ప్రియమణి ఇప్పుడు 'హాట్'
ప్రియమణి ఇప్పుడు 'హాట్' టాపిక్ అవుతోంది. గ్లామర్ తో పాటు పెర్ ఫారమెన్స్ కు అవకాశమున్న పాత్రల్లో ప్రియమణి ఎప్పటికప్పుడు తన సత్తాను చాటుకుంటూనే ఉంది. 'పెళ్లైన కొత్తలో' చిత్రంలో సంప్రదాయాలను గౌరవిస్తూనే ఆధునిక భావాలున్న అమ్మాయిగా ప్రియమణి నటనకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత 'యమదొంగ' మరో కమర్షియల్ బ్రేక్ వచ్చింది. అయితే తమిళంలో నటించిన 'పరుత్తి వీరన్' చిత్రం ఆమెకు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా గుర్తింపు తెచ్చింది. సహజంగా జాతీయ అవార్డు తర్వాత హీరోయిన్లు కమర్షియల్ చిత్రాల్లో ఇమడకలేకపోవచ్చనే అభిప్రాయం సహజం. ఆ అభిప్రాయాన్ని ప్రియమణి పటాపంచలు చేస్తూ, ప్రతిభను నిరూపించుకునే పాత్రలు ఎప్పుడో కానీ రావనీ, గ్లామర్ పాత్రల వల్ల మార్కెట్ నిలబడుతుందనీ నిశ్చితాభిప్రాయంతో ఉందని ఆమె తెలుగులో ప్రస్తుతం చేస్తున్న చిత్రాలను బట్టే చెప్పవచ్చు. ప్రస్తుతం బాలకృష్ణతో కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న పేరు పెట్టని చిత్రంలోనూ, నితిన్ సరసన 'ద్రోణ' చిత్రంలోనూ ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది. ఆసక్తికరంగా 'ద్రోణ' చిత్రంలో మునుపెన్నడూ కనిపించని రీతిలో ప్రియమణి హాట్ గా కనిపించబోతోంది. ఇందులో ప్రియమణి బికినీతో నటించిందంటూ ఇప్పటికే గట్టి ప్రచారం జరిగింది. ఆ వార్తను ప్రియమణి ఖండిచనూ లేదు. ఇప్పుడు బికినీ సన్నివేశాలకు రికొంత మషాలా చేరూస్తూ ప్రియమణి, హీరో నితిన్ పై ఓ వర్షం పాటను కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు.
నితిన్, ప్రియమణిపై చిత్రీకరిస్తున్న ఈ వర్షం సాంగ్ లో తడిసి ముద్దవుతూ క్రొంగొత్త సొగసులను వెండితెరపై పరచనుందని వర్కింగ్ స్టిల్స్ ను బట్టి అనుకోవచ్చు. నిక్సన్ నృత్యరీతులు సమకూర్చిన ఈ పాటకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం నెట్స్ లో ఈ రెయినీ సాంగ్ ఫోటోలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇటీవల సరైన హిట్స్ లేని నితిన్ సైతం ఈ చిత్రంపై, ప్రియమణి భాగస్వామ్యంపై ఎక్కువ అంచనాలే పెట్టుకున్నారు. జె.కరుణ కుమార్ దర్శకత్వంలో డి.ఎస్.రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 20న 'ద్రోణ' విడుదల కానుంది.
Be first to comment on this News / Article!
|