ప్రియమణి 'బికినీ' లుక్
షారూక్, సెక్స్ రెండూ బాక్సాఫీస్ కనకవర్షం కురింపించే మార్గాలని బాలీవుడ్ ఈమధ్య ఓ కమర్షియల్ సూత్రం కనిపెట్టింది. దక్షిణాది సినిమాలకు ఇంకా అలాంటి సూత్రాలేవీ రాలేదు కానీ, హీరోయిన్ల గ్లామర్ మాత్రం ఇటీవల పదునెక్కుతోంది. తమిళ 'బిల్లా' చిత్రంలో నయనతార తొలిసారి బికినీ వేసుకుని బాక్సాఫీస్ కనికట్టు కట్టింది. నిర్మాతలు రెండు చేతులతోనూ డబ్బులు దండుకుంటే, నయనతార ఒక్కసారిగా కోటి రూపాయల పారితోషికం డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిపోయింది. ఆమె వాడిన బికినీ వేలంపాటలో లక్ష రూపాయలకు ఎగరేసుకుపోయారు. ఇప్పుడు అదే 'బిల్లా' తెలుగు రీమేక్ లో నయనతార పాత్రను అనుష్క పోషిస్తోంది. అయితే 'బికినీ' వ్యవహారాన్ని గుట్టుగానే ఉంచుతున్నారు. అనుష్క మాటెలా ఉన్నా మలయాళ ముద్దుగుమ్మ ప్రియమణి తెలుగు ప్రేక్షకులకు తన బికినీ అందాలను'ద్రోణ'లో పంచనుంది. బోనస్ గా ఓ వర్షం సాంగ్ లోనూ తెల్లచీరతో తళుక్కు మనబోతోంది..
నితిన్ హీరోగా జె.కరుణకుమార్ దర్శకత్వంలో డి.ఎస్.రావు 'ద్రోణ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియమణి బికినీ షో చేయనుందని మొదట్నించీ ప్రచారంలో ఉన్నా ప్రియమణితో సహా అందరూ గుట్టు పాటిస్తూనే వచ్చారు. అయితే ఇప్పుడిప్పుడే పబ్లిసిటీ మొదలుపెట్టారు. ఇదే క్రమంలో పబ్లిసిటీ పోస్టర్ల (వాల్ పేపర్స్ ) రూపంలో ఇప్పుడు ప్రియమణి 'బికినీ' వ్యవహారమూ బయటకు వచ్చింది. బికినీలో ప్రియమణి కన్ను చెదరగొడుతూ యువ హీరోయిన్లతో పాటు నెంబర్ వన్ రేసుపై కన్నేసిన వారికి కూడా గట్టి సవాల్ ఇవ్వబోతోంది. ప్రియమణి బికినీ వ్యవహారం జనానికి నచ్చితే ఆమెను బుక్ చేసుకోవాలనే నిర్మాతలు ఇక ముందు కోటి రెడీ చేసుకోవాల్సిందే...
Read 1 Comment(s) posted so far on this News / Article!
|