ఛార్మికి హ్యాపీ 'వాలంటైన్'
ఛార్మింగ్ అందాల ఛార్మికి ఈసారి వాలంటైన్స్ డే ఎప్పటికీ గుర్తిండిపోనుంది. ఒక వైపు ఛార్మి నటిస్తున్న వరుస చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ఆమెకు కమర్షియల్ సక్సెస్ తో పాటు మంచిపేరు తెచ్చిపెట్టిన 'మంత్ర' చిత్రానిగా గాను 2007 సంవత్సరానికి ఉత్తమ నటిగా ఈ శనివారమే నంది అవార్డును అందుకోబోతోంది. సరిగ్గా వారం రోజుల తేడాలో ఈనెల 20న ఛార్మి ప్రధాన పాత్ర పోషించిన '16 డేస్' చిత్రం విడుదలవుతోంది.
'అనుకోకుండా ఒకరోజు'. 'మంత్ర' చిత్రాల తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన ఛార్మి '16 డేస్' చిత్రంపై గట్టి హోప్సే పెట్టుకుంది. గ్లామర్ పరంగానూ ఆమె ఇందులో ఆడియెన్స్ ను కనికట్టు కట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు పబ్లిసిటీ పోస్టర్లను బట్టి చెప్పవచ్చు. దీనికితోడు మహేష్ సోదరి మంజలుతో కలిసి నటించిన 'కావ్యాస్ డైరీ', వేణుతో నటించిన 'మాయగాడు'. మరో చిత్రం 'మనోరమ' కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ మూడు చిత్రాలు ఛార్మి చుట్టూ తిరిగే కథాంశాలతో రూపొందినవే. వీటికి తోడు పవన్ దర్శకత్వంలో రాజశేఖర్ నిర్మిస్తున్న 'సయ్యాట' (అధికారికంగా ప్రకటించాల్సి ఉంది) చిత్రంలో కూడా ఛార్మి ప్రధాన భూమిక పోషిస్తోంది. ఛార్మి సరసన విలన్ నుంచి హీరోగా ఎదిగిన అజయ్ నటిస్తున్నారు. 'వాలంటైన్స్ డే'కి నంది అవార్డు అందుకుంటున్న ఛార్మి తన రాబోయే చిత్రాలతో మరిన్ని నందులను దక్కించుకుంటుందని ఆశిద్దాం.
Be first to comment on this News / Article!
|