సుమంత్ సినిమా 'బోణి'
సుమంత్ కథానాయకుడుగా ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగుల తొలిసారి నిర్మాతగా మారి గ్రీన్ మ్యాంగోస్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రానికి 'బోణి' అనే టైటిల్ ను ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా రాజ్ పిప్పళ్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సోమవారంనాడు సుమంత్ పుట్టినరోజును పురస్కరించుకుని విష్పర్ వ్యాలీలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం టైటిల్ ను ప్రకటించారు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, డాక్టర్ డి.రామానాయుడు, లగడపాడి శ్రీధర్ తో పాటు సుమంత్, రమణగోగుల, రాజ్ పిప్పళ్ల తదితరులు ఈ సందర్భంగా హాజరయ్యారు. సుమంత్ బర్త్ డే కేక్ కట్ చేసి తన సంతోషాన్ని అందరితో పంచుకున్నారు.
అక్కినేని మాట్లాడుతూ, 'బోణి' చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమ మంచి ఫ్లేవర్ తెచ్చేందుకు రమణగోగుల, రాజ్ పిప్పళ్ల కలిసి చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని అన్నారు. ఈ ప్రయత్నం విజయవంతం కావాలని తాను కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. నాగార్జున మాట్లాడుతూ, పదేళ్ల క్రితం ఒక సినిమా షూటింగ్ కోసం కెనడా వెళ్లినప్పుడు రాజ్ పిప్పళ్లతో తనకు పరిచయమైందనీ, తెలుగులో ఒక సినిమా చేయాలని ఉందని అప్పుడు ఆయన తనతో అన్నారనీ, కెనడాలో పని పూర్తి చేసుకుని హైద్రాబాద్ కు రమ్మనిమని చెప్పాననీ అన్నారు. ఐదేళ్ల క్రితమే ఆయన హైద్రాబాద్ కు షిఫ్ట్ అయ్యారనీ, దర్శకత్వంపై ఆయనకున్న కమిట్ మెంట్ దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చనీ అన్నారు. రాజ్ , రమణగోగులతో కలిసి తాను పనిచేయాలని అనున్నప్పటికీ అది కార్యరూపంలోకి రాలేదన్నారు. సంగీత దర్శకుడిగా మంచి పేరున్న రమణ గోగుల ఈ సినిమాతో నిర్మాతగా మారడం సంతోషంగా ఉందన్నారు. తెలుగువారు ఆయవకాయని ఎంతో ఇష్టపడతారో, ఈ చిత్రం కూడా అంతగా అందరి ఇష్టపడతారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈరోజు తాను పరిశ్రమలో ఉన్నానంటే అందుకు కారణం నాగార్జునేనని రాజ్ పిప్పళ్ల పేర్కొన్నారు. ఈ సినిమా కోసం హీరో సుమంత్, నిర్మాత రమణగోగుల చక్కటి సహకారం అందించారని అన్నారు. ఇంతవరకూ సైలెంట్ గా షూటింగ్ చేసుకుంటూ వెళ్లామనీ, ఈ ఈవెంట్ తో పబ్లిసిటీ మొదలు పెట్టామనీ సుమంత్ పేర్కొన్నారు. ఇదే రోజు తన పుట్టినరోజు కూడా కావడం సంతోషంగా ఉందన్నారు. మార్చి నెలాఖరుకు ఆడియో, సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు.
Be first to comment on this News / Article!
|