'వెంకటాద్రి' ఆడియో రిలీజ్
నందమూరి తారకరత్న కథానాయకుడుగా తుమ్మల ప్రసన్నకుమార్ సమర్పణలో రామకృష్ణా సినీ స్టూడియోస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'వెంకటాద్రి'. వి.సముద్ర దర్శకుడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం జూబ్లీహిల్స్ లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో సోమవారం రాత్రి కన్నులపండువగా జరిగింది. నందమూరి బాలకృష్ణ, శ్రీమతి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, జయ శంకర కృష్ణ, జానికి రామ్, కల్యాణ్ రామ్, చిత్ర సంగీత దర్శకుడు శ్రీకాంత్ దేవా, నటుడు రంగనాథ్, వి.సముద్ర తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. బాలకృష్ణ తొలి క్యాసెట్ ను ఆవిష్కరించి తొలి ప్రతిని పురందేశ్వరికి అందజేశారు. ఆడియో సీడీని పురందేశ్వరి ఆవిష్కరించి బాలకృష్ణకు అందజేశారు. వేదికపై స్వర్గీయ నందమూరి తారక రామారావు, శ్రీమతి బసవతారకం దంపతుల ఫోటోకు దండలు వేసి జ్యోతి ప్రజల్వన అనంతరం కార్యక్రాన్ని ప్రారంభించడం అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది.
బాలకృష్ణ మాట్లాడుతూ, ఒక సినిమా విజయానికి కథ, సంభాషణలు తర్వాత సంగీతం కీలక భూమిక వహిస్తుందనీ, ఈ చిత్రంలో నాన్నగారి పాటను ఒకటి రీమేక్ చేశారనీ తెలిపారు. ఇందులోని అన్ని పాటలు సందర్భోచితంగా ఉంటాయనీ, ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఘనత తమ తండ్రికి దక్కుతుందని పురందేశ్వరి పేర్కొన్నారు. రవివర్మ పెయింటింగ్స్ చూసి రామడు, కృష్ణుడు చూసి ప్రజలు ఆరాధించేవారనీ, అయితే నాన్నగారు ఆ పాత్రల పోషణ తర్వాత ఆయననే దేవుడుగా జనం ఆరాధించేవారనీ చెప్పారు. నటనకు ఆయన నిలువెత్తు నిదర్శమనీ, ఆయన చూపిన బాటలో ఆయన అంచనాలను తగ్గట్టుగా వ్యవహరించడమే నందమూరి తరం వారి బాధ్యతనీ, తన సోదరులు, మేనళ్లుల్లు ఆ స్థాయికి ఎదుగుతారని ఆశిస్తున్నాననీ అన్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. దక్కుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఎన్టీఆర్, ఎఎన్ఆర్ తో సుమారు 30 ఏళ్ల క్రితం 'సత్యం శివం సుందరం' చిత్రాన్ని తాను నిర్మించాననీ, తన పెళ్లి నాటికి బాలకృష్ణ చిన్న పిల్లాడని అన్నారు. ఇటీవల విడుదలైన 'పాండురంగడు'లో బాలకృష్ణ అద్భుతంగా నటించారనీ, తారకరత్న నటించిన వెంకటాద్రి చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాననీ అన్నారు. ఇందుకు కల్యాణ్ రామ్ స్పందిస్తూ, మా మేనమామ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సినిమా తీసినప్పుడు తాతగారు ఎన్టీఆర్ ఒక్కరే నందమూరి హీరోగా ఉండేవారనీ, ఇప్పుడు ఐదుగురు నందమూరి హీరోలు ఉన్నారనీ, అందరితోనూ మామయ్య సినిమాలు తీస్తే బాగుంటుందనీ అన్నారు. 'వెంకటాద్రి' చిత్రం ప్రమోషన్ చూస్తుంటే 'నరసింహనాయుడు', 'సింహాద్రి' గుర్తుకు వస్తున్నాయనీ, ఈ సినిమా కూడా అంతటి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు.
Be first to comment on this News / Article!
|