Active Blogs | Popular Blogs | Recent Blogs అనావ్రుష్టికి గురయిన ప్రజల సహాయార్ధం వారికి పని కల్పిస్తూ ఛత్రపతి శివాజీ ఒక వంతెన నిర్మాణం గావిస్తుంటాడు. అక్కడ పనిచేస్తున్న కూలీలనందర్నీ చూచి శివాజీ తన దయవల్లనే ఇన్ని వేలమంది ప్రజలు కూలి చేసుకొని కడుపు నింపుకొంటున్నారని, తానా పనిని వారికి కల్పించి ఉండకపోతే ఆకలితొ మాడి మరణించి ఉండేవారని భావిస్తు గర్వంతొ పొంగిపోతాడు.ఆ దారివెంట వెళుతూ సమర్ధగురు రామదాసు ఆ స్థితిలో శివాజిని చూచి పరిస్థితిని అవగతం చేసుకొని మౌనంగా ఊరుకొంటాడు.తరువాత రోజు శివాజిని వెంటబెట్టుకొని ఒక మార్గం గుండా పయనిస్తూ దారిలొ కనిపించిన ఒక పెద్దరాయిని శివాజికీ చూపి దానిని కదలించగలవేమో ప్రయత్నించమంటాడు.అతి సునాయసంగా వీరశివాజీ రాయిని ఎత్తి పడవేశాడు. రాయి క్రింద ఒక గొయ్యి, గోతిలో నీళ్ళూ, నీటిలో కొన్ని కప్పలు గెంతుతూ కనిపించాయి.సమర్ధగురు రామదాసు శివాజీ వంకచూసి ఈ రాయి క్రింద ఈ కప్పల కోసం,ఇంతటి సౌకర్యం,రక్షణ బహుశా నీవే కల్పించివుంటావు.నీ ఔదార్యం వల్లనే ఇవి మాడి మరణించకుండా ఉల్లాసంతో జీవితాలు గడుపుతూ వుండి ఉంటాయి. అవునా! అని తీక్షణంగా ప్రశ్నించాడు.శివాజీ సిగ్గుతో తల వంచుకుంటాడు.ఇలా ప్రతి విషయంలోను సమర్ధగురు రామదాసు శివాజీకి వాస్తవాన్ని, కర్తవ్యాన్ని సూటిగా స్పస్టంగా తెలియచేప్పేవాడు. కేవలం ఆయన అనుగ్రహం మార్గదర్శనం లోనే శివాజీ అడుగడుగునా ఆపదలను అధిగమిస్తు శ్రెయోమార్గంలో పయనించి గొప్ప వాడయ్యాడు.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|