on solution to Telangana issue in AP Politics at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

ramulu ch's Blogs >> AP Politics

on solution to Telangana issue

-:బహుళ ఆదరణను పొందనున్న హెచ్ఎంటీవీ:-
హెచ్ఎంటీవీ ఒకే ఒక్క తెలంగాణ చానల్.ఐనా ముప్పైకి పైన ఉన్న ఆంధ్ర-సీమ చానళ్ళ మధ్య పూర్తి స్వేచ్చతో వ్యవహరించలెకపోతున్నది.తెలంగాణకు సంబందించిన అన్ని అంశాలను చూపించలేకపోతున్నది.ఐనా మొత్తం ఐతర ప్రాంతాలవారి చనళ్ళు ఇంతకుముందువలె ఏకపక్షంగా(ఒకేప్రాంతం పక్షాన) వ్యవహరించే పద్దతిని ఆపగలిగింది.ఇప్పుడు అందరు చానళ్ళను మార్చి,మార్చి చూస్తూ ఏచానల్ వాస్థవాలు ప్రసారం చేస్తున్నదో దాన్నే ఎక్కువగా చూస్తూ గ్రహించగలుగుత్తున్నారు.ఇటివల హెచ్ఎంటీవి వారు నాలుగు ప్రాంతాల్లో చేపట్టిన చేపట్టిన 'దశ-దిశ 'కార్యక్రమాలను ఆ.ప్ర.లోని అన్ని జిల్లాలవారు ఎక్కువగా వీక్షిస్తున్నట్టు తెలుస్తున్నది.నేను వైజాగ్,వరంగల్‌లలో జరిగిన చర్చలను ఎక్కువ భాగం చూశాను.ఆచర్చలలో ఆంధ్ర్-సీమలలో ఉన్న పేద (బడుగు),దళిత వర్గాలకు తెలంగాణ ఏర్పడటం ఐష్టమేమీ కాదని తెలిసిపోయింది.అందువల్ల తెలంగాణావాళ్లంతా ఆంధ్త-సీమలలోని అందరిమీద కోపం పెంచుకోవాల్సిన అవసరం లేకుండ పోయింది.ఇటువంటి కార్యక్రమాలతో తెలుగు ప్రజలమధ్య ఏర్పడిన వైషమ్యాలను తగ్గిస్తున్నది.కనుక హెచ్ఎంటీవీ బహుళ ఆదరణను పొందే అవకాశం ఉంది.ఐతే వాళ్ళెవ్వరూ సమైక్య పేరుతో చేస్తున్న ఆంధ్ర్ ఉద్యమానికి మద్దతు ఇస్తలేరని ఈ'దశ-దిశ ' కార్యక్రమంవల్ల తెలిసిపోయింది.బడుగు,దళిత వర్గాలవారు తమ మద్దతు ఇవ్వకున్నా కేంద్ర ప్రభుత్వం గత డిశంబర్ 9వ తేదీన ప్రత్యేక తెలంగాణ ప్రాసెస్‌ను ప్రారంభిస్తున్నాం అని ప్రకటించిన 6 గంటలలోపే వేలాది మందిని ఆంధ్ర-సీమల సుమారు అన్ని జిల్లాలో లగడపాటి,రాయపాటి,కావూరి మొదలగు నాయకులు ఎట్లా తీసుకు రాగలిగినారనేది, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఆస్థులను విధ్వంసం చెయ్యగలిగారనేది ఇప్పటివరకు అంతుపట్టకుండా ఉంది.తెలంగాణ వేరవడం వల్ల,లేదా సమైక్య రాష్ట్రంగా ఉండడంవల్ల తమకు ఏమి వస్తున్నదో తెలియని కొందరు బడుగు,దళిత వర్గాలవారు మాత్రం
ఆవిధ్వంసంలో పాల్గొన్నట్లు తెలుస్తున్నది.కేంద్రం అందువల్లనే ఒక అడుగు వెనక్కువేసి 23 న మరో ప్రకటన చెయ్యవలసి వచ్చిందని తెలుస్తున్నది. ఆంధ్ర్-సీమల ప్రాంతాలలో ఎన్నిరోజులు బందులు నిర్వహించినా,రస్తారోకోలు నిర్వహించినా,ధర్నాలు చేపట్టినా ఆప్రాంతాల్లో తెలంగాణావారు అతి తక్కువ మంది ఉన్నారు కాబట్తి తెలంగాణావారికి వచ్చే నష్టం ఏమీలేదు.ఐతే ఈవిషయం సోనియమ్మకు బహుశ: తెలిసి ఉండకపోవచ్చు.అక్కడి ప్రభుత్వ ఆస్థులను బలవంతంగానైనా రక్షించుకోగలిగితే కేంద్రం తన మొదటి ప్రకటనకు కట్టుబడి ఉండగలదు. అదీగాక 'సమైక్య ఆంధ్ర ' ఉద్యమంలోని డొల్లతనం(న్యాయం లేని స్థితి) ఇప్పుడిప్పుడే అందరికి తెలుస్తున్నది.కనుక ఇకముందు కేంద్రం ఆంధ్ర-సీమలలో కటువుగా వ్యవహరించగలిగితే మరికొన్ని ఆస్థులు ధ్వంసం ఐనా లెక్కచెయ్యకుండ వ్యవహరిస్తె సమస్య అతిత్వరలో పరిష్కారం అవుతుంది.ప్రత్యేక తెలంగాణ ఏర్పాడితేనే ఇప్పటి ఉద్యమంలో రెండువందల మందికి పైగా ఆత్మాహుతి చేసుకున్నవారికి ఆత్మశాంతి,వారి కుటుంబాలకు శాంతి చేకూరుతుంది



 

Naresh Naresh jinnah
Good morning...Ramulu garu....
Yes, meeru cheppedi correct... Telangana ravalante aa matram kastapadaali............

Posted at: 27, Jan 2010 10:16 PM
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.