సేవలకు గుర్తింపు: తమ్మారెడ్డి
తెలుగు చిత్ర పరిశ్రమకు తాను అందించిన సేవలకు గుర్తింపుగా రఘుపతి వెంకయ్య అవార్డు లభించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు. 2007 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు ఆయనకు బుధవారంనాడు ప్రకటించారు.
ఎన్టీఆర్, ఎఎన్ఆర్, శోభన్ బాబు వంటి హీరోలతో పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించారు. తెలుగు పరిశ్రమ హైద్రాబాద్ లో స్థిరపడేందుకు సారథి స్టూడియోస్ ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. కార్మిక సమస్యలను పరిష్కరించడంలోనూ, ట్రేడ్ యూనియన్ నాయకుడుగానూ చురుకుగా పనిచేశారు. ఎన్టీఆర్ తో 'లక్షాధికారి', అక్కినేనితో 'ధర్మదాత', 'జమిందార్'. 'శ్రీమంతుడు', 'దత్తపుత్రుడు', శోభన్ బాబుతో 'డాక్టర్ బాబు' వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. ఆయన తనయులైన లెనిన్ బాబు దర్శకుడు కాగా, తమ్మారెడ్డి భరద్వాజ దర్శకనిర్మాతగా, ప్రస్తుతం నిర్మాత మండలి అధ్యక్షుడుగా కూడా పరిశ్రమకు సుపరిచితులు.
Be first to comment on this News / Article!
|