దాసరికి ఎన్టీఆర్ అభినందన
తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రతిష్ఠాత్మక ఎన్టీఆర్ జాతీయ అవార్డునుకు ఎంపిక కావడంతో పరిశ్రమ వర్గాల్లో హర్షాతిరేకం వ్యక్తవుతోంది. దాసరి ఇంటినిండా బుధవారంనాడు పండుగ వాతావరణం నెలకొంది. పరిశ్రమలోని 24 విభాగాలు చెందిన ప్రముఖులంతా దాసరిని అభినందలతో ముంచెత్తారు. ఎన్టీఆర్ అవార్డును దాసరికి ప్రకటించారనే వార్త తెలిసిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు కొడాలి నానితో కలిసి దాసరిని కలుసుకుని అభినందనలు తెలియజేశారు. సినీ రచయితల సంఘం తరఫున పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, కార్యదర్శి రాంప్రసాద్, దర్శకులు బి.గోపాల్, కృష్ణారెడ్డి తదితర ప్రముఖులంతా దాసరికి అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు. నటరత్న ఎన్టీఆర్ తో 'బొబ్బిలి పులి', 'సర్దార్ పాపారాయుడు' వంటి సంచలన హిట్ లు దాసరి ఇచ్చారనీ, ఇప్పుడు ఎన్టీఆర్ జాతీయ అవార్డు దాసరిని వరించడం అభినందనీయమని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
Be first to comment on this News / Article!
|