'మనసు పిలిచింది' ప్రారంభం
కిరణ్ , సుహాని హీరోహీరోయిన్లుగా ఇందూస్ ఇన్ స్పిరేషన్ అనే నూతన నిర్మాణ సంస్థ 'వయసు పిలిచింది' (జస్ట్ లైక్ దట్) అనే చిత్రానికి శ్రీకారం చుట్టింది. ప్రీతమ్ షూటింగ్ మొదలైంది. కిరణ్, సుహాని, శివాజీరాజాలపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి పారిశ్రామిక వేత్త సారిపల్లి కొండలరావు కెమెరా స్విచ్చాన్ చేయగా, అమృత్ గౌడ్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు.
ఇది ఒక మంచి ప్రేమ కథా చిత్రమని దర్శకుడు ప్రీతమ్ తెలిపారు. దర్శకుడుగా ఇది తనకు తొలి చిత్రమని పేర్కొన్నారు. రెగ్యులర్ షూటింగ్ హైద్రాబాద్ పరిసరాల్లో జరుపుతామని నిర్మాత కాంతారావు తెలిపారు. ఇందులో చిరంజీవి అభిమాని అయిన ఆటోడ్రైవర్ పాత్రను పోషిస్తున్నాననీ, ప్రేమికులకు సహాయపడుతుంటాననీ చెప్పారు. హీరోగా తనకిది తొలి చిత్రమని కిరణ్ పేర్కొనగా, ఇందులో అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు తన కృతజ్ఞతలని సుహాని తెలిపింది. ఈ చిత్రంలోని ఇతర పాత్రలో శరత్ బాబు, యమున తదితరులు నటిస్తున్నారు.కృష్ణ సినిమాటోగ్రఫీ, ఎస్.దీపు ఎడిటింగ్, మనోమూర్తి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|