5లక్షల యూనిట్లతో మగధీర
ఆడియో రంగంలో పలు సంచలనాలు సృష్టించిన సుప్రీం మ్యూజిక్ సంస్థ తొలిసారి రామ్ చరణ్ 'మగధీర' చిత్రంతో పంపిణీరంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఈ చిత్రం ఆడియో హక్కులను కూడా భారీ మొత్తం ఆఫర్ తో సొంతం చేసుకుని ఆడియో పైరసీని అరికట్టేందుకు డిఫరెంట్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తోంది. మార్చి తొలివారంలో ఆడియో విడుదల చేసి అదేరోజు 5 లక్షల యూనిట్లను మార్కెట్ లోకి పంపుతున్నట్టు సుప్రీం అధినేత రాజు హిర్వాణి తెలిపారు.
గత ఏడాది 'ఒక్కమగాడు' తర్వాత తమ సంస్థ నుంచి వస్తున్న పెద్ద ఆల్బమ్ 'మగధీర' అనీ, రామ్ చరణ్ నటించిన రెండో సినిమా కావడంతో ఆడియోపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయనీ ఆయన తెలిపారు. ఈ అల్బమ్ రైట్స్ అందిపుచ్చుకోవడం ద్వారా తమ సంస్థ మరోసారి పెద్ద ఎత్తున మార్కెట్లోకి వెళ్తోందనీ, సంగీతప్రియులు నాణ్యత గల ఆడియోను అందించడం ద్వారా పైరసీని అడ్డుకునేందుకు పగడ్బందీ మార్కెటింగ్ ప్లానింగ్ అమలు చేయనున్నామనీ చెప్పారు. ఆడియో విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీదారులు ఎంపి3 మ్యూజిక్ తో మార్కెట్ ను ముంచెత్తుతున్నారనీ, దీనిని దృష్టిలో పెట్టుకుని చిరంజీవి, పవన్ కల్యాణ్ సినిమాల మ్యూజిక్ స్థాయిలో మొదటి రోజే ఐదు లక్షల యూనిట్లు విడుదల చేస్తున్నామనీ చెప్పారు. 'మగధీర' చిత్రంతో తొలిసారి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ లోకి అడుగుపెడుతున్నట్టు చెప్పారు. బ్లూ స్కై సినిమా ఇన్ కార్పొరేషన్స్ పేరుతో యుఎస్ఎలో పంపిణీ సంస్థను ప్రారంభించి 21 ప్రింట్లతో 21 సెంటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. యువహీరో తరుణ్ తో తమ సంస్థ ఓ చిత్రాన్ని కూడా నిర్మించనుందనీ, దీనికి రాజ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తారనీ చెప్పారు. ఈ చిత్రం ద్వారా కొత్త సంగీత దర్శకుని పరిచయం చేస్తామనీ, ఎక్కువ భాగం షూటింగ్ విదేశాల్లో ఉంటుందనీ తెలిపారు.
Be first to comment on this News / Article!
|