పతాక సన్నివేశాల్లో బాలయ్య
జనవరి చివరి వారంలో అనంతపురం, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా రాజకీయ ప్రచారంలో పాల్గొన్న యువరత్న బాలకృష్ణ తిరిగి తన కొత్తచిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. బాలకృష్ణతో 'ఆదిత్య 369', 'భలేవాడివి బాసూ', 'వంశానికొక్కడు' వంటి చిత్రాలు నిర్మించిన శివలెంక ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం ద్వారా ఎస్.ఎస్.రాజమౌళి శిష్యుడు మహాదేవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గ్లామర్ నటిగా, 'పరుత్తి వీరన్'తో జాతీయ స్థాయి ఉత్తమనటిగా అవార్డు అందుకున్న ప్రియమణి తొలిసారి ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడిగా నటిస్తోంది.
అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్ లో ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. బాలకృష్ణతో పాటు ప్రధాన తారాగణమంతా ఇందులో పాల్గొంటున్నారు. ఈనెల 28 వరకూ జరిగే ఈ షెడ్యూల్ లో పతాక సన్నివేశాల చిత్రీకరణ కూడా జరుగుతుందనీ, దీంతో టాకీ పార్ట్ పూర్తవుతుందనీ శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు. మార్చిలో బ్యాలెన్స్ పాటలను విదేశాల్లో చిత్రీకరిస్తామని చెప్పారు. సమ్మర్ కానుకగా సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు.
Be first to comment on this News / Article!
|