తాష్కెంట్ కు ఎన్టీఆర్
మార్చి 12 నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున విస్తృత స్థాయి ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న యంగ్ స్టార్ ఎన్టీఆర్ అంతకుముందే వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని ఒక దరికి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారు. 'ఆది', 'సాంబ' చిత్రాల తర్వాత ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్, వినాయక్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటూ టాకీ పార్ట్ పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు సాంగ్స్ చిత్రీకరణ కూడా జరుపుతున్నారు. ఎన్టీఆర్, హీరోయిన్ నయనతారపై ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక పాటను చిత్రీకరించారు. తాజాగా ఈ చిత్రం యూనిట్ రష్యా బయలుదేరేందుకు రెడీ అవుతోంది ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సాంగ్్ను తాష్కెంట్ లో రిచ్ గా చిత్రీకరించబోతున్నారు. రాజు సుందరం ఈ పాటకు కొరియోగ్రఫీ అందించనున్నారు.
ఈనెల 16 నుంచి 22 వరకూ ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది. వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్ పై కొడాలి నాని సమర్పణలో వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ, దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|