దుబాయ్ లో నితిన్-ఇలియానా
నితిన్, ఇలియానా తొలిసారి జంటగా శ్రీ స్పెక్ట్రా మీడియో పతాకంపై జి.వెంకటరమణ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరుచూరి మురళ దర్శకుడు. తనుషియా, దుబాయ్ లలో జరిపే భారీ షెడ్యూల్ కు చిత్రయూనిట్ వెళ్తోంది.
మంచి కథ, టెక్నీషియన్లతో రూపొందుతున్న ఈ చిత్రం ఇంవతరూ 40 శాతం షూటింగ్ పూర్త చేసుకుందనీ, మార్చి 1 నుంచి ఏప్రిల్ 3 వరకూ తనుషియా, దుబాయ్ లలో జరిపే షెడ్యూల్ తో 90 శాతం షూటింగ్ పర్తవుతుందనీ నిర్మాత రమణ తెలిపారు. పరుచూరి మురళి మాట్లాడుతూ, క్రమశిక్షణ మారుపేరుగా ఈ చిత్ర నిర్మాతను చెప్పుకోవాలనీ, ఈ చిత్రం తర్వాత స్పెక్ట్రా మీడి ఓ మంచి నిర్మాణ సంస్థగా నిలిచిపోతుందనీ చెప్పారు. నితిన్ ఈ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాగా కష్టపడుతున్నారనీ, అలాగే నితిన్ -ఇలియానా మధ్య కెమిస్త్రీ తెరపైన మరింత అందగా ఉంటుందనీ చెప్పారు. తన దర్శకత్వంలో వచ్చిన 'నీ స్నేహం', 'పెదబాబు', 'ఆంధ్రుడు' చిత్రాల కన్నా భిన్నంగా మంచి ఎంటర్ టైన్ మెంట్ ఈ చిత్రంలో ఉంటుందని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సునీల్, ఎంఎస్ నారాయణ, సుమన్ శెట్టి, హేమ, రమాప్రభ తదితరులు నటిస్తున్నారు. రమేష్ - గోపి మాటలు, సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|