సుప్రీం 'మగధీర'
తొలి సినిమా 'చిరుత'తో ఫైట్స్, డాన్స్ లతో తన ప్రత్యేకతను చాటుకున్న రామ్ చరణ్ ఈసారి యాక్షన్ తో పాటు వయసుకు తగినట్టు యంగ్ లవర్ పాత్రలోనూ 'మగధీర' లో కనిపించబోతున్నారు. ఇంతవరకూ లవ్ సబ్జెక్ట్్లను హ్యాండిల్ చేయని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తొలిసారి ప్రేమకథా ఇతివృత్తంతో 'మగధీర' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పునర్జన్మల కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 400 ఏళ్ల క్రితం తమ ప్రేమను పండించుకోలేకపోయిన ఓ యువజంట పునర్జన్మ ఎత్తి తమ ప్రేమను ఎలా సఫలం చేసుకున్నారనే ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందుతోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్్ ఈ చిత్రాన్ని భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు మొదలయ్యాయి. చరణ్ తో కలిసి చిరంజీవి ఓ పాటలో స్టెప్స్ వేయడం, మరో సన్నివేశాలంలో అతిథిగా కనిపించడనుండటం ఈ చిత్రంపై మరింత క్రేజ్ ను పెంచుతోంది. మార్చి మొదటివారంలో పాటల విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం ఆడియో రైట్స్ ను భారీ మొత్తం ఆఫర్ చేసి సుప్రీం ఆడియో సంస్థ దక్కించుకుంది. ఆసక్తికరంగా సుప్రీం అధినేత రాజు హిర్వాని ఈ చిత్రానికి ఓవర్ సీస్ పంపిణీ హక్కులను కూడా సొంతం చేసుకున్నారు. అమెరికాలో బ్లూ స్కై సినిమా ఇన్ కార్పొరేషన్ ద్వారా ఆయన పంపిణీ చేపట్టనున్నారు.
నార్త్ అమెరికాలో 21 సెంటర్లలో 21 ప్రింట్లతో సినిమా విడుదలకు రాజు హిర్వాని సన్నాహాలు చేస్తున్నారు. అమెరికాలో ఇన్ని ప్రింట్లతో ఒక తెలుగు సినిమా రిలీజ్ కానుండటం విశేషం. రామ్ చరణ్ కు జోడిగా కాజల్ నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీహరి మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ లో సమ్మర్ కానుకగా 'మగధీర'ప్రేక్షకుల ముందుకు రానుంది.
Be first to comment on this News / Article!
|