ఈసినిమాను నాఫ్రెండ్‌తో కలిసి 1స్ట్ నాడు చూసేందుకు పోతే 50రూపాయిల టిక్కెట్ట్ 70రూపాయీలడిగారు. బ్లాకులో కొనడం ఇష్టంలేక ఆరోజు వదిలేసి మళ్ళీ 3 తేదీనాడు వెళ్ళాము.ఆశ్చర్యం అన్ని టిక్కెట్లు ఈజీగా దొరుకుతున్నాయి. అన్ని క్లాసుల్లో కూడా జనం చాలా పలుచగానే ఉన్నారు.సినిమా అస్సలు బాగాలేదోమో అందుకే రష్ ఇట్లా ఉంది అనుకుంటూనే మరో సినిమాకు వెళ్ళే తైమూ,ఒపికా లేక కూర్చుండిపోయాము.మొత్తం చూసినాక ఇద్దరమూ బాగానే ఉంది అని టీర్మానించాము.అట్లని సినిమాలో విమర్శించాల్సిన విషయాలు లేవనికాదు.ఐతే ఇక్కడ కొందరు విమర్శించుతున్న స్థాయిలో అందులో తప్పులు లేవు.
సినిమాలో దర్శకుడు పూరీ ఒకవైపు ఒకడు దర్శకుడు కావాలని,ఒకతె హీరోయిన్ కావాలని,మరొకడు నిర్మాత కావాలని ఎట్లా తపిస్తారో చూపిస్తూనే,మరోవైపు ప్రతిభలేని దర్శకులు అందులో పనిచేసేవాళ్ళను ,నిర్మాతలను కూడా ఎలా తిప్పలుబెడతారో ప్ర్తిభావంతగానే కథ పూర్వకంగా చిత్రించారు. ఒకవైపు ఒక సినిమా కథను నడిపిస్తూనే సినిమా వాళ్ళ తిప్పలు ,సమస్యలు చూపించటంలో తన ప్రతిభను కనబరిచారు,దర్శకులు పూరి. ఐతే సామాన్యుడు చూసి బాధ పడి తన సింపతీని వ్యక్తం చేయగలిగిన రీతిలో మాత్రం టియలేదు.కొన్ని అనవసరపు ఫైట్లు,అస్సలు ఆకట్టుకోని డాన్సులు,పాటలు ఈ సినిమాను నిజంగానే పాడు చేశాయి.ఒకవైపు సీరియస్ కథ,సినిమా జీవుల బాధలు చూపిస్తున్నప్పుడు అవికూడా చూపకుంటే సీట్లలో ప్రేక్షకులు అసహనంగా మెదులుతారో ఏమోనని అటువంటివి పెట్టినట్లున్నారు. అవి ఇంకా సారవంతంగా ,అంటే శ్రావ్యమైన పాటలతో,కనువిందైన డాన్సులతో సినిమా తీసివుంటే అందులో తప్పులు చాలా తక్కువగా కనిపించేవి.డైలాగులు స్పష్టంగానేవున్నా,సీరియస్ విషయాలకు సంబంధించినవి కాబట్టి,జోకులుకూడా కలిసి వున్నప్పటికి ప్రేక్షక మహాశయులు తగిన విధంగా ఎంజాయ్ చెయ్యలేదనే అనిపిస్తున్నది. పైన చెప్పిన ద్రుశ్యాలు తప్పించి
దర్శకుణ్ణి తప్పుబట్టాల్సినవి అంతగా లేకున్నా ప్రేక్షకులతోపాటు రివ్యూఇస్ట్‌లు కూడా తప్పుబట్టడం బాగాలేదు.
Posted by: Mr. ramulu ch At: 4, Jan 2009 9:16:46 PM IST