'హౌస్ పుల్' ఆడియో రిలీజ్
విపిన్, వేగ, ఆర్య ప్రధాన పాత్రల్లో ఫిల్మోత్సవ్ పతాకంపై చంద్రసిద్దార్ధ నిర్మిస్తున్న చిత్రం 'హౌస్ ఫుల్'. అజయ్ భుయాన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుక హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో బుధవారంనాడు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న డి.సురేష్ బాబు ఆడియో సీడీని ఆవిష్కరించి శ్రీనువైట్లకు అందించారు. వి.వి.వినాయక్ ఆడియో క్యాసెట్ ను ఆవిష్కరించి తొలి క్యాసెట్ ను లగడపాటి శ్రీధర్ కు అందజేశారు.
పరిశ్రమలోకి కొత్తగా వచ్చిన తనలాంటి వారెందరినో చంద్ర సిద్ధార్థ ప్రోత్సహించేవారనీ, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆయన నిర్మాతగా కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాననీ శ్రీనువైట్ల పేర్కొన్నారు. చంద్రసిద్ధార్ధ తనకు గురువనీ, ఆయనే తనను పరిశ్రమకు పరిచయం చేశారనీ ఆర్.పి.పట్నాయక్ అన్నారు. చంద్ర సిద్దార్ధ దర్శకుడు అయి ఉండి కూడా సొంత బ్యానర్ లో మరో దర్శకుడ్ని పరిచయం చేయడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. చంద్రసిద్దార్ధ మాట్లాడుతూ, స్వేచ్ఛ, సృజనాత్మకత, వ్యాపారాత్మక కళ కలిసినప్పుడే అది సినిమా అవుతుందనీ, ఆ తరహాలోనే ఈ సినిమా ఉంటుందనీ చెప్పారు. దర్శకుడు ఈ చిత్రాన్ని చాలా చక్కగా మలిచారనీ, అనూప్ రూబెన్స్ వీనులవిందైన సంగీతం అందించారని చెప్పారు. ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుదనే నమ్మకంతో ఉన్నట్టు తెలిపారు. దర్శకుడు అజయ్ భూయాన్, మరో దర్శకనిర్మాత కూచిపూడి వెంకట్, గీత రచయితలు చైతన్య ప్రసాద్, పెద్దాడ మూర్తి, అనూప్ రూబెన్స్, హీరో విపిన్, నటుడు ఆర్.కె, రచయిత బలభద్రపాత్రుని రమణి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|