శ్రీనివాసులు గారూ !
ఓపిగ్గా నా సమాధానం చదివి, మరింత సుదీర్ఘమైన వివరణ ఇచ్చినందుకు సంతోషం. మీరు నా బ్లాగు పూర్తిగా చూడలేదని అర్థమయింది. మీరు పూర్తిగా చూస్తే నా ప్రొఫైల్ చదివితే center of attraction నాకెందుకు అవసరంలేదో అర్థమవుతుంది. నా రాతలన్నీ చదివితే వాటిల్లో ఎక్కువ భాగం పెద్దలు చెప్పిన మాటలు, వారికి సంబంధించిన విశేషాలు, ఇంకా వారి రచనల పరిచయాలు ఉంటాయి. మరోసారి చూడండి. నేను రాస్తున్నది నాకు తెలిసిన మంచి విషయాల గురించి. సమాజంలో మంచివాళ్ళు లేరనుకుంటే మీలాగే అందరూ పనికి రారనుకుంటే నా రాతలు ఇలా ఉండవేమో ! సమాజాన్ని ఉద్ధరించాలనుకుంటే సమాజంమీద కసి, కోపం పెంచుకుంటే కుదరదు. మీ అభిప్రాయాల్ని గౌరవించాలని అందర్నీ బలవంతం పెట్టి భంగపడి బాధతో మగ్గిపోవడం కంటే మీకుగా మీరేం చెయ్యాలను

Posted at: 22, Jan 2010 6:20 PM

Ramachandra Rao S
ముఖ్యంగా మంచి విషయాల విషయంలో. చెడు మనసుకి ఎక్కినంత తొందరగా మంచి విషయాలు ఎక్కవని ఇంత అనుభవం గడించాక కూడా నాకు తెలియదంటారా ? మహాకవి శ్రీశ్రీ గారి లాంటి మహానుభావులు తమ రచనలతో సంచలనం సృష్టించగలిగారే గానీ సమాజంలో ఎంతమాత్రం మార్పు తీసుకురాగలిగారో మీకు తెలియదా ?
మరెందుకు రాస్తున్నానంటారా ? పుస్తక పఠనం నా ప్రధానమైన ఆసక్తి. గత ముఫ్ఫై యేళ్ళ పైబడి అనేక పుస్తకాలు చదివాను. ఆ జ్ఞానాన్ని నాలోనే సమాధి చేసుకోకుండా పదిమందికీ పంచాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు మొదలు పెట్టాను. అవి ఎవరికైనా ఉపయోగపడితే సంతోషమే !
మీరన్న వాటికి సరిపోయే వేదిక బ్లాగు కాదు. ఇంకా చాలా ఉన్నాయి. నావి కాలక్షేపం రాతలు, attraction కోసం రాసేవి కావేమోనని నా ఉద్దేశ్యం. అవి వేరేగా ఉంటాయనుకుంటాను. మీకెందుకలా అనిపించాయో

Posted at: 22, Jan 2010 8:42 AM

Ramachandra Rao S
శ్రీనివాసులు గారూ !
ముందుగా మీ మొదటి వ్యాఖ్యకు ధన్యవాదాలు.
ఇక రెండో వ్యాఖ్య విషయానికొస్తే -
1. center of attraction కోసం రాయాలంటే ఇంత లేటు వయసు దాకా ఆగనక్కరలేదు. సుమారు 30 యేళ్ళ క్రితం నుంచే రాసుకునే అలవాటుంది. ప్రచురించడానికి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఆసక్తి లేక ఆ ప్రయత్నం చెయ్యలేదు. ఇప్పుడింక ఆ ప్రయత్నం అవసరమంటారా ?
2. ఇక time pass కోసమనే విషయం గురించి - అంత ఖాళీ సమయం నాకు లేదండి. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా చాలా బాధ్యతలున్నాయి.
3. సొసైటీలో మార్పు తీసుకు రావడానికి అనే విషయం గురించి - నా రాతల ద్వారా, చేతల ద్వారా సమాజంలో సమాజంలో మార్పు తీసుకురాగలనని నేను నమ్మను. నేనే కాదు. ఎవరి వల్లా కాదు. ముఖ్యంగా మంచి విషయాల విషయంలో. చెడు మనసుకి ఎక్కినంత తొందరగా మంచి విషయాలు ఎక్కవని ఇంత అనుభవం గడించాక కూ&#

Posted at: 22, Jan 2010 8:23 AM
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.