'పోకిరి' మిస్సయ్యానుః కంగన
ప్రభాస్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆదిత్యా రామ్ మూవీస్ పతాకంపై ఆదిత్యారామ్ నిర్మించనున్న భారీ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు అంగీకరించాననీ, సౌత్ లో తనకు ఈ చిత్రం మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాననీ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తెలిపారు.
హిందీలో 'రాజ్ 2', 'ఫ్యాషన్ ' వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుని ప్రస్తుతం హృతిక్ రోషన్ 'కైట్స్' చిత్రంలో నటిస్తున్న కంగనా శుక్రవారంనాడు పూరీ జగన్నాథ్ సినిమా విషయంలో హైద్రాబాద్ వచ్చి ఈ ప్రాజెక్ట్ ను ఫైనలైజ్ చేశారు. పూరీ జగన్నాథ్ గతంలోనే 'పోకిరి' చిత్రానికి డేట్స్ అడిగారనీ, అప్పుడు 'గ్యాంగ్ స్టర్' చిత్రం షెడ్యూల్ లో ఉన్నందున ఆ సినిమాలో చేయలేకపోయాయనీ కంగన తెలిపింది. ఆ తర్వాత తెలుగులో పలు ఆఫర్లు వచ్చినా తొలిచిత్రం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లోనే చేయాలని డిసైడ్ కావడంతో ఏ సినిమాకీ కమిట్ కాలేదనీ, ఇప్పుడు ఆయనే ప్రభాస్ తో చేస్తున్న సినిమా స్టోరీలైన్, నా క్యారెక్టర్ చెప్పడంతో ఎంతగానో ఇన్ స్పైర్ అయి వెంటనే అంగీకరించినట్టు పేర్కొంది. పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ, హిందీతో పాటు హాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తున్న కంగనా టాప్ పొజిషనల్ ఉందనీ, గ్లామర్ తో పాటు ప్రతిభావంతురాలైన నటీ అనీ అన్నారు. 'పోకిరి' చిత్రంలోనే కంగన నటించాల్సిందనీ, ఇప్పుడు ప్రభాస్ చిత్రంలో ఆమె క్యారెక్టర్ హైలైట్ గా ఉంటుందనీ చెప్పారు. మార్చిలో షూటింగ్ ప్రారంభించి ఏకథాటిగా జూలై వరకూ జరిపే షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుందనీ, ఆగస్టులో రిలీజ్ ఉంటుందనీ తెలిపారు.
Be first to comment on this News / Article!
|