దాసరి, తమ్మారెడ్డికి అవార్డులు
'పల్లెటూరు' కృష్ణమూర్తి
ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తండ్రిగారే తమ్మారెడ్డి కృష్ణమూర్తి. ఆయన 1950లో 'పల్లెటూరు' చిత్రం ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. హైద్రాబాద్ లో తెలుగు చిత్ర పరిశ్రమ వేళ్లూనుకోవడానికి వీలుగు సారధి స్టూడియో స్థాపించడానికి ఆయన ఎఁతో కృషి చేశారు. 'లక్షాధికారి', 'జమిందార్', 'బంగారు గాజులు', 'ధర్మదాత', 'డాక్టర్ బాబు' వంటి అనేక చిత్రాలతో నంది బహుమతులు, ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఇప్పుడు ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుకు ఆయన ఎంపిక కావడం పట్ల పరిశ్రమ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ముందు ఈ అవార్డును అందుకున్న వారిలో ఎల్.వి.ప్రసాద్, పి.పుల్లయ్య, బి.ఏ.సుబ్బారావు, ఎం.ఎం.రెహమాన్, కొసరాజు రాఘువయ్య చౌదరి, భానుమతి రామకృష్ణ, ముళ్లపూడి వెంకటరమణ-బాపు, బి.నాగిరెడ్డి , డివిఎస్ రాజు, అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, కె.విశ్వనాధ్, ఎస్.రాజేశ్వరరావు, దుక్కిపాటి మధుసూదనరావు, అంజలీదేవి, కె.ఎస్.ప్రకాశరావు, ఇంటూరి వెంకటేశ్వరరావు, వి.మధుసూదనరావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, పి.శాంతకుమారి, టి.ఎల్.కాంతారావు, అల్లురామలింగయ్య, పి.సుశీల, వి.బి.రాజేంద్రప్రసాద్, సి.కృష్ణవేణి, ఎం.ఎస్.రెడ్డి, డాక్టర్ డి.రామానాయుడు ఉన్నారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|