Active Blogs | Popular Blogs | Recent Blogs పుట్టిన ప్రతివారూ మరణించక తప్పదు.
ఈ విషయం అందరికీ తెలుసు.
మనిషి సుఖంగా జీవించడానికి కనీసావసరాలు తిండి, బట్ట, గూడు.
ఈ విషయం కూడా అందరికీ తెలుసు.
ఈ కనీవసరాల సాధనకు ఉపయోగించే సాధనం డబ్బు.
ఈ విషయం తెలియని వారెవరూ లేరు.
అవసరానికి మించి సంపాదించిన సొమ్ము మనశ్శాంతికి దూరం చేస్తుంది.
ఇది కూడా తెలియని వారెవరూ ఉండరు.
పుట్టేటపుడు మనతో రాని డబ్బు పోయేటపుడు తీసుకు పోలేమని తెలుసు
ఆ డబ్బు సంపాదనకు అడ్డదారుల్లో వెడితే వచ్చే అనర్థాలేమిటో మనందరికీ బాగా తెలుసు
అయినా డబ్బు సంపాదించాలనుకుంటాం ! అది మన బలహీనత.
ఆ సంపాదన కోసం అడ్డదారులు తొక్కడం, అన్యాయాలు చెయ్యడానికి సిద్ధపడటం కూడా మన బలహీనతే !
ఒక స్థాయి వరకూ డబ్బుని మనం ఆడిస్తాం !
ఆ తర్వాత డబ్బు మనల్ని ఆడిస్తుంది !!
అప్పుడు స్నేహాలు, బంధుత్వాలు, అనుబంధాలు, ఆత్మీయతలు.... ఇవేవీ కనబడవు
' మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే ' అన్న మార్క్స్ మాటే నిజమవుతుంది
డబ్బు పెరిగితే అనుమానం పెరుగుతుంది. భయం పెరుగుతుంది.
అహం పెరుగుతుంది.
మౌనంగానే ఎదగమని చెప్పే మొక్క మనకు కనబడదు.
ఆ మొక్కకు మూలమైన విత్తనం కనబడదు.
దానికి ఆత్మీయత రంగరించిన నీళ్ళు పోసి పెంచిన చెయ్యి కనబడదు.
ఎదిగినకొద్దీ ఒదిగి ఉండాలనే విషయాన్ని మరిచిపోతాం !
మన కళ్ళకు అహం పొరలు కప్పేస్తుంది.
పెట్టిన చేతినే నరుకుతాం ! పెంచిన మమతనే తుంచుతాం !
అప్పుడు డబ్బే సర్వస్వం అవుతుంది.
చివరకు ఆ డబ్బే రోగం రూపంలోనో, శత్రువుల రూపంలోనో మనల్ని బలి తీసుకుంటుంది.
మనల్నే కాదు మన కుటుంబాన్ని కూడా కష్టాల కొలిమిలోకి నెడుతుంది.
మనకున్న కోట్లు మన కుటుంబాన్ని రక్షించలేవు.
మనకున్న కోట్లు మనని చావునుంచి తప్పించలేవు.
ఈ విషయం మనకి తెలియదా ? తెలుసు ! కానీ మరచిపోతాం !
డబ్బు మత్తు మనల్ని ఆవరించి ఉన్నంతకాలం మరచిపోతాం !!
ఈ డబ్బు అనేది లేకపోతే లోకం ఎంత ప్రశాంతంగా ఉంటుంది ?
ఉహించడానికి బాగానే ఉంది. నిజమైతే ఇంకా బాగుంటుంది.
అప్పుడు ప్రశాంతంగా పుట్టిన మనిషి ప్రశాంతంగానే మరణిస్తాడు కదా !
!
 Ramachandra Rao S | సందేష్ గారూ !
దన్యవాదాలు. మీరు క్రమం తప్పకుండా నా బ్లాగు చూసి మీ అభిప్రయాలను చెప్పండి.
Posted at: 6, Feb 2010 2:52 PM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|