రవితేజ సరసన నయనతార
రవితేజ హీరోగా పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నటుడు గణేష్ బాబు నిర్మించనున్న చిత్రంలో నయనతార హీరోయిన్ గా ఎంపికైంది. రవితేజతో 'భద్ర', వెంకటేష్ తో 'తులసి' వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో కథానాయికగా ఎంపికైనా విషయాన్ని నయనతార ధ్రువీకరించింది.
బోయపాటి శ్రీను చెప్పిన కథ చాలా ఇంటస్ట్రింగ్ గా ఉందనీ, తన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ నయనతార తెలిపారు. రవితేజ కాంబినేషన్ లో 'దుబాయ్ శీను' వంటి హిట్ తర్వాత ఈ చిత్రంలో నటిస్తుండటం సంతోషంగా ఉందని నయనతార తెలిపారు. ప్రస్తుతం ఆమె తెలుగులో వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. రవితేజ-నయనతార కాంబినేషన్
చిత్రానికి సబ్జెక్ట్ రెడీ అయిందనీ, మార్చి 3వ వారంలో షూటింగ్ ప్రారంభించి ఏకథాటిగా జరిపే సింగిల్ షెడ్యూల్ తో సినిమా పూర్తి చేస్తామనీ గణేష్ బాబు తెలిపారు. ఈ చిత్రానికి రవికిరణ్ బాబు సమర్పకుడుగా వ్యవహరిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|