జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా
శ్రీ షిర్డీ సాయిబాబు చరిత్రను ఇతివృత్తంగా తీసుకుని ఎస్.ఆర్.ఆర్.క్రియేషన్స్ పతాకంపై 'జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబు' అనే కొత్త చిత్రం ప్రారంభమైంది. షిర్డీ సాయిబాబా పాత్రను బి.వి.రెడ్డి పోషిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.రామకృష్ణ దర్శకుడు. హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25లోని ఓ ప్రైవేటు బంగ్లాలో గురువారంనాడు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమంది. సాయిబాబా పాత్రధారి బిఎన్ రెడ్డిపై తీసిన ముహూర్తం సన్నివేశానికి ప్రముఖ నటుడు ఎం.మోహన్ బాబు క్లాప్ ఇవ్వగా, రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జానారెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు.
బివి రెడ్డి మాట్లాడుతూ, షిర్డీ సాయిబాబాపై గతంలో వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాను రూపొందిస్తామని చెప్పారు. సిపాయిల తిరుగుబాటు,. ఆంగ్లేయుల పాలనలో మతసామరస్యం కోల్పోవడం వంటి అనే సంఘటనలు నాటి సమాజాన్ని అతలాకుతలం చేశాయనీ,అలాంటి తరుణంలో కుల, మత రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు, శాంతి ప్రేమ తత్వాన్ని బోధించేందుకు సాయిబాబా మానవరూపంలో అవతరించారని అన్నారు. ఆ కరుణామూర్తి జీవిత ఇతివృత్తాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరిస్తామనీ, బాబా పాత్రను పోషిస్తుండటం సంతోషంగా ఉందనీ అన్నారు. దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ, దేవుడు ఒక్కడే అని ఈ చిత్రంలో చూపంచనున్నామనీ, బాబా బాల్యంతో పాటు తత్వవేత్తగా, సంఘసంస్కర్తగా కూడా ఆయన గొప్పతనాన్ని ఇందులో విశిదీకరిస్తామనీ తెలిపారు. నెలరోజుల పాటు జరిగే సింగిల్ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుందన్నారు. 15 రోజుల పాటు ఇదే బంగ్లాలో ఐదు సెట్స్ లో షూటింగ్ చేస్తామనీ, మిగిలిన రోజుల హైద్రాబాద్ పరిసరాల్లో షూటింగ్ చేస్తామని చెప్పారు. ఈ చిత్రంలో తాత్యా పాత్ర పోషిస్తున్న సత్యారెడ్డి మాట్లాడుతూ, గతంలో తాను నిర్మించిన 'సర్దార్ చిన్పరెడ్డి' చిత్రంలో టైటిల్ పాత్రను బి.వి.రెడ్డి పోషించారనీ, ఇప్పుడు ఆయనతో కలిసి ఓ కీలక పాత్ర పోషిస్తుండటం సంతోషంగా ఉందనీ చెప్పారు. ఈ చిత్రంలో దాసగణు పాత్రను పోషిస్తున్నట్టు శ్రీనివాసరెడ్డి పేర్కొనగా, ఏడు పాటలు ఈ చిత్రంలో ఉన్నట్టు సంగీత దర్శకుడు లలిత్ సురేష్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇత పాత్రల్లో నాగబాబు, సుమన్, శివకృష్ణ, బ్రహ్మాజీ, నారాయణరావు, రఘునాథరెడ్డి, రామిరెడ్డి, కోట శంకర్ రావు, గుండు హనుమంతరావు, హేమసుందర్, శివపార్వతి, రమాప్రభ తదితరులు నటిస్తున్నారు. కొమ్మనాపల్లి గణపతిరావు మాటలు, అశోక్ తేజ-గురుచరణ్-పరిమి రామనరసింహం మాటలు, శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|