సుశీల ట్రస్ట్ ద్వారా పెన్షన్
ప్రముఖ గాయని పద్మభూషణ్ పి.సుశీల తన పేరుతో నెలకొల్పిన 'పి.సుశీల ట్రస్ట్' ద్వారా పేద, వృద్ధ కళాకారులకు పెన్షన్ పథకాన్ని శుక్రవారం ప్రారంభించారు. హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో పాతతరం కళాకారులు అనుపమా విల్సన్, ప్రకాశరావులకు పి.సుశీల చెరో రెండు వేల రూపాయల పెన్షన్ అందజేశారు. ప్రతి నెలా ఈ ఇద్దరికీ పెన్షన్ ను అందజేస్తామని సుశీల తెలిపారు.
ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ 'సంగమ్ ' సంజయ్ కిషోరో మాట్లాడుతూ, అనుపమా సంస్థ నిర్మించిన 'భూమికోసం' సినిమా ద్వారా నేపథ్యగాయకునిగా పరిచయమైన విల్సన్ కు ఇప్పుడు 67 ఏళ్లనీ, 'కరుణామయుడు', 'కొల్లేటి కాపురం', 'మోసగాడు' చిత్రాలతో పాటు అనేక
ప్రైవేటు ఆల్బమ్స్ లో పాటలు పాడరనీ, ప్రకాశరావు సంగీత దర్శకుడు చక్రవర్తి, కోటి వద్ద ఎన్నో చిత్రాలకు వయోలినిస్ట్ గా పనిచేశారనీ చెప్పారు. ఈ ఇద్దరూ అనారోగ్యంతో బాధపడుతున్నారనీ, వారికి ఈ పెన్షన్ చిన్నపాటి ఓదార్పునిస్తుందననేది తమ ఆకాంక్ష అనీ అన్నారు.
Be first to comment on this News / Article!
|