కొండా కృష్ణంరాజు చిత్రావళి
అదిత్య ప్రొడక్షన్స్ పతాకంపై బాలకృష్ణతో 'విజయేంద్ర వర్మ', నాగార్జునతో 'శ్రీరామదాసు' వంటి భక్తిరస చిత్రాన్ని అందించిన ప్రముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు ఈ ఏడాది 2 చిత్రాలను నిర్మించనున్నట్టు ప్రకటించారు. ఈ రెండు చిత్రాలు సంస్థ ప్రతిష్టను మరింత పెంచేలా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.
ఆదిత్య ప్రొడక్షన్స్ నెంబర్-3 చిత్రం మే 5న ప్రారంభిస్తున్నామనీ, ఇందులో ఓ ప్రముఖ హీరోతో పాటు, ఓ తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నామనీ ఆయన తెలిపారు. అలాగే కొత్త దర్శకుడ్ని కూడా ఈ చిత్రంతో పరిచయం చేస్తున్నట్టు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని ఓ వింత సాంప్రదాయాన్ని ఓ గ్రామంలో పాటిస్తుంటారనీ, ఆ సందర్భంగా ఎదురయ్యే పరిణామాల్ని పేరడీగా ఆద్యంత వినోదాత్మకందా ఈ చిత్రంలో చూపించనున్నామనీ చెప్పారు. కేరళలోని త్రిచూర్ జిల్లాకు చెందిన ఓ గ్రామంలో 70 రోజుల పాటు షూటింగ్ కు ప్లాన్ చేశామనీ, ఈ చిత్రానికి ఎడిటర్ గా గౌతంరాజును ఎంపిక చేశామనీ చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు. నవంబర్ నుంచి మరో భారీ చిత్రాన్ని ఓ అగ్ర హీరోతో ప్లాన్ చేసినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం సబ్జెక్ట్ రెడీ అవుతోందని చెప్పారు.
Be first to comment on this News / Article!
|